Others

శ్రీ సాయి దివ్య లీలా విలాసం - మహత్త్వ స్వరూపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రహ్మ మాత్రమే సత్యం. బ్రహ్మాండం అసత్యం. నిజానికి గుర్తు విభూతి. బాబా ధునిలోని ఊది వ్యాధి, బాధలను తొలగిస్తుంది. కానీ ఊది యొక్క నిగూఢమైన తత్త్వార్థం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం ఇవ్వగలిగిన దక్షిణ ఇచ్చి ప్రాపంచిక విషయాల యందు వైరగ్యాన్ని సాధించిన తరువాత మెల్లగా నివృత్తి మార్గం అర్థమవుతుంది. విభూతి దక్షిణల జత అంటే వివేక వైరాగ్యాల జంట. విభూతి యొక్క గూఢార్థాన్ని, భావార్థాన్ని, పరమార్థాన్ని గ్రహించిన సాయి భక్తులు తమ యొక్క యోగక్షేమాల కొరకు ఊదిని కోరుకుంటారు.
బ్రహ్మ జ్ఞాన లీల
‘‘నా వద్దకందరూ కోరికలతో వచ్చేవారే! బ్రహ్మజ్ఞానం కోరుకునేవారు దొరకటం నా అదృష్టం! బాబా తక్షణమే భక్తులకు బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తారని విని రాను పోనూ టాంగా కట్టించుకుని వచ్చిన ఒక ధనవంతునితో అని బాబా తమ లీల ప్రారంభించారు. 5 రూపాయలు అప్పుగా తెమ్మని బాలాను వర్తకుల దగ్గరికి పంపసాగారు. జ్ఞానం కావాలంటే పంచ ప్రాణాలు, జ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం భగవంతునికి అర్పించాలి. నాకవసరమైన 5 రూపాయలకన్నా ఎన్నో రెట్లు ధనం నీ దగ్గర ఉంది. అయినా డబ్బే నీ పాలిట బ్రహ్మం. దానిపై మోహం నశిస్తే కానీ జ్ఞానం లభించదు.
సాయి నామమే మృత్యుంజయ మంత్రం
1886లో తాను అల్లా వద్దకు వెడుతున్నానని, మూడు రోజుల వరకు తమ దేహాన్ని భద్రపరచమని మహల్సాపతికి చెప్పి దేహత్యాగం చేశారు సాయి. మూడు రోజులు తరువాత తిరిగి వచ్చి 32 సం.లు అదే దేహంతో సంచరించిన సాయిబాబా మృత్యుంజయుడే. కేవలం ఆ మృత్యుంజయత్వం తమ దేహానికే పరిమితం కాదు. ఎందరో భక్తుల్ని మృత్యుముఖం నుండి రక్షించారు బాబా. కొందరిని మరణించిన తరువాత కూడా బ్రతికించారు. ‘‘నా సమాధి నుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను.. నా నామం పలుకుతుంది.. నా మట్టి సమాధానమిస్తుంది’’ అని అభయమిచ్చి నేటికీ నెరవేస్తున్నారు. సాయి మృత్యుంజయులు. సాయి నామం మృత్యుంజయ మంత్రం. సాయినాధునిపై మనఃపూర్వమైన భక్తి విశ్వాసం కలిగి వున్న వారికి శుద్ధ చైతన్యంతో తాదాత్మ్యం కల్గుతుంది. బాబా కథలు వింటే గర్వాంధకారాలు, సకల రోగాలు నశించి శాంతి, తృప్తి, ఆనందం ధైర్యం కలుగుతుంది. సాయి నామాన్ని స్మరించడంవలన చెడు మాట్లాడటం, చెడు వినటం వలన కలిగే పాపాలు తొలగిపోతాయి. ప్రపంచంలో అన్నిటికన్నా శక్తివంతమైన పరమ సత్యం సాయిబాబా.
‘‘సదా త్స్వరూపం చిదానందకందం!
జగత్సంభవ స్థాన సంహార హేతుమ్!
స్వభక్తేచ్ఛయా మానుషం దర్శయంతం!
మామీనశ్వరం సద్గురుం సాయనాథం!

- యర్రమిల్లి విజయలక్ష్మి