Others

నేనొక ప్రేమ పిపాసిని (నాకు నచ్చిన పాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కె బాపయ్య దర్శకత్వంలో వచ్చిన ‘ఇంద్రధనుస్సు’ చిత్రం అమోఘం. ఎన్నో కేంద్రాలలో శత దినోత్సవాలు, రజతోత్సవాలు జరుపుకుంది. ఇప్పటికీ, ఎప్పటికీ రేపటి తరానికీ ఈ చిత్రం ఓ ఆణిముత్యమే. కథలో బలానికి నటీనటుల అభినయం తోడైతే, దానికి దర్శకుడి ప్రతిభ జతపడితే సినిమా ఎంత అద్భుతంగా వస్తుందో చెప్పడానికి ఇంద్రధనుస్సు ఓ ఉదాహరణ. అప్పట్లోనే బడ్జెట్‌కు వెనకాడకుండా నిర్మాత ధైర్యంగా ఈ సినిమా తీశాడని చెబుతుంటారు. ఇక సినిమాకు ఆత్రేయ కలంనుంచి జాలువారిన కవితాత్మక గీతాలు, మామ మహదేవన్ బాణీలు.. కలగలిసి ఇంద్రధనుస్సు మర్చిపోలేని గొప్ప సినిమాగా నిలిచింది. ఫొటోగ్రఫీ, లొకేషన్స్ చెప్పనక్కర్లేదు. తను ప్రేమించిన అమ్మాయి మరణించిందని తెలిసి హీరో విరహగీతంతో విలపించి పాడుకునే గీతం, చక్కటి పదాల పల్లవి చరణాలతో ఆకట్టుకున్న పాట నేనొక ప్రేమ పిపాసిని.
‘నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది. నీ హృదయం కదలనిది’ అన్న పాట నాకు చాలా చాలా ఇష్టం. అంతేకాదు చరణంలో -తలుపులు మూసిన తలవాకిటనే పగలు రేయ నిలుచున్నా/ పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళ్తున్నా.. అన్న ప్రయోగం ఆత్రేయకే చెల్లింతుందేమో.
రెండో చరణంలో -పూట పూట నీ పూజ కోసమని పువ్వులు తెచ్చాను/ ప్రేమభిక్షను పెట్టగలవని దోసిలి వొగ్గాను/ నీ అడుగులకు మడుగులొత్తగా ఎదను పరిచాను/ నీవు రాకనే అడుగు పడకనే నలిగిపోయాను.. అంటాడు కవి. సన్నివేశాన్ని భావోద్వేగంతో పాటగా చెప్పడం గొప్పగా ఉంటుంది. ఇక ఎస్పీ బాలు, సుశీలమ్మ తమ గాత్ర మాధుర్యంతో పాటకు ప్రాణమే పోశారు. ఈ పాట ఇప్పటికీ, ఎప్పటికీ రాబోయే తరానికీ వినిపిస్తుంది అంటే నమ్మశక్యంకాదేమో. ముఖ్యంగా ‘రేడియో’లో చాలామంది శ్రోతలు మరీ కోరి అడుగుతుంటారు. ఎన్నిసార్లు విన్నా తనవి తీరని పాట. ఒంటరిగానో, ఏదైనా ప్రయాణంలోనో ఈ పాట వినిపిస్తే -చిత్రంలోని సన్నివేశాలు రీళ్లు రీళ్లుగా మస్కిష్కంపై కదులుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. నాకు చాలా ఇష్టమైన పాట ఇది.

-సిహెచ్‌ఎన్ రావు, హైదరాబాద్