Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వతంత్ర ప్రకృతి కలది అయింది.కనుకనే-
శ్రీరాముడిమ్మన కుండగానే తనకుగల సమస్త ధనమును దానమిచ్చుటకు తగిన మానసిక స్వాతంత్య్రమును పొందినది. అలాగే- రామ రావణులకు యశస్సునూ లోకానికి శ్రేయస్సునూ కలిగించుటకు తానుగా రావణుడపహరించు కార్యానికి నాందీ పలికినట్లు అరణ్య వాసమునకు ముందడుగు వేసింది. ఇదే ఆమె యిచ్ఛ. పైకి కథకోసం అపహరణ. దుఃఖమునూ ఇది కథ. ఆమె తత్త్వమట్టిది. అందుకే పరాశక్తికి మనస్వినీ అని పేరు. సరే-
శ్రీరాముని అరణ్య వాసము ప్రారంభమైనది ఋషి మండలాలు సీతారామ దర్శనాన్ని పొందేయి.
వారు మార్గనిర్దేశమును చేస్తూన్నట్లు వీరు పాటిస్తూన్నట్లు- ముందుకు నడుస్తున్నారు. చివరకు అగస్త్యమహర్షి ఆశ్రమానికి వచ్చేరు.
మహర్షి ఆతిథ్యాన్ని ఇచ్చేరు. ఆ తరువాత నివాసమడిగేరు. అప్పుడగస్త్య మహర్షి
ధ్యాత్వా ముహూర్తం ధర్మాత్మా ధీరో ధీరతరం వచః
అంటారు వాల్మీకి మహర్షి.
ముహూర్తకాలం ధ్యానం చేసేరుట. ఆ తరువాత ధీరతరమైన అంటే మిక్కిలి ధైర్యవంతులు పలుకవలసిన మాటను పలికేరట- ఏమని!
ఇతో ద్వియోజనే తాత బహుమూలఫలోదకః
దేశో బహుమృగశ్రీరామ్ పంచవట్య భివిశ్రుతః
ఇక్కడకు రెండు యోజనాలు దూరంలో పంచవటి అంటే ఐదు వటవృక్షాల సమూహమున్నచోటున్నది. అక్కడ ఉండమన్నాడు. అంతేకాదు-
సహి రమ్యో వనోద్దేశే మైథిలీ తత్రరంస్యతే
అన్నాడు. అది అందమైన చోటు. సీత అక్కడ క్రీడిస్తుంది.
ఎక్కడ? పంచవట వృక్షములున్నచోట.
యుగాంతమందు శ్రీమన్నారాయణుని బాల్యావస్థలో మఱ్ఱి ఆకుమీద పడుకోబెట్టిన పరాశక్తికి.
పంచవటీ స్థానాన్ని అగస్త్య మహర్షి చూపించేరు. ఆ తత్వాన్ని భవిష్యత్తును ఆయన గ్రహించేరు.
సరే- వారు వెళ్ళేరు. పర్ణశాల నిర్మాణం జరిగింది.
సీతారాములు గోదావరీ స్నానం చేస్తూ
పంచవటీ పర్ణశాలా నివాసం చేస్తూ
కృతాభిషేకో సరరాజ రామః
సీతాద్వితీయస్సహ లక్ష్మణేన
కృతాభిషేకో గిరిరాజపుత్య్రా
రుద్రస్సనందీ భగవానివేశః - అనినట్లున్నాడు
పార్వతీదేవితో కూడిన రుద్రునిలా ఉన్నాడట.
ఇక్కడి నుండి శ్రీరాముడు రుద్రుడే. ఆమె పార్వతీ రూపమైన పరాశక్తే. ఒకటే అయిన పరబ్రహ్మ తత్వమే- స్థితి కాలమందు విష్ణురూపంగా లయకాలమందు రుద్రరూపంగా కన్పిస్తుంది. అలా బ్రహ్మతత్వంనుండి వేరైనట్లు కనిపించే శక్తితత్వమే
విష్ణుశక్తి అయిన లక్ష్మిగా రుద్రశక్తిఅయిన పార్వతిగా బ్రహ్మశక్తి అయిన సరస్వతిగా కనిపిస్తూ ఉంటుంది.
కథ నడిచింది. సీతాపహరణమైంది. రావణుడు సీతను తీసికొని వెడుతున్నాడు. దదర్శ గిరిశృంగస్థాన్ పంచవానర పుంగవాన్.
ఐదుగురు వానర శ్రేష్ణులను చూసింది. తన నగలన్ని మూటకట్టి జారవిడిచింది. వారామెను అనిమిషులై చూసేరు. ఎవరీ పంచవానర పుంగవులు? సుగ్రీవుడు జాంబవంతుడు ఆంజనేయుడు నలుడు నీలుడు వీరిలో సుగ్రీవుడు రాజు. వాడు తన రాజ్యంపోయి తన భార్యపోయి తన నివాసంపోయి దైన్యంతో లక్ష్మీ జపం చేస్తూన్నాడు. తక్కిన నలుగురు అతని వాళ్ళు. అతని హానికి దుఃఖించేవాళ్ళు. అతని వృద్ధికి సంతోషించేవాళ్ళు- అందుకని అతనితోబాటే ఆ దేవీ నామ పరాయణులై ఉన్నారు. ఇంతలో నగల మూట పడింది. వాళ్ళ భాగ్యం పండింది.

- కాశీభొట్ల సత్యనారాయణ