Others

మూలాధార చక్రము (పురాణాల్లో శాస్తవ్రిజ్ఞానం )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు
H.No. 7-8-51, Plot No.: 18, నాగార్జున సాగర్‌రోడ్, హస్తినాపురం, సెంట్రల్ కాలనీ, ఫేజ్ -2 హైదరాబాద్- 500079
==================================================================
చక్రధ్యాన శ్లోకము
శ్లో మూలాధారస్థ పద్మే శృతిదళలసితే పంచవక్త్రాం త్రినేత్రాం
ధూమ్రాభామస్థి సంస్థాం సృణి మపి కమలం పుస్తకం జ్ఞాన ముద్రాం
భిభ్రాణాం బాహుదండై సులలిత వరదాం పూర్వశక్త్యా వృత్తాంతాం
ముద్గాన్నాసక్త చిత్తాం మధీ ముదముదితాం సాకినీం భావయామః
శ్లో మూలాధారాంబుజారూఢా పంచవక్త్రా స్థి సంస్థితా
అంకుశాది ప్రహరణా వరదాది నివేశితా
ముద్గౌదనాసక్త చిత్తా సాకిన్యంబా స్వరూపిణి
మూలాధారము అనగానే ఇది చక్ర వ్యవస్థకంతటికి పునాది అని (ఆధారమని) తెలుస్తోంది. ఇది పృధ్వీతత్వముగల చక్రము. బ్రహ్మాండమునకు (వెనె్నము)కు అట్టడుగున, ఆసనానికి రెండంగుళములపైన, జననేంద్రియానికి క్రిందుగా మూలాధార చక్రము కలదు. ఈ చక్రమునందు మూడు ప్రధాన నాడులు (ఇడ, పింగళ, సుషుమ్న) మరియు ఇతర నాడులు శక్తివంతములై, ఊర్థముఖంగా పయనిస్తాయి. ఇది సంకోచవ్యాకోచాలు కలిగి వుంటుంది. చిక్కటి ఎరుపు రంగు కలిగిన నాలుగు దళములు గల పద్మమువలె వుంటుంది. ఈ మూలాధార పద్మము యొక్క కర్నికలో మరియొక పద్మము కలదు. దానిలో మూలాధార చక్ర అధిదేవతయైన సాకిని శక్తి స్ర్తి దేవతామూర్తిగా అధిష్ఠించియున్నది. ఈ దేవత నాలుగు చేతులతో ఉన్నది. ఆ నాలుగు చేతులలో శూలము, ఖట్వాంగము, ఖడ్గము, చషకము (పానపాత్ర) ఉన్నాయి. ఇక్కడ త్రైలోక్య మోహనచక్రము మనల్ని మోహంలోకి నెట్టే సర్వమోహినిగా చెప్పారు. ‘‘అజ్ఞానావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంత వః- జ్ఞానము అజ్ఞానముచే కప్పబడగా, జీవులు మోహమును పొందుదురు. మన భౌతిక శరీరమునకు మూలాధార చక్రము, ఆధారభూతమైన అతి ముఖ్యమైనది. శ్రీ మహాగణపతి ఈ చక్రానికి పురుష అధిదేవతగానున్నారు. ఈ చక్రమందలి నాలుగు రేకులపైనా వరసగా బంగారు రంగులో ‘వం, శం, షం సం’ అను బీజాక్షరములు కలవు. బ్రహ్మకు స్థానమైన, రుూ మూలాధార చక్రంపై దృష్టి నిలిపి ధ్యానించి సిద్ధి పొందితే, సమస్త విద్యలలో ప్రావీణ్యంతోపాటు, వాక్పటుత్వము కలగడంతోపాటు అట్టి సాధకునికి కోరికలు నశించి ఆత్మానందాన్ని పొందుతాడు. గణపతిని శివుని అష్టమూర్తులలో ‘శర్వుని’గా చెప్పారు. అంటే పృథ్వీతత్వంగా మూలాధారంలో వుంటాడు.
