Others

అడవి రాముడు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్టీఆర్ ‘అడవి రాముడు’ నాకు నచ్చిన సినిమా. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నటరత్న ఎన్టీఆర్‌ల కాంబోలో తొలి సినిమా స్కోప్ చిత్రం. ‘మధుమలై’ అడవుల్లో అదే నేపథ్యంతో నిర్మించిన కుటుంబకథా చిత్రం. ఈ చిత్రంలో రామారావుకి అందించిన క్యాస్ట్యూమ్స్, మేకప్, విగ్గు విభిన్నతరహాలో కొత్త గ్లామర్‌తో కనిపిస్తాడు. చిత్రంలో ఎంతో సాహసంతో యాభై దాటిన రామారావుకు జంటగా పద్దెనిమిదేళ్ల కొత్తగా వస్తున్న జయప్రదను హీరోయిన్‌గా పెట్టడం, వద్దని వారించిన ఆయన్ని ఒప్పించటం సాహసమేకదా! వేటూరి సాహిత్యం, కె.వి.మహాదేవన్ సంగీత స్వరకల్పనలో పాటలన్నీ అత్యంత ప్రజాదరణ పొందాయ. ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి’ అనే పాటలో జయప్రద గులాబీరంగు చీరలో మెరిసిపోతుంది. రామారావు డాన్స్ మూమెంట్స్ కూడ కొత్తగా ముచ్చటగా ఉంటాయి. ఆ రోజుల్లో ప్రేక్షకులు, కుర్రకారయితే వెర్రివెత్తిపోయారు. నైట్ ఎఫెక్ట్‌లో ‘కూకూ కుహూ కోయిలమ్మ పెళ్లికి కోనంతా సందడీ’ పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. సినిమాకు ఆయువుపట్టులాంటి పాట ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహా పురుషులవుతారు’లో ఎన్టీఆర్ శ్రీరాముడిగా, వేటగాడిగా, వాల్మీకిగా నట విశ్వరూపాన్ని చూపిస్తారు. చిత్రంలో తండ్రి కొడుకులైన నాగభూషణం, సత్యనారాయణ విలన్ పాత్రలు ప్రధానమైన శక్తివంతమైన స్థాయిలో అర్థవంతంగా పోషించారు. నాగభూషణం ఊత పదం ‘చరిత్ర అడక్కు చెప్పింది విను’ డైలాగ్ ప్రేక్షకులలో బాగా ఆదరణ పొందింది.
ఛాయాగ్రాహకుడు ఎ వినె్సంట్ అద్భుతమైన పని తనంతో స్కోప్‌లో అడవి అందాలు, ప్రకృతి రమణీయతను చూపిస్తూ చక్కని ఫొటోగ్రఫీ నిర్వహించారు. ఇక ఈ చిత్ర విజయం ఓ అద్భుతం. భారతదేశ రికార్డ్. అప్పటివరకు లేని విధంగా తెలుగులో ఒకే బ్యాచ్ విడుదలలో 35 కేంద్రాలలో శత దినోత్సవం జరుపుకోవటం అవీ నాలుగు ఆటలతో! దాదాపు 12 కేంద్రాలలో రజతోత్సవం, హౌస్‌ఫుల్ కలెక్షన్లతో, ఆంధ్రాలో రెగ్యులర్ షోలతో సంవత్సరం పైగా ప్రదర్శింపబడింది. రాఘవేంద్రరావు, ఎన్టీఆర్ కాంబినేషన్‌లో 12 సినిమాలొస్తే, పది హిట్లు అందుకున్నాయ. ఈ చిత్రం విడుదలై (ఏప్రిల్ 28, 1977) నలభై రెండేళ్లవుతుంది. అయినా ఎప్పుడు చూచినా సరికొత్త అనుభూతి, ఆనందం మిగులుస్తుంది. అందుకే ఈ చిత్రం అంటే నాకు చాలా చాలా ఇష్టం.

-పీవీఎస్ రావు, అద్దంకి