Others

నేను - సాలీడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేను నిర్మించుకున్న జీవితం
సాలీడు అల్లుకున్న గూడు
లోతుగా తరచి చూస్తే
రెండూ ఒకలా కనిపిస్తున్నాయ

ఎన్నో దారాల కట్టడం
క్షణభంగురంలా అనిపించినా
నిత్య మార్గదర్శిగా కనిపిస్తుంది
అన్ని అల్లికలు చూసినప్పుడు
గజిబిజి గందరగోళంలా
ఇవన్నీ అవసరమా
అన్న నాలోని ప్రశ్నకు
జవాబులూ ఉన్నాయందులోనే

ఆశలు ఆశయాల సౌధంలా
కోర్కెలూ వైరాగ్యాల తత్వంలా
స్పందనలు స్పర్థల నడుమ
పోరాటాలు సర్దుబాట్ల
రైలు పట్టాలపైన
ప్రేమలు ఆప్యాయతలు
స్వార్థాలూ త్యాగాలు
వ్యాపారాలు విలువలు
స్నేహాలు శత్రుత్వాల మధ్య
చిక్కుకున్న జీవితాన్ని
వాటన్నింటి సమాహారంలా
చూడమని ఆ సాలీడు
తన గూడు ద్వారా
నాకు సందేశాన్ని ఇచ్చిందని
లోనున్న ఓ స్వాప్నికుడు
అరమరికలు లేక
ఇచ్చిన సమాధానంతో
అల్లికల వెనుకనున్న నిజం
నిక్కచ్చిగా తెలిసింది మరి

అందుకే నేనూ ఓ సాలీడునే
నా జీవన ప్రయాణంలో..

- జంధ్యాల రఘుబాబు, 9849753298