Others

అదే పునరుజ్జీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ సంస్కృతి, హైందవ ఆరాధనా విధానాలు, సంస్కృత భాషా ప్రభావము- ఈ మూడున్నూ కొన్ని వేల యేండ్లనాడే విశ్వవ్యాప్తాలుగా ఉండేవని దాఖలాలు, తిరుగులేని సాక్ష్యాలు ఎప్పటికప్పుడు పరంపరగా కనిపిస్తూనే ఉన్నాయి- ప్రపంచ నాగరికతా స్రవంతిని పరిశీలిస్తూ పోతుంటే.
అదే పునరుజ్జీవం- మన సంస్కృతికి సంబంధించి- మళ్ళీ ఇటీవల ప్రపంచం నలుమూలలా- ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో తన ప్రభాపరంపరలను చూపిస్తోంది.
అమెరికాలో అనేకచోట్ల ‘పిట్స్‌బర్గ్’లు తామరతంపరగా వెలుస్తున్నాయి. ప్రవాస భారతీయులతో గొంతు కలిపి స్థానిక అమెరికన్లు భారతీయ తాత్త్విక వ్రచనకారులను సాదరంగా ఆహ్వానించి ఉపన్యాసాలిప్పించుకొని, జీవితపు విలువలను, ఉదాత్త జీవనమార్గ సూత్ర-రహస్యాలను, ఆధ్యాత్మిక బలము- ఊరటలను పొందిన అనుభూతిని, తృప్తిని అందుకుంటున్నారు.
జర్మనీ, అమెరికాలలో సంస్కృత భాషావ్యాప్తి, పఠనము, అధ్యయనము పెరుగుతున్నాయి- ముఖ్యంగా అక్కడి విద్యాలయాలలో వేల సంఖ్యలో పాశ్చాత్య దేశస్థులు సస్వరంగా, సుస్వరంగా, ఉచ్ఛారణా పరిశుద్ధంగా వేదాధ్యయనం చేస్తున్నారు. మన వేద గణితాన్ని వాళ్ళు మెచ్చుకుంటున్నారు. కొందఱు ఉపయోగంలో పెట్టుకుంటున్నారు.
ఈ రకమైన అమెరికన్ల ఆసక్తి ఇటీవల ఆఫ్రికాలోగూడా ప్రవర్ధమానమవుతోంది.
జోహాన్స్‌బర్గ్‌లో శారదా మందిరం
కొందఱు దక్షిణాఫ్రికా దేశీయులు క్రమం తప్పకుండా ప్రతి నిర్ణీత కాలవ్యవధిలో ఒకసారి చొప్పున శృంగేరీ శ్రీ శారదా పీఠాశ్రమానికి వచ్చి, ఎంతో భక్తిప్రపత్తులతో అమ్మవారిని దర్శించుకొని వెళ్తున్నారు. అలాంటివారిలో ఆన్ స్టెర్న్‌జెజ్- ఫ్రెడరిక్ స్టెర్న్‌జెజ్ అనే భార్యాభర్తల జంట ఒకటి. ఆ దంపతులు తాము అనుకున్న కాలవ్యవధికి అనుగుణంగా 2010 నుంచి క్రమం తప్పకుండా శృంగేరీ పీఠ దర్శనం చేసుకుంటూ వస్తున్నారు.
వాళ్ళిద్దరూ కలిసి జోహాన్స్‌బర్గ్‌లో తమ ఇంటికి దగ్గరగా శ్రీ శారదాంబాదేవి ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు.
ముందుగా ఆ దంపతులు శృంగేరీలో కొన్ని రోజులు గడిపి, ఆ తరువాత శృంగేరీ పీఠ శంకరాచార్య జగద్గురు శ్రీ భారతీ తీర్ణ మహాస్వామిని కలిశారు- శారదాంబా అమ్మవారి సన్నధిలో. అక్కడ ఆ స్టెర్న్‌జెజ్ దంపతులు తమతమ ప్రార్థనా కార్యక్రమాలను ముగించుకొని ఎంతో భక్తిప్రపత్తులతో తమ దేశంలో తాము చేయాలనుకున్న దేవాలయ నిర్మాణ ప్రతిపాదనను భారతీ తీర్థ మహాస్వామికి విన్నవించుకొని వారి అంగీకారాన్ని అర్థించారు. అదీ-వాళ్ళ వినయము, సంస్కారమూను. స్వామివారు అంగీకరించారు, ఆనందించారు, ఆశీర్వదించారు.
