Others

ఓటరు గెలవాలంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే ఎన్నిక కావడాన్ని ప్రజాస్వా మ్యం’ అంటారని అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ ఏనాడో సెలవిచ్చారు. ప్రజాస్వామిక దేశమైన మన దేశంలో అన్ని రాష్ట్రాలు ఒకే రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ పాలన సాగిస్తున్నాయి. మన దేశంలో కూడా వంశానుక్రమ పాలన నుంచి ప్రజాస్వామ్య పాలనకు వచ్చాము. దేశ, రాష్ట్ర అభివృద్ధి అనేది అక్కడ వుండే పాలకుడు (ప్రధాని లేదా ముఖ్యమంత్రి) మీద ఆధారపడి ఉన్నది. పాలకులు ఎన్నిక కావాలంటే అది ఓటరు చేతుల్లోనే ఉంటుంది. మంచి వ్యక్తిని చట్టసభకు ఎన్నుకోవాలంటే ఓటరు పాత్ర ఏమిటో మనకు అవగతమవుతుంది. ఎన్నికల సమయంలో ఓటరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించి, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి పూనుకోవాలి. ఓటు హక్కును దుర్వినియోగం చేస్తే మనం ఆశించిన పాలనను పొందలేము.
ఓటు హక్కు అనేది భారత రాజ్యాంగం మనకిచ్చిన గొప్ప ఆయుధం. దానిని సమాజాభివృద్ధికి ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఎన్నికలలో పోటీచేసే అర్హతను కలిగి వుంటారు. నేడు ఎన్నో రాజకీయ పార్టీలు ఆవిర్భవించి ఎన్నికలలో పోటీచేస్తూ ఓటరు మహాశయులను వివిధ ప్రలోభాలకు గురిచేస్తూ, వారి ఓట్లను కొల్లగొట్టి ప్రభుత్వ పాలనను కొనసాగిస్తుంటారు.
తెలంగాణ రాష్ట్రంలో డిసెంబర్ 7న ఎలక్షన్ కమిషన్ పోలింగ్‌ను నిర్వహించబోతున్నది. ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంటోంది. పోలింగ్ ముగిసిన తర్వాత నూతన ప్రభుత్వం కొలువుతీరనుంది.
ఓటరు చేయవల్సిన పనులు:
* ఇప్పటికే అన్ని వివిధ రాజకీయ పార్టీలు తమ ప్రచారాలను ముమ్మరం చేశారు. ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ, సినిమా డైలాగుల మాదిరి ‘పంచ్’లు విసురుకుంటూ, ప్రజలకు ఎన్నో వాగ్దానాలను ఇస్తున్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీల పక్షాన నాయకులు పోటీలో నిలబడితే మరెంతోమంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేస్తుంటారు. ఇలాంటి సందర్భంలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోవడంలో ఓటరు విజ్ఞత ఏమిటో తెలియకనే తెలుస్తుంది. ఈ సమయంలో ఓటరు దేవుళ్ళు ఆలోచించి సక్రమమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోకపోతే మరో ఐదేళ్ళు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండక తప్పదు.
*ఎన్నికలు జరిగినప్పుడల్లా మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మేధావులు సలహాలిస్తుంటారు. కానీ ఎలా ఎన్నుకోవాలో వివరంగా చెప్పరు. మన రాష్ట్భ్రావృద్ధి పాలకులపై ఆధారపడి ఉంటుంది. కావున ప్రతి ఓటరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. పార్టీల, అభ్యర్థుల ఆలోచనా విధానాన్ని తెలుసుకోవాలి. రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోల్లోని అంశాల గురించి సందేహాలు ఉంటే ఇతరులను అడిగి తెలుసుకోవాలి. పోలింగ్ కేంద్రంలో ఓటు వేసే వరకూ పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలి.
* ఎన్నికల సమయంలో మనం ఎలా స్పందించాలి? ఏయే విషయాలను పరిశీలించాలి? ఎలా వ్యవహరించాలి? వీటిపై ఆలోచించాల్సిన అవసరం ఉన్నది.
* రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధమైన ఓటు హక్కును, మన బాధ్యత తెలుసుకొని అర్హులు, సమర్ధులనే ఎన్నుకోవడం మన కర్తవ్యం.
* ప్రాణం పోతున్నాసరే మనం చేయవలసిన పనిని చేయకుండా మానరాదు, చేయకూడని పనిని చేయరాదు. ఇప్పుడు చాలా విలువైన సమయం అని గ్రహించాలి. ఓటరు కర్తవ్య నిర్వహణలో మనం వెనుకంజ వేయకూడదు. మేల్కొని పరిశీలిస్తూ ఉండాలి.
