Others

ప్రజావాక్యం పట్టని కాంగ్రెస్ అధినాయకత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాజుకంటే మొండివాడు ఘనుడు’ అని సామెత. కానీ కాంగ్రెస్ చరిత్ర చూస్తే ప్రజావాక్యం కంటే పార్టీ అధినాయకత్వమే ఘనమనే కొత్త సామెత లాంటి ఒక దౌర్భగ్య నిర్ణయానికి మనం రావాల్సొస్తుంది. అలనాడు జలియన్ వాలాబాగ్ దురంతం దరిమిలా గాంధీజీ తీసుకున్న ప్రజావ్యతిరేక అడుగులు మొదలుకొని నెహ్రూ చైనా దురభిమాన పూర్వక రాజనీతి వక్రత, ఇందిరాగాంధీ నిరంకుశత, అర్బన్ నక్సలిజం- మావోయిజాలను సమర్థించటం వంటి నేటి రాహుల్ గాంధీ విధానాల వరకు పరిశీలిస్తే- కాంగ్రెస్ అధినేతలెవరూ ప్రజాభీష్టానికి ప్రాధాన్యం, విలువలు ఇచ్చిన దాఖలాలు లేవు.
జలియన్ వాలాబాగ్...
1919 ఏప్రిల్ 13న పంజాబ్‌లోని జలియన్ వాలాబాగ్‌లో వైశాఖీ పండగ రోజున వందల మంది జనాలను పిట్టల్ని కాల్చినట్టు కాల్చిపారేసి, వేల మందిని క్షతగాత్రుల్ని చేసిన ఆంగ్ల ప్రభుత్వపు బ్రిగేడియర్ జనరల్ డయ్యర్ పైశాచికత్వాన్ని గర్హిస్తూ యావద్దేశం ఆగ్రహంతో ఊగిపోయింది. కానీ, గాంధీ ‘మహాత్ముడి’కి మాత్రం అది తన ‘మహోదాత్తపు’ తలపుల లెక్కలోకి రాలేదు. డయ్యర్‌కు నిరసనగా అహమ్మదాబాద్‌లో జరిగిన అత్యల్ప నిరసన చర్యలలో మాత్రం గాంధీజీకి ‘అధర్మం’ కనిపించింది. అప్పటికే ప్రజలంతా పాల్గొంటున్న సత్యాగ్రహోద్యమాన్ని 19-4-1919 నుంచి నిలిపివేస్తున్నట్టు గాంధీజీ ఏకపక్షంగా ప్రకటించాడు.
‘ఖిలాఫత్- మోప్లాల’ దుశ్చర్య...
ఎక్కడో కొన్ని వేల మైళ్ల దూరాన ఉన్న టర్కీ సుల్తాన్ అధికారాలను బ్రిటన్ ప్రభుత్వం కుదిస్తే 1921లో మన దేశ మలబార్ ప్రాంతంలో మహమ్మదీయులు ‘ఖిలాఫత్’ పేరుతో తిరుగుబాటు చేశారు. ఎర్నాడ్, వళ్ళువనాడ్ జిల్లాలను ఖిలాఫత్ రాజ్యంగా ప్రకటించుకున్నారు. ఆంగ్లేయుల మీద కోపానికి మలబారు హిందువులపై తమకున్న ద్వేషాన్ని జోడించి హింసామార్గాన్ని ఎన్నుకొని మలబారు మోప్లాలు (ముస్లింలు) 1921 ఆగస్ట్‌లో 1500 మంది హిందువులను ఊచకోత కోశారు. 20,000 మందిని కంఠం మీద కత్తిపెట్టి మతం మార్పిడిచేశారు. సుమారు 3 కోట్ల రూపాయల విలువగల ప్రజల ఆస్తిపాస్తులను లూటీ చేశారు. ఇక మహిళల అపహరణలు, బలాత్కారాలు, సామూహిక మానభంగాలు వంటి కిరాతక చర్యలకైతే లెక్కేలేదు. ఇంత ఘోరం జరిగితే హిందువులను నోరెత్తనీయలేదు గాంధీజీ. ముస్లింలను పల్లెత్తుమాట అనలేదు.
చీరాల- పేరాల ఉద్యమం, పెదనందిపాడు సత్యాగ్రహం, గుజరాత్ బార్డోలీ సత్యాగ్రహం మొదలైన ఎన్నో ప్రజోద్యమాలను, సత్యాగ్రహాలను గాంధీజీ ఎంత మూర్ఖంగా, నీరుగార్చారో చెప్పనలవి కాదు.
