Others

రకుల్.. లక్కీ చాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరో మహేష్‌బాబుతో మైత్రీ మూవీ మేకర్స్ చేపట్టబోయే ప్రాజెక్టు -చిత్రమైన కాంబినేషన్స్‌తో తెరకెక్కనుంది. ప్రస్తుతం మహేష్ చేస్తున్న మహర్షి ప్రాజెక్టు తరువాత -లెక్కల మాస్టారు సుకుమార్‌తో ప్రాజెక్టు చేయనుండటం తెలిసిందే. ఈ ప్రాజెక్టుకు మహేష్ సరసన హీరోయిన్‌ను ఎంపిక చేసిన దగ్గర్నుంచీ -ఈక్వెషన్స్ వినిపించటం మొదలయ్యాయ. ఆ ఈక్వెషన్స్ హీరోయిన్ ఎవరో కాదు, రకుల్‌ప్రీత్ సింగ్. మహేష్, సుకుమార్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘1’ నేనొక్కడినే సినిమా తెరకెక్కింది. మహేష్, రకుల్ జోడీగా ‘స్పైడర్’ చిత్రం వచ్చింది. సుకుమార్‌తో రకుల్ ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో పనిచేసింది. ముగ్గురూ కలిసి వర్క్ చేస్తున్న ప్రాజెక్టు మాత్రం -మైత్రీ మూవీ మేకర్స్‌దే. విభిన్న కథాంశంతో లాజికల్ స్టోరీగా తెరకెక్కిన నేనొక్కడినే కమర్షియల్ హిట్ అనిపించుకోకున్నా -విమర్శకుల నుంచి ప్రశంసలైతే అందుకుంది. అలాగే ‘నాన్నకు ప్రేమతో’ చిత్రంలో రకుల్‌కు అటు గ్లామర్‌పరంగాను, ఇటు క్రెడిట్‌పరంగానూ మంచి మార్కులే వచ్చాయ. స్పైడర్‌లోనూ మహేష్, రకుల్ కెమిస్ట్రీ వర్కౌటైంది. ఇక -ముగ్గురి కాంబినేషన్ సరికొత్త ఈక్వెషన్‌గా కొత్త ప్రాజెక్టుపై ఆసక్తి కనిపిస్తోంది. ఏదేమైనా రకుల్ చాన్స్ కొట్టినట్టే.