AADIVAVRAM - Others

టెస్ట్‌ట్యూబ్ మొక్కలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీరు చదివింది నిజమే.. ప్రపంచంలోని అనేక చెట్ల జాతులు వేగంగా అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న చెట్లలో ఐదింట ఒకటి అంతరించిపోయే ప్రమాదం ఉంది. దీంతో శాస్తవ్రేత్తలు వాటిని పరిరక్షించడంపై దృష్టి సారించారు. దానిలో భాగమే టెస్ట్‌ట్యూబుల్లో చెట్లను పెంచడం. అటవీ వృక్షాల పరిరక్షణలో భాగంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇలాంటి వృక్షాలను ఉత్పత్తి చేయడానికి ప్రయోగాలు జరుగుతున్నాయి. బ్రిటన్‌లోని వెస్ట్ ససెక్స్‌లో క్యూస్ మిలీనియం సీడ్ బ్యాంకులో పనిచేస్తున్న డాక్టర్ జాన్ డికీ ఈ టెస్ట్‌ట్యూబ్ చెట్ల విధానం ఓ ఇన్సూరెన్స్ పాలసీ వంటిదని చెబుతాడు. అక్కడున్న ఉన్న రేడియేషన్ ప్రూఫ్ నేలమాళిగల్లో అంతరించిపోయే ప్రమాదమున్న విత్తనాలను భద్రపరుస్తున్నారు. 2020 నాటికి అంతరించిపోయే ప్రమాదం ఉన్న వృక్షాల్లో కనీసం 75 శాతం వృక్ష జాతులను పరిరక్షించడం వీరి లక్ష్యం.
నేచర్ ప్లాంట్స్ పత్రిక ప్రకారం మొత్తం చెట్లలో 33 శాతం, ఔషధ సంబంధమైన మొక్కల్లో పది శాతం అంతరించిపోయే ప్రమాదం ఉంది. అందుకే వీటి విత్తనాలను సీడ్ బ్యాంక్‌లోని ఫ్రీజర్‌లో భద్రపరుస్తున్నారు. అన్ని రకాల మొక్కల విత్తనాలను ఎండబెట్టి భద్రపరచడం సాధ్యం కాదు కాబట్టి క్రయోప్రిజర్వేషన్ (అతి శీతలీకరణ ద్వారా చెట్ల పరిరక్షణ) చేస్తున్నారు. సింధూర వృక్షం, చెస్ట్‌నట్ విత్తనాలు చాలా సున్నితమైనవి. వీటిని ఎండబెడితే వాటి నుంచి మొక్కలు రావు. ఇలా భద్రపరచడానికి కష్టమైన విత్తనాల పరిరక్షణ కోసం క్రయోప్రిజర్వేషన్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నారు. క్రయోప్రిజర్వేషన్‌లో మొక్క బీజాన్ని విత్తనం నుంచి వేరుచేసి, దాన్ని ద్రవరూప నైట్రొజన్‌లో అతి శీతల ఉష్ణోగ్రత వద్ద ఘనీభవింపజేస్తారు. అయితే ఇలాంటి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు, ఉన్నదాన్ని మరింత మెరుగుపరిచేందుకు ఇంకా భారీస్థాయిలో పెట్టుబడులు అవసరం. ప్రస్తుతం మిలీనియం సీడ్ బ్యాంకులో నలభై వేల అటవీ మొక్కల జాతులను మైనస్ 20 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద భద్రపరిచారు. ప్రపంచంలోని మరికొన్ని ప్రాంతాల్లో వరిలాంటి ఇతర జాతులను పరిరక్షించే ప్రయత్నం జరుగుతోంది. ఇలాంటి సీడ్ బ్యాంకుల ఉపయోగం ఇప్పటికే కనిపిస్తోంది. బ్రిటన్‌లో అంతరించిపోతున్న పచ్చిక బయళ్లను సీడ్‌బ్యాంకులో భద్రపరిచిన విత్తనాల ద్వారా పరిరక్షించే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఇప్పటికే లేబరేటరీలోని టెస్ట్‌ట్యూబులో ఒక చిన్న సింధూర వృక్షం మొలకెత్తుతోంది. త్వరలో మరిన్ని అంతరించిపోతున్న మొక్కలు ఇదేవిధంగా మొలకెత్తనున్నాయి.

-మహి