భగత్‌సింగ్ ఉదంతం- గాంధీ గయ్యాళితనం
అసమాన దేశభక్తుడైన భగత్‌సింగ్‌కు ఉరిని తప్పించాలంటే ఆంగ్లేయులు ‘మీ గాంధీజీని చెప్పమనండి భగత్ సింగ్‌ది నేరం కాదు అని. అప్పుడు మేము అతడిని ఉరితీయం’ అన్నారు. యావజ్జాతి గాంధీపై కొండంత ఆశపెట్టుకుంది ఆనాడు. గాంధీజీ మాత్రం ప్రజాహృదయాన్ని పట్టించుకోలేదు. జనం అభ్యర్థనను ఆదరించలేదు. బ్రిటన్ దొరతనం భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌లను ఉరితీసింది గాంధీజీ యొక్క మొండితనపుఊతం అనే ఉరితాడుతో.
అవమానిత నేతాజీ
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికలో నేతాజీ సుభాష్‌చంద్ర బోస్ గెలిచి, డాక్టర్ పట్ట్భా ఓడిపోతే ‘పట్ట్భా ఓటమి నా ఓటమి’అని చెప్పి, నేతాజీని నిరుత్సాహపరచిన ప్రజాసభ్య వ్యతిరేకత గాంధీ సాగించుకున్న అధినాయకత్వం.
ప్రధాని పదవి- గాంధీజీ అప్రజాస్వామికత
కాంగ్రెస్‌లో మెజారిటీ సభ్యులు సర్దార్ పటేల్‌ను ప్రధానిగా చేయాలని తీర్మానిస్తే, ‘కాదు నెహ్రూ ఉండాలి’ అని పార్టీని మొహమాటంలో పడేసి, ప్రజాభిప్రాయ వాక్యాన్ని ఆనాడే పదివేల అడుగుల లోతున పాతిపెట్టింది కాంగ్రెస్ గాంధీ అధినాయకత్వం.
పాక్‌కు మితిమీరిన చేయూత
స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో పాకిస్తాన్‌కు మన శక్తికి మించిన ఆర్థిక సహాయం ఇవ్వటం సముచితం కాదని సర్దార్ పటేల్ మొదలైన మెజారిటీ సభ్యులు అభిప్రాయపడితే అత్యధిక ఆర్థికపు సరఫరా చేసింది గాంధీ-నెహ్రూ అధినాయకత్వం.
నెహ్రూ స్వాధిక్యభావ ధోరణి
సుమారు 530 స్వదేశీ సంస్థానాలను భారత ప్రభుత్వ పతాకం కిందకు తెచ్చిన రాజనీతిని కాశ్మీరులో అమలుచేయకపోవటం నెహ్రూ కాంగ్రెస్‌లో చూపించిన స్వాధిక్యభావ ధోరణి (సెల్ఫ్ సుపీరియారిటీ కాంప్లెక్స్)కు మొదటి ఉదాహరణ. కాశ్మీర్ రాజు హరిసింగ్ తనంతట తాను తన రాజ్యాన్ని భారత్‌లో విలీనం చేయటానికి లిఖిత పూర్వకంగా ఆమోదం తెలిపాడు. అయినాసరే అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ (ప్లెబిసైట్) జరిపిస్తామని అన్నాడు నెహ్రూ. ఆ అనౌచిత రాజనీతితో మెజారిటీ ప్రజల ఏకాభిప్రాయానికి గండికొట్టింది నెహ్రూ నిరంకుశ భావ పూర్వక, నిర్లక్ష్యాత్మక అధినాయకత్వం.
చైనా దురాక్రమణ- నెహ్రూ నిర్లక్ష్యం
1959లో లడఖ్‌లో 15వేల చదరపు మైళ్ళ భూభాగాన్ని అన్యాయంగా చైనా ఆక్రమించుకుంది. ఇంకా చైనా-ఇండియా ‘పంచశీల’ ఒప్పందం, ‘్భరుూభారుూ’ నినాదం ఏమిటి? పద్ధతి మార్చుకో.. అని అధిక సంఖ్యలో భారతీయులు ఆందోళన వ్యక్తీకరిస్తే- ‘అక్కడ పచ్చగడ్డికూడా మొలవదు’అంటూ ప్రజలను కల్లబొల్లి ఊరడింపులో ముంచిన ప్రధాని నెహ్రూ కాంగ్రెస్‌కు అధినాయకుడు ఒక ప్రధానమంత్రిగా. ఆ తరువాత కొద్దికాలానికే సరిహద్దు ప్రాంతంలోని కాలింపాంగ్‌లో భారత సైనికుడిని చైనా సైన్యం చంపి మన స్వాతంత్య్ర దినానికో లేక నెహ్రూ జన్మదినానికో బహుమతిగా మనకు పంపిస్తే, చీమ కుట్టినట్టైనా ‘్ఫల్’ కాడేమిటి? మన ప్రధాని అని ప్రజానీకం బాధపడితే- ఇలాంటివి మామూలే అన్న ధోరణిలో నిశే్చతనంగా ఉండిపోయాడు ‘గులాబీ ప్రియుడు’.
