Others

మురుగదాస్‌తో రజనీ రెడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తన నూతన చిత్రం 2.0తో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఈ సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే వరుస సినిమాలతో రెడీ అవుతున్నాడు. రజనీకాంత్ 2.0 తరువాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో పేట షూటింగ్ పూర్తిచేసిన రజనీ, మరో కొత్త సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడని సమాచారం. ఈ చిత్రానికి తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రజనీ 166వ చిత్రం కావడంతో చిత్ర యూనిట్ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని చిత్రవర్గాల సమాచారం. విజయ్ హీరోగా ఇటీవల విడుదలైన సర్కార్‌తో కమర్షియల్ సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న మురుగదాస్ తొలిసారిగా రజనీ హీరోగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. కొద్ది రోజుల్లో రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న రజనీకి, సామాజిక సమస్యల నేపథ్యంలో సినిమాలు చేసే మురుగదాస్ తోడైతే రజనీ పొలిటికల్ ఎంట్రీకి కూడా ఉపయోగపడుతుందని రజనీ ఈ నిర్ణయం తీసుకున్నాడని సమాచారం.