Others

ఉసిరి దీపాలు లక్ష్మీప్రదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తీకద్వాదశినాడు మహావిష్ణువు బృందావ నానికి విహారానికి వస్తాడు. మహా భక్తురాలైన తులసి విష్ణుమూర్తిని రాకనుచూసి సంతోష తరంగిణి అవుతుంది. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైంది తులసి. తులసి పూజ కోరిన కోరికలను ఈడేర్చట్టు చేస్తుంది. తులసిలో సర్వదేవతలు కూడి ఉంటారు.
పురాణాల్లో జలంధురుని భార్య తులసి. కాలనేమి కూతురు ఈమె. ఈమెను బృందగా పిలిచేవారు. జలంధరుడు ముల్లోకాలను హింసిం చే అసురుడు. ఆయన భార్య ఈ బృంద. బృంద తన పాతివ్రత్య మహిమవల్ల జలంధురునికి ఎక్కడైనా విజయమే తటస్థించేది. ఆ పొగరుతో మరింత విజృంభించి జలంధరుడు సాధువులంద రినీ బాధించేవాడు .దుష్టుడైన జలంధరుని కోసం మహావిష్ణువే స్వయంగా ఆయుధం పట్టాల్సి వచ్చింది. మాయోపాయంతో మహావిష్ణువు బృంద పాతివ్రత్యానికి ఆటంకం కలిగించాడట. దానితో ఆమె మహావిష్ణువుపై కోపం తెచ్చుకుని భార్యా వియోగునివై సంచరించు అని మహా విష్ణువునే శపించిందట. దానివల్లనే రామావతారం బృంద పాతివ్రత్య భంగ కారణంగా మహావిష్ణువు చేతిలో జలంధరుడు సంహరించ బడ్డాడు.
మరొకకథనం ప్రకారం తులసి శంఖచూడుని ఇల్లాలు. శంఖచూడుడు బ్రహ్మ వరగర్వి. పైగా తులసి పాతివ్రత్య కారణంగానే శంఖచూడుడు ఎల్లవేళలా జయశంఖం పూరించేవాడు. ధర్మ మూర్తి అయన మహావిష్ణువు శంఖచూడుని పరిమార్చాలని అనుకొన్నాడు. మహావిష్ణువు శంఖచూడుని రూపంలో తులసి దగ్గరకు రాగా ఆమె తన భర్త నే అనుకొని శ్రీహరిని సేవించిం దట. దానివల్ల శంఖచూడుడు శ్రీహరి చేతిలో మరణించాడు. కాని వచ్చినది శంఖచూడుడు కాదని శ్రీ మహావిష్ణువే నని తెలుసుకొన్న తులసి మహావిష్ణువునే రాయిని కమ్మనమని శపించింది. కాని ముల్లోకాలను బాధించే అసురుణ్ణి నిర్మూలించడం తన పని అని శ్రీ మహావిష్ణువు చెప్పగా ఆమె విషయం తెలుసుకొని అమితంగా బాధపడిందట.అపుడు ఆమెను మహావిష్ణువు అనుగ్రహించి నీవు లక్ష్మీదేవితో సమానంగా పూజించబడుతావని వరాన్నిచ్చాడు. ఆమె శరీరం గండకీ నదియై ప్రవహిస్తుందని వరమిచ్చాడు. అలాగే ఆమె కేశము తులసిగా జన్మిస్తుందని, తులసి దళాలు, తులసి విష్ణుప్రీతికరాలవుతాయని వరమిచ్చాడు. అలాగే ఆమె శాపాన్ననుసరించి శిలనై సాలగ్రామరూపాన ఉన్న తనను లక్ష్మీనారాయణాది రూపాలలో ఉంటానని, తులసిని శంఖము, సాలగ్రామమును కూర్చి పూజిస్తే సర్వశ్రేయాలు కలుగుతాయని వరమిచ్చాడు. ఈ కార్తిక ద్వాదశిన లక్ష్మీ స్వరూపమైన తులసిని, విష్ణు స్వరూపమైన ఉసిరిక దగ్గరచేర్చి తులిసీ వివాహాన్ని జరిపిస్తారు. తులసి దగ్గర ఐదు పద్మాలను రచించి ఐదు దీపాలను పెట్తారు. ఉసిరిక దీపాలను వెలిగిస్తారు. మున్నాటఅరవై వత్తులను తులసి కోటముందు వెలిగించినా కార్తిక మాస పుణ్యాన్ని పొందవచ్చు.
తులసి ముందు దీపదానం ఎంతో పుణ్యప్రదం. తులసి పూజ వల్ల మాంగళ్య వృద్ధి, పుత్ర పౌత్రులు, సర్వసౌఖ్యాలు కలుగుతాయని, పూర్వజన్మ పాపాలు కూడా నివారింపబడతాయని తులసి మహిమను నారదుడు శ్రీకృష్ణుడికి వివరిం చాడని దానివల్ల తులసీ వ్రతాన్ని ద్వాపరం లోనే సత్యాకృష్ణులు రుక్మిణీకృష్ణులు ఆచరించారని పురాణాలు చెబుతున్నాయ.

- వాణిప్రభాకరి