Others

గాలిమేడలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం
కలల లోకంలో
విహరిస్తూ..
ఊహల పల్లకీలో
ఊరేగుతూ..
ఊపిరి పోసే గాలిమేడలు
చివరికి నీటిపై రాసిన రాతలవుతాయి!

కోరికల జలధిలో
ఓలలాడుతూ..
రూపుదిద్దే ఆశాసౌధాలు
మనల్ని
త్రిశంకు స్వర్గంలోకి లాక్కొని వెళ్లి
మన అసమర్థత జాడలు తెలిపే
నీడలవుతాయి

నిశీధి సమయాన
స్వప్నంలో నిర్మించే
ఆశాగోపురాలు...
తెల్లవారాకా..
ఎగిరిపోయే పావురాలవుతాయి!

స్వేదంతో
మేధను జతకట్టి
స్వీయ ప్రతిభతో
జీవం పోసే
ఆశయ సౌధాలు..
విజయతీరానికి బాటలు వేస్తాయి!

-దాస్యం సేనాధిపతి 9440525544