గణపతిని వేద స్వరూపుడుగాను ఆయన తొండమును ఓంకారానికి ప్రతీకగాను మనం భావిస్తాం. ప్రణవం బ్రహ్మ విద్యయే కదా, అందువలన కాదిహాది మూలాధారాది విద్యాద్వయాత్మకం అని చెప్పారు. మరియొక సమన్వయమేమనగా గణపతి మహామంత్రంలో 28 అక్షరాలున్నట్లే మూలాధార చక్రమందు త్రైలోక్య మోహన చక్రంలో 28 మంది ప్రకట యోగినులుంటారు. వీరు తృతీయ భూపురంలో 10 మంది అణిమాదిసిద్ధి దేవతలు, ద్వితీయ భూపురంలో బ్రాహ్మి మొదలగు 8 మంది శక్తులు, ప్రథమ భూపురంలో 10 మంది ముద్రా దేవతలు మొత్తం 28 మంది ప్రకట యోగినులు, శ్రీ మహాలక్ష్మీ గణపతి మంత్రానికి 28 అక్షరాలు సంకేతాలు. అదేవిధంగా బ్రహ్మ విద్యయైన షోడశి మంత్రానికి సమన్వయం చెప్పారు పెద్దలు. అదేవిధంగా పెద్దలు చెప్పిన మరొక సమన్వయం వేద విద్యలైన కాది హాది విద్యల తోటి సమన్వయం. శ్రీచక్రార్చనయందు అమృత పాత్ర స్వీకార సందర్భంలో మూలాధార దేవతయైన గణపతికి పూజ తర్పణాదులు సమర్పిస్తారు. ఇక్కడ ఆత్మ పాత్ర కింద బిందు సంవృత్త చతుస్రమండలం వేస్తారు. ఇది మూలాధార చక్రమునందలి నాలుగు దళముల పద్మమునకు, బిందు సంవృత్తము పృథివి తత్వానికి ప్రతీకగా రుూ యంత్రాన్ని సంకేతిస్తారు. పంచదశీ కూటమందలి తృతీయ కూటమునందు ‘స, క, ల’ అని సకారముతో ప్రారంభమగును. తరువాత పూజించబడే సర్వాశా పరిపూరక చక్రం (స్వాధిస్టాన చక్రం). దీనికి కాకిని (క) శక్త్యాత్మకంగాను, తరువాత అర్చించబడే, సర్వ సంక్షోభణ (మణిపూరక) చక్రానికి ‘ల’ లాకిని శక్త్యాత్మంగాను చెప్పబడింది. కావున యిది కూడా ఒక సమన్వయం. ఆ విధంగా శ్రీచక్రంలోని తొమ్మిది ఆవరణలకు వరుసగా బిందువు (0) నాదము (మ్) క, ర, ఏ, ఈ, హ, స, ల వర్ణములు వరుసగా సర్వానందమయ చక్రం (సహస్రార చక్రం) నుండి త్రైలోక్య మోహన (మూలాధార)చక్రం వరకు ఆయా చక్రావరణలకు ప్రకృతులుగా చెప్పారు పెద్దలు. ‘లం’ బీజము పృథివీ తత్వానికి సంకేతం పృధ్వి తన్మాత్ర గ్రంథం. శ్రీ లలితా సహస్రనామములలోని శ్రీమాత యొక్క అనేక నామములు ‘విశ్వభ్రమణకారిణి’ విశ్వధారణి ‘విశ్వతోముఖి’ విశ్వమాతా ‘్ధరా’ పృధ్వీపరంగా చెప్పబడ్డాయి. అదేవిధంగా భగవద్గీతలో పరమాత్మ పుణ్యోగంధః పృధివ్యాంచ అని చెప్పారు. మహామృత్యుంజయ మంత్రంలో ‘సుగంధిం పుష్టివర్ధనం’ అని చెప్పబడింది.

డా॥ గుడిపాటి వి.ఆర్.ఆర్.ప్రసాద్ 9490947590