Others

బాలలే సీఈఓలుగా ఎదుగుతున్న కాలం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నైకి చెందిన శ్రవణ్, సంజయ్ అనే బడిపిల్లలు ‘్ఫర్త్ డైమెన్షన్’ అన్న కంపెనీకి సీఈఓలుగా పనిచేస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్ డిజైన్లు చేస్తూ అనేక అప్లికేషన్లు సిద్ధం చేస్తున్నారు. యాపిల్, గూగుల్ లాంటి ప్రతిష్టాత్మక కంపెనీలకు వాటిని విక్రయిస్తూ ఈ ఇద్దరూ శ్రీమంతులవుతున్నారు. అలాగే, ఎనిమిది సంవత్సరాల సుబ్బరాజు అనే పాఠశాల విద్యార్థి ‘కోడింగ్ టెక్నాలజీ’లో మెలకువలు తెలుసుకుని ఎన్నో ‘యాప్స్’ రూపొందించాడు. రానున్న రోజుల్లో మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈఓ కావాలని కలలు కంటున్నాడు. ఇంత చిన్న వయసులో ప్రస్తుత మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళను కలిసి తన ఆలోచనలు ఈ బుడతడు పంచుకున్నాడు. ‘యాప్స్’ డెవలపర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలాంటి ప్రజ్ఞావంతులైన పిల్లలు విదేశాల్లో కోకొల్లలుగా కనిపిస్తారు.
విద్యార్థులిప్పుడు వివిధ కంపెనీలకు సీఈఓలుగా వ్యవహరిస్తూ కొత్త వాటిని ఆవిష్కరిస్తూ తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. రాబోయే తరానికి వారు ప్రతినిధులుగా కనిపిస్తున్నారు. వీరి ప్రతిభను చూసి పాత తరం వారు విస్తుపోతున్నారు. వర్తమాన ప్రపంచం ఇలా కొనసాగుతోంది. దీన్ని అందుకోవాలంటే ‘మన’ విద్యావిధానం ఎలా ఉండాలి? ‘మన’ విద్యాలయాలు ఎలా ఉండాలి? అవి ఎలా పనిచేయాలి? అన్న ప్రశ్నలను అందరూ వేసుకుని తమకి తాము సమాధానం చెప్పుకోవలసిన తరుణమిది.
మన చుట్టూ ఉన్న పాఠశాలల స్థితిగతులు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు ఎలా కనిపిస్తాయో కూడా అందరి ఎరుకలో ఉన్న అంశమే. ప్రపంచం ఎంతో వేగంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ‘ఇరుసు’గా చేసుకుని నవీన ఆవిష్కరణలతో మానవ జీవితాన్ని సులభతరం, సరళతరం చేసేందుకు పాఠశాల విద్యార్థుల దగ్గర నుంచి ఎందరో పారిశ్రామిక-వాణిజ్యవేత్తల వరకూ ఆలోచిస్తున్నారు. అటువైపు అడుగులు వేస్తున్నారు. పిల్లల్లో ‘ఐక్యూ’ పెరగడానికి వారి చుట్టూ ఉండే పరిసరాలు, వారి విద్య ఎంతో దోహదపడతాయనడంలో సందేహం లేదు. నేటి పాఠశాల విద్యార్థులే రేపటి దేశ పౌరులు అన్నమాట నినాదంగా మిగలరాదు. అది ఆచరణలోకి రావాలి. ఇందుకు ప్రాథమిక విద్యనుంచే గట్టి పునాదులు పడాల్సిన ఆవశ్యకత ఉంది. దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు సదుపాయాల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. పరిస్థితులు ఇలా ఉంటే విద్యార్థులు అటువైపు వెళ్ళేందుకు ఆసక్తి కనబరచడంలేదు. కాని పరిస్థితులు అక్కడక్కడా మారుతున్నాయి. దీన్ని గమనించాలి, వాటిని స్ఫూర్తిగా తీసుకోవాలి.
