Others

వీధి కుక్కలపై విశాల్ సినిమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవలే ఓ సినిమా ప్రమోషన్స్‌లో విశాల్ -వరలక్ష్మితో పెళ్లి వ్యవహారంతోపాటు ఆ రెండో ప్రశ్న కూడా మీడియా వాళ్లు అడిగారు. దర్శకత్వం ఎప్పుడు? అని ప్రశ్నిస్తే తప్పకుండా వచ్చే ఏడాది ఉంటుంది. త్వరలోనే దానిపైనా అప్‌డేట్ అందిస్తానని అన్నాడు. విశాల్ చెప్పినట్టే ఆ అప్‌డేట్ రానే వచ్చింది. ఓ ప్రయోగాత్మక కథాంశంతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఇంతకాలం ఎవరూ టచ్ చేయని పాయింట్‌ను ఎంచుకుని పూర్తిస్థాయి కమర్షియల్ చిత్రంగా రూపొందించనున్నాడట. ఇంతకీ విశాల్ ఎంచుకున్న కానె్సప్టు ఏంటి అంటే.. సమ్‌థింగ్ స్పెషల్.. సర్‌ప్రైజ్‌నిచ్చేదే. అతడు వీధి కుక్కలపై సినిమా తీస్తున్నాడట. వీధికుక్కలు, కుక్కపిల్లలు ఎంతో స్వేచ్ఛగా బతుకుతాయి. వాటిని హింసించే ఓనర్ అనేవాడే ఉండడు. అందుకే అవి ఎంతో స్వేచ్ఛా విహారం చేస్తూ హాయిగా బతికేస్తాయి. ఇళ్లలో పెంచుకునే కుక్కలతో పోలిస్తే బెటర్ లైఫ్ అనేది అతడి కానె్సప్టు. వినడానికే బోలెడంత ఫన్నీగా ఉన్న ఈ పాయింట్‌ని 2.30 గంటల సినిమాగా విశాల్ ఎలా తీర్చిదిద్దుతాడో చూడాలి. మరి ఈ సినిమాపై విశాల్ త్వరలోనే క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.