Others

వంటకు, వొంటికీ నేస్తం వెల్లుల్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనం వాడే మసాలా దినుసుల్లో వెల్లుల్లి ఒకటి. ముఖ్యంగా మాంసాహార వంటకాల్లో ఇది లేనిదే పని జరగదు. వంటకాలకు కమ్మని రుచి, వాసనతో పాటు ఒంటికీ ఎంతో మేలు కలుగుతుంది. దీనిలోని ఔషధ గుణాలు అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. రోజూ ఏదో ఒక రూపంలో వెల్లుల్లి తినేవారికి హృద్రోగ సమస్యలు రావని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరి వెల్లుల్లులోని ఔషధ గుణాలను తెలుసుకుందామా..
* వెల్లుల్లిలో భాస్వరం పుష్కలంగా ఉండటం వల్ల దీనికి ఘాటైన వాసన ఉంటుంది. వెల్లుల్లిని అధికంగా తినడం వల్ల ఈ భాస్వరం రక్తనాళాల్లోని గారని అంటే ప్లాక్‌ను కరిగించి కొవ్వు పేరుకుపోకుండా చేస్తుంది.
* వెల్లుల్లిలో ఆజోయేన్ అధికంగా ఉంటుంది. ఇది రక్తాన్ని గడ్డకట్టకుండా చేస్తుంది. అందువల్ల వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల హృద్రోగ సమస్యలు దరిచేరవు.
* వెల్లుల్లిలోని ‘ఆలిసిన్’ అనే పదార్థం యాంటీ బయోటిక్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ ఏజెంటుగా పనిచేసి ఇన్‌ఫెక్షన్ల ముప్పును తగ్గిస్తుంది. అలాగే రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
* వెల్లుల్లి తిన్నప్పుడు అందులోని పాలీ సల్ఫయిడ్స్, హైడ్రొజన్ సల్ఫయిల్ వాయువుగా మారి రక్తనాళాలను సాగేలా చేసి రక్తపోటును అదుపుచేస్తాయి.
* ఆస్తమా బాధితులు, తరచుగా జలుబు బారిన పడేవారు రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మంచి ఫలితం కనపడుతుంది.
* ఆహారంలోని ఐరన్‌ను శరీరం బాగా గ్రహించేలా దోహదపడే ఫెర్రోఫోర్టిన్ అనే ప్రొటీన్ కీలకపాత్ర పోషిస్తుంది. వెల్లుల్లి వినియోగం ఈ ప్రొటీన్ ఉత్పత్తిని పెంచుతుంది. తద్వారా రక్తహీనతను నివారిస్తుంది.
* వెల్లుల్లిలోని డయాలీల్ సల్ఫయిడ్, థియోక్రెమోనోన్‌లు వాపు నివారకాలుగా పనిచేసి శరీర వాపులు, నొప్పులను తగ్గిస్తాయి.
* వెల్లుల్లిలోని ఆలీల్ సల్ఫయిడ్‌లు కేన్సర్ రాకుండా చూస్తాయి.
* వెల్లుల్లి వినియోగంతో ఇన్సులిన్ ఉత్పత్తి పెరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
* ప్రతిరోజూ వెల్లుల్లి తినేవారు ఎంతటి ఒత్తిడినైనా అధిగమించగలుగుతారు. డిప్రెషన్ బాధితులు రోజూ వెల్లుల్లి తింటే దాన్నుంచి బయటపడవచ్చు.