Others

ఈ దుర్యోధన దుశ్శాసన (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రతిఘటన’ చిత్రంలోని ఈ ఎమోషనల్ సాంగ్ వింటున్న ప్రతిసారీ నాలో ఆవేదన, ఆలోచన రేకెత్తుతాయ్. నాలోని ఉడుకునెత్తురు కుతకుతా ఉడుకుతుంది. ముందుకు దూకమంటుంది.
చక్రవర్తి సంగీత సారథ్యంలో అమృత గాయని జానకి- ఆనందామృతంగా ఆలపించిన పాట ఇది. ఆశుకవి తెనాలి రామలింగని సరసన కూర్చోదగిన అర్హత కలిగిన- వేటూరి సుందరరామ్మూర్తి కలం నుండి.. కాదు కాదు అతని హృదయంనుండి అలవోకగా జాలువారిన పాట ఇది.
ఎత్తుగడలోనే ఆక్రోశం- ‘ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి లోకంలో’- ‘మరో మహాభారతం- ఆరవ వేదం...’ వాక్యాలు మనల్ని ద్రౌపది వస్త్రాపహరణం దగ్గరికి తీసుకువెళతాయి.
‘‘మీ అమ్మల స్తన్యంతో- మీ అక్కల రక్తంతో- ఎఱ్ఱని తన రక్తాన్ని తెల్లని నెత్తురుజేసి... ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర....’’ అన్న వాక్యాలు మనల్ని- మన పసితనంలోకి తీసుకెళ్తాయి. ఆలోచింపజేస్తాయి. ప్రతి భారతీ సతి మానం- చంద్రమతి మాంగల్యం (ఎంత గొప్ప వర్ణన)- మర్మస్థానం కాదది మీ జన్మస్థానం- ఈ వాక్యంతో ఈ పాట ఔన్నత్యం పరాకాష్టకు చేరుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి వాక్యాన్ని సృష్టించలేరని ఘంటాపథంగా చెప్పవచ్చు. కానీ, రాష్టస్థ్రాయిలో ఉత్తమ గేయ రచనగా నంది పురస్కారంతో సరిపెట్టుకున్నాం. ఇక పాట ఒకెత్తు. పాటకు తగిన నటనను ప్రదర్శించడం ఒకెత్తు. గాయని జానకి గొంతులోని హావభావాలను అద్భుతంగా ప్రదర్శించగలిగింది విజయశాంతి. ఒక లెక్చరర్ తను వేదనను పాటరూపంల పాఠంగా పిల్లలకు చెప్తున్న దృశ్యం ఇప్పటికీ మన కళ్లముందు మెదులుతుంటుంది. మానభగం పర్వంలో మాతృహృదయ నిర్వేదం అన్న సందర్భంగా విజయశాంతి ఎక్స్‌ప్రెషన్ ఆమెకే చెల్లింది.
ఇప్పటి ఈ కీచక పర్వానికి ఈ పాట ఎంతయినా అవసరం. స్ర్తిలు ఈ పాటతో నూతన ఉత్తేజం పొందాలి. ధైర్యం తెచ్చుకోవాలి. మగ మృగాల్ని, వారి తప్పిదాల్ని చీల్చిచెండాడాలి. సభ్య సమాజాన్ని సృష్టించాలి. మానవ ధర్మాన్ని పాటించాలి. మన సంస్కృతీ సాంప్రదాయాల్ని అజరామరంగా నిలబెట్టాలి. ఈ పాటని ప్రతివాడూ స్ఫూర్తిగా తీసుకుని నవ సమాజాన్ని నిర్మించాలి.

-ఎ దయాకర్, నెల్లూరు