Others

శివలింగపూజ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకంలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాధాన్యం కలిగి ఉంటంది. శివకేశవులకు ఇద్దరికీ ఈ మాసం అత్యంత ప్రియమైంది. ఆకర్ణామృతంగా కృష్ణలీలలను, మంగళకరాలైన విష్ణు, శివకథలను చెప్పుకుంటూ భక్తులు శివ కేశవులను పూజించటానికి అటు వైష్ణవాలయాలకు, ఇటు శైవాలయాలకు తండోపతండాలుగా తరలివెళ్తుంటారు. దేవాలయాలన్నింటా దీపాలవెలుగులు దశదిశలా విరజిమ్ముతుంటాయ. లక్షతులసీతో అర్చనలు, లక్షబిల్వార్చనలు, లక్షవత్తుల నోము, లక్ష రుద్రం, మహీఫల వ్రతం, సౌభాగ్య వ్రతం, మనోరధపూర్ణిమా వ్రతం, కృత్తికావ్రతం, జ్వాలాతోరణ ఉత్సవాలను, మున్నాట అరవై వత్తులు వెలిగించటం, ఉసిరిక దీపాలు వెలిగించటం అంటూ ఎన్నో నోములు వ్రతాలు చేయటానికి కార్తీక మాసమేమహోన్నతమైన మాసం. ఈ కాలంలో వెండి, బంగారం, సాలగ్రామం, భూ, గోదానాలతో పాటు అన్నదానం చేస్తే కోటిరెట్ల పుణ్యఫలం దొరుకుతుందంటారు. ఏమీ ఇవ్వలేనివారుసైతం మనస్ఫూర్తిగా నమశ్శివాయ జపం చేసినా వారికి శంకరుడు శుభాలను కలుగచేస్తాడు.