Others
దిసీజ్.. సామ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పెళ్లయతే హీరోయిన్‌గా పనికిరారనే మైండ్‌సెట్‌వున్న సౌత్‌లో పెళ్లి తర్వాత నటించి బ్లాక్‌బస్టర్లు నమోదు చేసింది సమంత. ఈ ట్రెండ్‌ను మిగతా సౌత్ హీరోయిన్లూ ఆదర్శంగా తీసుకుంటారనడంలో సందేహం లేదు. సినిమా నిర్మాణంలోకీ ఎంటరవుతానని ఈమధ్యే వెల్లడించింది శామ్. అంత బిజీలోనూ అప్పుడప్పుడూ హాట్ అండ్ స్టైలిష్ ఫొటో షూట్స్ చేస్తుంది. ఈ ఫొటో షూట్‌లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటారు అక్కినేని ఫ్యాన్స్ కొందరు. అలాంటివేమీ పట్టించుకోదు సామ్. తన ప్రొఫెషన్ విషయం.. ఏ డ్రెస్‌లు వేసుకోవాలన్నది తన ఛాయిస్ అని.. ఇతరులు ఈ విషయంలో ఎలా ఫోర్స్ చేస్తారని ప్రశ్నిస్తోంది. తాజాగా సమంత ఒక ఫొటో షూట్‌లో పాల్గొని వాటిని ఇన్‌స్టాగ్రామ్‌కి పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే హబ్బీ నాగచైతన్యతో కలిసి ‘మజిలీ’లో నటిస్తోంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమాలో ఇద్దరూ భార్యాభర్తలుగా నటిస్తుండడం విశేషం.