దేశ రాజధాని ఢిల్లీలో కార్పొరేట్ పాఠశాలలు బోలెడున్నాయి. మరి ప్రభుత్వ పాఠశాలల మాటేమిటి? అన్నదే అందరి ప్రశ్న. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు వేగంగా మారుతున్నాయి. జాతీయ- అంతర్జాతీయ స్థాయి లో ఆ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నారు. పాఠ్యాంశాలను, బోధనా పద్ధతులను సమూలంగా మారుస్తున్నారు. ఆచరణలో పెడుతున్నారు. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో ఈతకొలనులను సైతం ఏర్పాటు చేస్తున్నారంటే వాటి పరిస్థితి ఎంతగా మారుతున్నదో అర్థమవుతోంది. కార్పొరేట్ పాఠశాలల కన్నా పిసరంత ఎక్కువ సదుపాయాలు- సౌకర్యాలను సాధారణ ప్రజల బిడ్డలు చదివే ఈ పాఠశాలల్లో కల్పిస్తున్నారు. ఇది పూర్తిగా విప్లవాత్మక పరిణామం. వర్తమాన విద్యకు కావలసిన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, ఆట స్థలాలు.. ఇలా అన్నింటినీ సమకూరుస్తున్నారు. కేవలం సౌకర్యాలతో సరిపెట్టక ఉపాధ్యాయుల శిక్షణకు ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. కోట్లాది రూపాయలతో అధ్యాపకులకు, ప్రధానోపాధ్యాయులకు దేశంలో, విదేశాల్లో శిక్షణ ఇప్పిస్తున్నారు. వర్తమాన బోధనారీతులు- సబ్జెక్ట్‌పై పూర్తి పట్టు కల్పిస్తున్నారు. చుట్టూ ఆహ్లాదకర పరిసరాలు, సబ్జెక్ట్ తెలిసిప్పుడే జ్ఞానాన్ని పిల్లలకు ‘బట్వాడా’ చేసేందుకు వీలవుతుందన్న స్థిర నిర్ణయంతో అక్కడ పని జరుగుతోంది.
సాధారణ ప్రజల పిల్లలకు ఇంత అద్భుతమైన, నాణ్యమైన విద్య అందడం, అందుబాటులోకి రావడం ఆహ్వానించదగ్గ అంశం. ‘‘హ్యాపీనెస్ కరిక్యులమ్’’ పేర విద్యాబోధన సాగడం అద్భుతం గాక ఏమవుతుంది? ఢిల్లీలో పరిస్థితి అలా రూపాంతరం చెందుతూ ఉంటే తెలంగాణలోనూ గురుకుల విద్య పేరిట వందలాది విద్యాలయాల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఉచిత భోజనం- వసతితోపాటు అద్భుతమైన ఆంగ్ల మాధ్యమంలో విద్య బోధించడం అపురూపమైన విషయం. ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ ఈ గురుకుల విద్యా యజ్ఞాన్ని నిష్ఠతో కొనసాగిస్తున్నారు. గొప్ప ఫలితాలను సాధిస్తున్నారు. గిరిజనులు- దళితులు, బీసీలు ఇట్లా అన్ని తరగతులకు చెందిన పిల్లలిప్పుడు కొత్త ప్రపంచం వైపు కదులుతున్నారు. సర్వశిక్షా అభియాన్ పేరిట కూడా పెద్దఎత్తున అక్షరజ్ఞానం పిల్లలకు అందించే ప్రయత్నం కొనసాగుతోంది. ఇవి వినడానికి చిన్న విషయాలుగా అనిపించినా గొప్ప విప్లవాన్ని తీసుకొస్తున్నాయి. దీన్ని అందరూ అందిపుచ్చుకోవాలి.
ఇగ్నైట్ మైండ్స్..
బడులకు వెళుతున్న పిల్లల సంగతి సరే! మరి బడి మానేసిన, చిన్నచిన్న పనుల్లో ఉన్న పిల్లల సంగతి, సంచార జీవితం గడిపేవారి బాలల భవిష్యత్ ఏమిటి? అన్న ప్రశ్న సైతం ముందుకొస్తుంది. ఇలాంటి వారికోసం దేశం నలుమూలలా అనేక స్వచ్ఛంద సంస్థలు, వివిధ ఫౌండేషన్లు, విద్యాదాతలు కృషిచేస్తున్నారు. అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పాఠశాలలు ఇలాంటి బాలబాలికల మైండ్స్‌ను ‘‘ఇగ్నైట్’’చేస్తున్నాయి. సమాజ పరివర్తన కోసం ఈ ఫౌండేషన్ పెద్దఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. బోధకులను తయారు చేసేందుకు అధిక శ్రమచేస్తున్నారు. సంవత్సరాల తరబడి బోధకులకు శిక్షణ ఇచ్చి విలువలతో కూడిన విద్యను పిల్లలకు అందించేందుకు కృషి జరుగుతోంది. పాఠశాలలకు పిల్లలు రావడం కాదు పిల్లల దగ్గరికే పాఠశాల వెళ్ళేలా చర్యలు తీసుకుంటున్నారు. కార్మికుల, వలస కార్మికుల, సంచార జీవితం గడిపే వారి పిల్లల కోసం సరికొత్త సిలబస్‌తో వారిని వివిధ గ్రూపులుగా విభజించి ఆయా గ్రూపులకు ఆయా సబ్జెక్ట్స్‌తోపాటు నిపుణులు రూపొందించిన సిలబస్‌ను బోధిస్తున్నారు. ప్రధానంగా పిల్లల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచేందుకు కృషిచేస్తున్నారు. ‘అసోసియేటెడ్ టీచర్స్’ పేర విప్లవాత్మక పద్ధతిలో బోధకులను చేర్చుకుంటున్నారు. పిల్లలు విద్య పట్ల ఆసక్తికనబరిచేలా దాన్ని కొనసాగించేలా తీసుకోవలసిన చర్యలను ఆచరణలో పెడుతున్నారు. వీరు ‘‘పార్ట్‌నర్‌షిప్ స్కూల్స్’’ పేర కొన్నింటిని నడుపుతున్నారు. ఫౌండేషన్ అంగన్‌వాడీలను సైతం ప్రోత్సహిస్తోంది. బాల్యం నుంచే విద్య పట్ల అనురక్తి కలిగించడం ఒక విధానంగా తీసుకున్నది.