ఆ దక్షిణాఫ్రికా దంపతులు తాము నిర్మించదలచుకొన్న శారదాంబా ఆలయ నిర్మాణపు ప్లానును చూపించారు. ఆ ప్లాను స్వామివారు ఆమోదించారు. అంతేకాకుండా వాళ్ళకు శ్రీ చక్రపు నమూనా, విఘ్నేశ్వరస్వామి విగ్రహాలను కూడా ప్రదానం చేశారు.
త్వరలోనే జోహాన్స్‌బర్గ్ శారదా మందిరంలో ప్రతిష్ఠాపన క్రతు పూర్వకంగా ఆ విగ్రహాల స్థాపన జరగబోతోంది.
‘‘మేము అటుఇటుగా సుమారు ఇరవైఐదు మంది భక్తులమున్నాము మా ఊళ్ళో ఒక జట్టుగా. మేము ప్రతిరోజూ ఇక ఈ గుడికి వెళ్ళి పూజ, ప్రార్థనాదులు చేసుకుంటాము’’అంటోంది శ్రీమతి స్టెర్న్‌జెజ్.
‘‘మా దంపతులిద్దరికీ నలభైయ్యేళ్ళుగా ఆధ్యాత్మిక-మానసిక ప్రశాంతి కోసం అనే్వషణతోనే సరిపోయింది. ఎన్నో తాత్త్విక గ్రంథాలు చదివాము. నిశితంగా పరిశీలించాము. అన్నీ అధ్యయనం చేశాక మమ్మల్ని భారతీయ సనాతన ధర్మమే ఆకట్టుకుంది. ఆ తరువాత ఒక రోజున ఒక స్నేహితుడు ‘‘సనాతన ధర్మ పరిరక్షణ, పరిపోషణలలో శృంగేరీ శారదాపీఠం చేస్తున్న కృషి గుఱించి మాకు సవివరంగా చెప్పాడు. నాకు భర్త, గురువు అయిన మావారితో కలసి మొట్టమొదటిసారిగా 2010లో శృంగేరీ పీఠాన్ని దర్శించుకున్నాము. శృంగేరీ పీఠంలోని ప్రశాంతత, ఉదాత్తతలను చూసి ఒక దివ్యానుభూతి చెందాము. ‘మా నలభయ్యేళ్ళ సుదీర్ఘ నిర్విరామ అనే్వషణలో సముచిత గమ్యంచేరుకొని కృతార్థతా సఫలతలు సాధించాము అనిపించింది మాకు’’అని కూడా చెప్తోంది ఆమె.
ప్రతి సంవత్సరం రెండుసార్లు ఆ దక్షిణాఫ్రికా స్టెర్న్‌జెజ్ దంపతులు శృంగేరీ పీఠాన్ని దర్శించి వెళ్తుంటారు. వేదాలను అధ్యయనం చేయటంకోసం వాళ్ళు సంస్కృతం కూడా నేర్చుకున్నారు.
మరి మన దేశపు లౌకిక వాదులేమో ‘రామాలయ నిర్మాణం మతోన్మాదం, సంస్కృతం నేర్చుకోవటం తిరోగమనం, వేదాధ్యయనం బ్రాహ్మణాధిక్యవాదం’అంటూ పిచ్చికూతలు కూస్తున్నారు. ‘పశ్చిమం’ తూర్పుకు చూస్తూ ఉషస్సును కోరుకుంటుంటే ‘తూర్పేమో’ ‘పశ్చిమం’వైపు పరుగెడుతూ తమస్సులో పడిపోతోంది.
‘తమసోమా జ్యోతిర్గమయ!’

- శ్రీపతి పండితారాధ్యుల పార్వతీశం 9849779290