Others

వికాసోత్పత్తికి మూలం వేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పవిత్రమైన వేదాలను పూర్వం సోమకాసురుడనే రాక్షసుడు వేదములు దొంగిలించి సముద్రగర్భంలో దాక్కున్నాడు. లోక కళ్యాణంకోసం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాలు దొంగిలించిన రాక్షసుణ్ణి సంహరించాడు. తిరిగి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అందించి యుగ యుగాలకు ఆదర్శ దైవంగా నిలిచాడు. వేదం పఠనం వలన జ్ఞానం వికసిస్తుంది. వేదం ఒక విశ్వం. అపర విజ్ఞాన శాస్త్ర భాండాగారం. ‘విద్’ అనే ధాతువు నుండి ఏర్పడినదే ‘వేదం’ అంటారు. ధర్మార్ధకామ మోక్షములలో నాలుగు పురుషార్థాలను తెలియజేసే శబ్దం వేదం. వేదం విశాల విశ్వానికి శాంతిని ప్రసాదించగలదు. వేదాలు నాలుగు ఋగ్వేదం, యజుర్వేదం,సామవేదం, అధర్వణ వేదం. పవిత్రమైనటువంటి వేదములలో భారతీయ సంస్కృతీ సాంప్రదాయాలతో బాటు మానవ ధర్మం, నడవడిక, ఆధ్యాత్మిక సూత్రములు ఇమిడి వుంటాయి. పండిత పామరుల ద్వారా వేద పఠనం వలన జ్ఞాన ధ్వానోదయం వికసించగలదు. అందుకే తెలుగువారింట ప్రధాన పండుగలలో వేదపఠనం కూడా ప్రధాన అంశంగా చోటుచేసుకోవడం గమనార్హం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి ఉపదేశించిన అంశాలలో వేదముల యొక్క విశిష్టత ఎంతో వివరం గా ఉంది. యజ్ఞయాగాది కార్యక్రమాలలో వేద పఠనం జరుగుతుంది. అన్నమయ్య సంకీర్తనలలో సైతం వేదముల విశిష్టతఉటంకించబడింది.
మానవుడి సనాతన ధర్మం గురించి వేదములు చక్కగా బోధించాయి. వేదం యజ్ఞప్రధానం, వేదం కాలగమనం, వేదం పవిత్ర నాదం. మహర్షులు కొన్నివేల సంవత్సరాలకు పూర్వమే వేద విజ్ఞానం గురించి తెలుసుకున్నారు.

- ఎల్.ప్రపుల్లచంద్ర