టీచ్ ఫర్ ఇండియా..
ఇన్‌ఫోసిస్ ఫౌండేషన్ ఆర్థిక సాయంతో ‘టీచ్ ఫర్ ఇండియా’అన్న విద్యా ఉద్యమం పెద్దఎత్తున కొనసాగుతోంది. షాహిన్ మిస్ట్రీ అన్న మహిళ నాయకత్వంలో విలువలతో కూడిన విద్యాబోధన సాగుతోంది. అమెరికాలో కొనసాగుతున్న ‘‘టీచ్ ఫర్ అమెరికా’’అన్న విద్యా ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ ‘టీచ్ ఫర్ ఇండియా’ ఉద్యమం కొనసాగుతోంది. ఇక్కడ కూడా వాలంటీర్ల, బోధకుల ఎంపిక, శిక్షణకు పెద్దపీట వేస్తున్నారు. ఈ ఉద్యమాన్ని అంకితభావంతో, సేవాదృక్పథంతో ముందుకు తీసుకెళుతున్నారు. ఇన్‌ఫోసిస్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ సుధామూర్తి విద్యా అసమానతల మధ్య వారధి నిర్మించాలన్న సత్ సంకల్పంతో పనిచేస్తున్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో పాల్పంచుకోవడానికి వాళ్లు కృషిచేస్తున్నారు. నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు విశేషంగా పరిశ్రమిస్తున్నారు.
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్.) కింద అనేక కార్పొరేట్ సంస్థలు ఎన్నో నిధులను విద్య-ప్రాథమిక విద్యకోసం ఖర్చుచేస్తున్నాయి. టాటా సంస్థలు సామాజిక పరివర్తన కోసం ‘టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైనె్సస్’ (టిస్) పేర పెద్దఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రిలయన్స్ కూడా విద్యారంగంలో తనదైన పాత్రను నిర్వహిస్తోంది. ఇక రామకృష్ణమిషన్ లాంటి సంస్థలు బాలల విద్యకోసం దశాబ్దాలుగా సేవలందిస్తున్నాయి. గిరిజన ప్రాంతాలలోనూ పాఠశాలలు నడుపుతున్నాయి.
ఇలా విద్యాకెరటం ఉవ్వెత్తున ఎగిసిపడుతుండగా దేశంలో వెనుకబడిన ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రంలో మావోయిస్టులు పాఠశాల భవనాలను పేల్చేస్తున్నారు. ఆదివాసీ పిల్లలకు అక్షరజ్ఞానం అందకుండా చేస్తున్నారు. ప్రపంచం ఓ గొప్ప మలుపుతీసుకుని బాలలే పెద్దపెద్ద కంపెనీలను స్థాపించి కోట్లాది రూపాయల ఆదాయాన్ని పొందుతున్న తరుణంలో ఇలా మావోయిస్టులు పాఠశాలలను పేల్చేయడం, బలవంతంగా పిల్లలను తమ ‘సైన్యం’లో చేర్చుకుని వారిచేత వెట్టిచాకిరీ చేయించడం ఎంతవరకు న్యాయం? 21వ శతాబ్దంలో ఇలాంటి పద్ధతుల వల్ల మానవాళి ముందడుగు వేయగలదా? మావోయిస్టుల చర్యల వల్ల మనం ముందుకెళుతున్నామా? లేక మరింత వెనుకబడిపోతున్నామా? అందరూ ఆలోచించాల్సిన సమయమిది!

-వుప్పల నరసింహం 99857 81799