* మన లక్ష్యం ప్రకారం పాలన గావించే వ్యక్తి ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తి గతంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తన స్వార్థం కోసం పనిచేశాడా? అని ఆలోచించాలి. ఏ నేతను ఎన్నుకుంటే అందరితో సానుకూలంగా ఉంటూ అభివృద్ధికి పాటుపడతాడా? అని తెలుసుకోవాలి. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.
* మనకు తెలుసు ఈ ప్రజాస్వామ్యంలో నిస్వార్థంతో పనిచేసే వ్యక్తులకు చోటులేదు. అందరికీ ఎన్నికలలో పోటీచేసే నిస్వార్థ సేవను అందించాలనుకొన్నప్పటికీ అది అసాధ్యమే. ఎందుకంటే ఎన్నికలంటేనే డబ్బుతో ముడిపడి ఉంటుంది.
* కొంతమంది మంచి వ్యక్తులు సమాజం కోసం స్వలాభాన్ని ఆశించకుండా పనిచేయడానికి ఎన్నికలలో పోటీచేసినప్పటికీ వారిని ఎన్నుకునే పరిస్థితిలో మనం లేము. వీటన్నింటిని చూస్తుంటే రాజ్యాంగం కల్పించిన హక్కులను ఉన్నత వర్గాలకు సంబంధించిన వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయనడంలో ఎలాంటి అసత్యం లేదు.
* అందుకే మనం ప్రతి విషయాన్నీ పరిగణనలోకి తీసుకొని సమస్యలపై పోరాటం చేసినా, న్యాయం జరుగుతుందనే నమ్మకం అసలే లేదు. ఉన్నా న్యాయపరంగా సంప్రదిస్తే కొన్ని సంవత్సరాలు పడుతుంది. అయినా ముందు నిలిచి కొందరు నేతలు చేయదలిస్తే వారికి బెదిరింపులు తప్పవు. జనం కోసం ధైర్యంగా పోరాడే నేతలను ఎన్నుకోవాలి.
మనముందు ఎన్నో ప్రశ్నలు..
* మన కష్టాలు, సమస్యల గురించి చట్టసభల్లో గళం విప్పే నేతలను మనం గెలిపించాలి.
* పాలనలో పారదర్శకత, నిజాయితీకి పట్టం కట్టేవారిని ఎన్నుకోవాలి.
* మనం ఓటుద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకునేది శాసనసభ్యులను మాత్రమే. ఈ శాసన సభ్యులనుండే పరోక్షంగా ముఖ్యమంత్రి ఎన్నిక అవుతాడు, మంత్రులు నియమితులవుతారు. ఎవరు ముఖ్యమంత్రి కావాలో, ఎవరికి అధికారాన్ని కట్టబెట్టి అభివృద్ధికి మనవంతు కృషిచేయాలో అనే అంశం మన చేతుల్లోనే ఉన్నది.
* మంచి మనస్తత్వం కల్గిన వ్యక్తి, అనుక్షణం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి, నిజాయితీతో చిత్తశుద్ధితో, వేగవంతంగా అభివృద్ధి పనులను అమలుచేసే లక్షణాలున్న పార్టీని ఎంచుకోవడం ఉత్తమం.
* మన నియోజకవర్గంలో అటువంటి పార్టీ తరఫున నిలబడిన అభ్యర్థి మంచివాడు, సమర్థుడు అయితే మరింత మంచిది. ఒక్కొక్కసారి మనకు నచ్చిన పార్టీ అభ్యర్థి మనకు నచ్చకపోవచ్చు. కానీ ఆ పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరుగుతుందని అనిపిస్తే సరైన నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు అభ్యర్థి కన్నా పార్టీ వైపు మొగ్గు చూపాలి.
* ఓటుహక్కు అనే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించి, నాయకులిచ్చే తాయిలాలను ఆశించకుండా, ఉన్న అభ్యర్థుల్లో మంచివారిని ఎన్నుకోవాలి.
* ఎన్నికలకు ముందు వివిధ పార్టీల ఆధ్వర్యంలో మద్యం ఏరులై పారనుంది. ఎన్నో ప్రోత్సాహకాలు (చీరలు, మిక్సీలు, కుక్కర్లు, ఫోన్లు, డబ్బులు) ఆశజూపి మన ఓటును లాక్కెళ్ళాలని చూస్తుంటారు.
* ఒక్కసారి ఈ ప్రలోభాలకు లొంగిపోతే- మనం మరో ఐదేళ్లు ప్రశ్నించే అవకాశాన్ని కోల్పోయి, అభివృద్ధినీ నోచుకోలేని పరిస్థితి నెలకొంటుంది.
* గ్రామీణ సమాజాల్లో వుండే ఓటర్లకు- విద్యావంతులైన వారు ప్రస్తుత రాజకీయ నాయకుల గురించి వివరిస్తూ సరైన నిర్ణయాన్ని తీసుకునే విధంగా ప్రోత్సహించాల్సిన అవసరం ఉన్నది.

-- డా. పొలం సైదులు