Others

మహాజ్ఞాని మదాలస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ విధమైన దత్తాత్రేయ మహర్షి మనోపదేశం అలర్కునికి ఎంతో ఆనందం కలగజేసింది. అప్పుడు మునీంద్రునితో ఇలా అన్నాడు- ‘‘మహాత్మా, నేను ధన్యుణ్ణి. నా అదృష్టం బాగుండడంవలన శత్రువులు నాపై దండయాత్ర చేశారు. నాకు కలిగిన కష్టాలన్నీ నా యొక్క అదృష్ట ఫలాలే. లేనిడల మీ శరణు కోరే భాగ్యం నాకు కలిగి ఉండదు. తమ సాంగత్యం వలన నాకు జ్ఞానోదయమయింది. మీ దయకు పాత్రుణ్ణి అయినాను. అనంతరం దత్తాత్రేయుడు అలర్కుణ్ణి అహంకార మమకారాలకు లోను కాకుండా జీవించి ముక్తిపొందమని ఆశీర్వదించాడు. ఆయన అనుజ్ఞతో అలర్కుడు వెంటనే కాశీరాజు వద్దకు వెళ్లాడు. అతనితో సబాహువు వింటుండగా నవ్వుతూ ‘‘ఓ రాజా, నీవు రాజ్యం స్వాధీనం చేసుకోవాలనే కోరికతో నాపై దండెత్తావు. ఈ రాజ్యం నీకు స్వాధీనం చేస్తున్నాను. ఇక దీనిని యధేచ్చగా అనుభవించు లేదా నా అన్న సుబాహుకైనా అప్పగించు’’ అన్నాడు. వెంటనే కాశీరాజు అలర్కా! యుద్ధం పూర్తిగా చేయకుండానే రాజ్యాన్ని ఎందుకు వదులుకుంటున్నావు? ఇది క్షాత్ర ధర్మం కాదా. మరణానికి భయపడకుండా రాజు శత్రువులపై కత్తి దూయాలి. వారిని సంహరించి రాజ్యం పొందాలి. దీనికి విరుద్ధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అని ప్రశ్నించాడు. అప్పుడు అలర్కుడిలా అన్నాడు. గతంలో నా అభిప్రాయం కూడా ఇపుడు నీవు చెప్పినట్లే ఉండేది. కాని ఇపుడు అందుకు విరుద్ధంగా మారింది. కారణం చెబుతాను విను. పంచభూతాలు వావల్ల కలిగే తత్వాలు మనుష్యులకున్నట్లే సమస్త ప్రాణులకు ఉన్నాయి. వీటియందుగల చిచ్ఛక్తి మాత్రం ఒక్కటే. ఈ జ్ఞానం పొందిన వానిలో శత్రు మిత్రత్వాలకి స్థానం లేదు. నీవలన భయపడి నేను దుఃఖానికి గురి అయినాను. కాని దత్తాత్రేయ మహర్షి అనుగ్రహంవలన నాకు జ్ఞానం సిద్ధి కలిగింది. నేను ఇపుడు మనస్సును జయించాలనే అభిలషిస్తున్నాను కాని శత్రువులను జయించాలని కోరుకోవడంలేదు. మీ ఉభయులవలన నాకు మహోపకారం జరిగింది. అవసరమైతే నీవు మరొక శత్రువుని అనే్వషించుకో’’ అనగానే అతని మాటలకు సుబాహువు హర్షాతిరేకంతో పొంగిపోయాడు. సోదరుని అభినందించి కాశీరాజుతో ఇలా అన్నాడు. రాజా నేను నిన్ను ఏ లక్ష్యంతో ఆశ్రయించానో ఆ లక్ష్యం నెరవేరింది. ఇక నేను వెళ్లివస్తాను, సుఖంగా ఉండు అన్నాడు.
కాశీరాజు ఆశ్చర్యపడి ‘‘అయ్యా సుబాహూ నీవు ననె్నందుకు ఆశ్రయించావు? ఇపుడు నీకు కలిగిన లాభం ఏమిటి? రాజ్యంకొరకు కదా నీవు నన్ను యుద్ధానికి దింపావు. నాకేమీ అవగాహన కావడంలేదు. నీ కోరిక ప్రకారం నీ తమ్ముణ్ణి జయించి నీ భాగం నీకు స్వాధీనం చేస్తున్నాను అనుభవించు అన్నాడు. అపుడు సుబాహువు ఎంతో మృదువుగా రాజా, నేను ఈ విధంగా ఎందుకు చేశానో విను. నాకు ఇంకా ఇద్దరు సోదరులున్నారు. మా తల్లి మాకు బాల్యంనుండి తత్వబోధన చేసింది. అలర్కునికి మాత్రం తత్వోపదేశం చేయలేదు. అందువలన ఇతడు జ్ఞానహీనుడయి భోగలాలసుడయినాడు. అందువలన ఇతని విషయంలో జాలి కలిగి ఇతనిలో వైరాగ్య వాంఛ రేకెత్తించాలని నిన్ను ఆశ్రయించాను. మా తల్లి అయిన మదాలస గర్భంలో జన్మించినవాడు తిరిగి ఇతర స్ర్తిల గర్భంలో జన్మించరాదని ఇలా చేశాను. ఒక వ్యక్తి చెడిపోతుంటే ఊరక చూడరాదు. భ్రష్టుడైపోతున్నవానిని చక్కదిద్ది సన్మార్గంలో ప్రవేశపెట్టాలి. నీ సహాయంతో ఇపుడు నా సంకల్పం నెరవేరింది. నీకు శుభమగుగాక, నా దారిన నేను వెడతాను అని అనగా కాశీరాజు మహానుభావా! మీ వాక్కులు వినగానే నాకు కూడా జిజ్ఞాస కలిగింది. అలర్కునికి మహోపకారం చేసి అతనిని ఉద్ధరించావు. నాకు అట్టి ఉపకారం చేయరాదా? సత్సాంగత్యం సత్ఫలాన్ని ఇస్తుందంటారు. మరి మీ సహవాసం వలన నేను బాగుపడవద్దా? అని కోరగా సుబాహువు, రాజా సంగ్రహంగా తత్వం వినిపిస్తాను విను. మొట్టమొదట అహంకార మమకారాలు వదలాలి. నేను ఎవ్వరిని? అని విచారణతో నీవు నీ యదార్థ స్వరూపం అవగాహన చేసుకోవాలి. అనాత్మను ఆత్మ అనుకోవడం తనదికానిదానిని తనది అనుకోవడం కంటే వ్ఢ్యౌం ఇంకేముంది? నేను సర్వగతుణ్ణి, నాకంటే వేరు ఏదీ లేదు, నీలో వున్నది కూడా నేనే. చెప్పేవాడు వినేవాడు వేరు వేరుకారు అని చెప్పి సుబాహువు వెళ్లిపోయాడు. కాశీరాజు అలర్కని సత్కరించి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. తరువాత అలర్కుడు తన జ్యేష్టపుత్రున్ని రాజ్యాభిషిక్తునిగా చేసి సర్వసంగ పరిత్యాగి అయి మోక్షాపేక్షతో అడవికి వెళ్లాడు. అక్కడ తపస్సు చేసి మహాయోగి అయినాడు. యోగంకంటే పరమ సుఖం మరొకటి లేదని తెలుసుకున్నాడు. ఈ విధంగా మదాలస సంతానమంతా వైరాగ్యంతో మోక్షమార్గాన్ని అనుసరించారు.

-వేదుల సత్యనారాయణ 96183 96071