1950వ దశకంలో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రతాప్‌సింగ్ కైరాన్ రాజకీయ, ఆర్థిక, అవినీతి కుంభకోణాలకు పాల్పడగా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా అడ్డుచక్రం వేశాడు నెహ్రూ. నెహ్రూ హయాంలో జరిగిన సిరాజుద్దీన్ కంపెనీ, జయంతి షిప్పింగ్ కంపెనీ ధర్మతేజ మొదలైనవాళ్ళ స్కాండల్స్ మీద, నేతాజీ ఏ నేరం చేయకుండా అజ్ఞాతవాసం గడపాల్సివచ్చిన పరిస్థితి కల్పనలో నెహ్రూదే కీలక పాత్ర.
ఇందిరాగాంధీ నిరంకుశత
గోసత్యాగ్రహులపై కాల్పులు, సాధువులపై లాఠీచార్జీ, పూరీ పీఠాధిపతి శంకరాచార్యను అరెస్టు చేయించటం, చిన్న చిన్న సంస్థానాధీశులకు సైతం రాజభరణాలను రద్దు చేయడం, దేశంలో ఎమర్జెన్సీ విధించడం, అలహాబాద్ హైకోర్టు తీర్పును నిర్లక్ష్యం చేయటం, తనకు అనుకూలంగా సుప్రీం కోర్టు అధికారాలను తగ్గిస్తూ రాజ్యాంగ సవరణ చేయటం వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు కాంగ్రెస్ అధినేత్రిగా, ప్రధాని హోదాలో ఇందిరాగాంధీ పాల్పడింది. ‘అంతారత్మ ప్రబోధం’ పేరిట రాష్టప్రతి ఎన్నికలో సొంత పార్టీ అభ్యర్థి నీలం సంజీవరెడ్డిని ఓడించడం ఇందిరమ్మ కుటిల రాజనీతికి సాక్ష్యం.
అవకాశవాద కూటమి..
2014 ఎన్నికల్లో తాను ఆక్షేపించిన తెలుగుదేశం పార్టీని నేడు తన కూటమిలో చేర్చుకోవటాన్ని, నక్సలిజానికి సానుభూతి పరులుగానే ఉండే కమ్యూనిస్టులను కాంగ్రెస్ కలుపుకోవటాన్ని ఆ పార్టీ కార్యకర్తలు, కిందిస్థాయి నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయినా రాహుల్ అధినాయకత్వం తన స్వార్థ రాజకీయాల కోసం ఇవేమీ పట్టించుకోదు.
వరవరరావు సహా మరికొందరు అర్బన్ నక్సల్స్‌ను చట్ట ప్రకారం అరెస్టు చేస్తే, సమాజ ప్రశాంతతా విధ్వంసకులను వెనకేసుకు రావటం, విశ్వవిద్యాలయాలలో కన్నయ్‌కుమార్ లాంటి విచ్ఛిన్నతా వాదులకు సానుభూతి పలకటం, దేశభద్రత దృష్ట్యా పాకిస్తాన్‌పై మన సైనికులు విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్ (మెరుపుదాడి) నిర్వహిస్తే వాళ్ళ ధీరోదాత్త కార్యక్రమానే్న శంకించిన ప్రబుద్ధులను వెనకనుండి నడిపించటం- ఇలాంటివి రాహుల్ బాబు అధినాయకత్వ మహా(వ)లక్షణాలు. ఇలా చెప్పుకుంటూపోతే కరంచంద్ గాంధీ నుంచి రాహుల్ గాంధీ వరకూ కాంగ్రెస్ అధినాయకత్వం ప్రజావాక్యం పట్టని నిరర్ధకపు మొండి నాయకత్వమే.

-శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 98497 79290