Others

భూగోళం విలవిల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గత కొన్నివారాలుగా మన దేశంలో ఉష్ణతాపం గణనీయంగా పెరిగింది. వర్షపాతం అనూహ్యంగా వాతావరణశాఖ అంచనాలకు భిన్నంగా తగ్గిపోయింది. వర్షాకాలం ఎండాకాలాన్ని తలపించడంతో ప్రజలు వేడిని భరించలేక మలమల మాడిపోతున్నారు. భూఉష్ణోగ్రత 1.5 సెల్సియస్ డిగ్రీలకు మించకూడదని పర్యావరణ శాస్తవ్రేత్తలు పదే పదే హెచ్చరిస్తున్నా వాటిని పెడచెవిన పెట్టడం భూతాపానికి ప్రధాన కారణం. వాతావరణ అసమతుల్యతకు మానవ తప్పిదమే కారణం. ప్రకృతి సమతుల్యానికి కావల్సిన అనుకూల పరిస్థితులు లేకపోవడంతో ఉష్ణతాపం పరిధులకు మించి పెరిగిపోతోంది. అడవుల నరికివేత, ఆకాశహర్మ్యాల నిర్మాణం, మైదాన ప్రాంతాలలో చెట్లు లేకపోవడం, అభివృద్ధి పేరిట చెట్లను నరికివేయడం, పరిశ్రమల- వాహన కాలుష్యం ప్రకృతి అసమతుల్యానికి కారణవౌతోంది. మానవుడు అభివృద్ధి పేరిట ప్రకృతిని సవాలుచేస్తే, దానికి ప్రతిగా ప్రకృతి కనె్నర్ర చేస్తే పరిణామాలు ఏ విధంగా వుంటాయో ప్రస్తుత పరిస్థితులు తెలుస్తుంది.
బహుళ అంతస్థులు నిర్మించి, నీటి అవసరాల కోసం భూమిని ఇష్టారాజ్యంగా తవ్వి ఒక బోరు పనిచేయకపోతే- అదే ప్రాంగణంలో మరో రెండు బోర్లు జోడిస్తూ భూగర్భ జల సమతుల్యతని అస్తవ్యస్తం చేయడం ఎంతవరకు సబబు? అభివృద్ధి పేరిట హరితదనాన్ని హరియించి, తన ఉనికికే ముప్పుతెచ్చుకోవడం కూర్చున్న కొమ్మను నరుక్కోవడమేనని నేటి మానవుడు తెలుసుకోవడం మంచిది. వాతావరణంలో సున్నితత్వం లోపించడం, కర్బన ఉద్గారాల తీవ్రత పెరగడంతో- ప్రజల జీవనప్రమాణాలపై తీవ్ర ప్రభావం పడుతోందని పర్యావరణ శాస్తవ్రేత్తలు హెచ్చరిస్తున్నారు. ఉష్ణ తీవ్రతతో 1997-2017 మధ్యకాలంలో సముద్ర మట్టాలు అనూహ్యంగా 3.3 మిల్లీమీటర్లు పెరిగి, ఫలితంగా వరదలు, సునామీలు సంభవించాయి. సముద్ర జలాలు జనవాసాలలోనికి చొచ్చుకురావడం, మంచు ఖండాలు కరుగుతుండడం, నదులు ఎండిపోయి సాగునీరు, తాగునీరు లభించడం దుర్లభమవుతోంది.
హఠాత్తుగా కారుమేఘాలు కమ్ముకువచ్చి కుంభవృష్టి (క్లౌడ్ బరస్ట్) కురిపించడం, పెను తుఫాన్లు విరుచుకుపడి భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించడం సర్వసాధారణమైంది. వర్షాలు లేనందున వ్యవసాయ రంగంపై జీవిస్తున్న కోట్లాది ప్రజలు ఈ రంగాన్ని త్యజించి, పట్టణాలకు వలస కూలీలుగా వలసవెళ్ళడం దేశంలో నెలకొంటున్న సామాజిక సమస్యకు దర్పణం పడుతోంది. మన దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు గత దశాబ్దకాలంలో 21శాతం తగ్గిపోయాయని, దిద్దుబాటు చర్యలు లేకపోతే చిన్న చిన్న ఆహార ఉత్పత్తుల కోసం కూడా ఇతర దేశాల నుండి దిగుమతుల కోసం ఆధారపడే దుస్థితి సంభవించనున్నదని ఓ నివేదిక హెచ్చరిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రజలు ప్రజా రవాణావ్యవస్థను మరిచి, ప్రతి కుటుంబ సభ్యునికొక వాహనం చొప్పున సమకూర్చుకుంటుండడంతో వాతావరణ కాలుష్యం పెంచడంలో తమవంతు పాత్ర పోషిస్తున్నారు. పాలకులు కూడా ఈ పెను సమస్య పట్ల ఎటువంటి అవగాహన లేక పర్యావరణ శాస్తవ్రేత్తల హెచ్చరికలను పెడచెవిన పెట్టి ప్రజల జీవితాలను గాలిలో దీపం చందాన వుంచడంపై అందరూ సమాలోచన చేయాలి.

-సి.కనకదుర్గ