నేర్చుకుందాం

శివనామాలు (తేటగీతి సుమాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓం శర్వాయ నమః
మంచివారిలో భవుని దర్శించినట్లు
చెడ్డవారిలో కూడా దర్శించు చదువు
నేర్పి సమదృష్టి గల జ్ఞాన నేత్రు మిచ్చు
శర్వనామము భజియింతు సర్వగతుల
ఓం త్రిలోకకేశాయ నమః
పైన సప్తలోకంబుల ప్రభువతండు
క్రింది లోకంబు లేడింటి రేడు విభుడు
సర్వ సర్వంససా మహాచక్రమేలు
శానకుండు ‘త్రిలోకేశు’ శంభు గొల్తు
ఓం శితికంఠాయ నమః
పాలసంద్ర మథన వేళ కాలకూట
గరళముప్పొంగ ధరియించె గళమునందు
తెల్లటి శరీరమున దాల్చె నల్లమచ్చ
జగతి కుపకారి ‘శితికంఠుడు’గవెలింగె
ఓం ఉగ్రాయ నమః
భక్తగణ కష్టనష్టాలు వ్యాధులెల్ల
రుద్రనేత్రము కనినంత రూపుమాయు
ధర్మ పథ గాములుగ మనందరిని కోరు
‘ఉగ్రుడు’గ తోచు శాంతంపు విగ్రహుండు

కడియాల మధుసూదన రావు 9030907191