Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ తరువాత అరణ్య వాసమన్నారు. సరే అన్నాడు.
తల్లి కౌసల్యకు చెప్పేడు. ఆవిడ ఏడిచింది. వద్దన్నది.
ఆమెను ఊరడింపచేసేడు. సీతా సందర్శనానికి వచ్చేడు.
వాల్మీకి మహర్షి ఇక్కడ మన చేత సీతా దర్శనం చేయిస్తారు. ఎలాటి సీతను-
వైదేహీ చాపి తత్సర్యం నశుశ్రావ తపస్వినీ
తదేవ హృది తస్కాశ్చ వరాజ్యాభిషేచనవ్
వరాజ్యాభిషేక భంగ వృత్తాంతవే తెలియని తపస్విని అయిన సీతను చూపిస్తారు.
ఏమి రుూ తపస్వినీ లక్షణం-
తానెందుకు భూమి నుండి బయట పడిందో తానెందుకు శ్రీరాముని చేపట్టిందో
ఎవని నుండి రుూ ప్రపంచాన్ని రక్షించి దేవ మానవాది సకల లోకాలకు కల్యాణ స్థితిని కల్పించాలో దానిని గురించిన తపస్సే అందే ఏకాగ్రమైన ఆలోచనే
స్వభావంగా కలిగిన స్వరూపాన్ని శ్రీరాముడు చూసేడు
వాల్మీకి మనకూ చూపించేరు. సరే- కథ నడిచింది.
ఆవిడ నేనూ అడవికి వస్తానంది.
ఈయన వారించినట్లు ప్రయత్నం చేసేడు.
ఇమం హి సహితుం శోకం ముహూర్తమపినోత్సహే
కింపునర్దశవర్షాణి త్రీణిచైకం చదుఃఖితా.
నిన్ను విడువవలసి వచ్చిన క్షణకాల శోకానికి కూడా నేను తట్టుకోలేను. అటువంటిది పద్నాలుగు సంవత్సరాలెలా ఉండటం.
అంటూ- సీత పద్నాలుగు ఏళ్ళు అనలేదు.
పది- మూడు- ఒకటి అని అన్నది. అంటే
వనవాస కాలానికి తగిన కాలప్రణాళిక నొకదానిని ఆమె ముందే తయారుచేసి ఉంచిందన్నమాట.
అరణ్యవాస కాలంలో శ్రీరాముడు 10 ఏళ్ళు ఋష్యాశ్రమాలలో తిరిగేడు.
మూడేళ్ళు పంచవటిలో ఉన్నాడు. ఏడాదిపాటు సీత లంకలో ఉన్నది.
ఇదీ సీతావాక్యమందలి భావం.
పైకి తేలికగా పలికినట్లన్నది.
ఆవిడ పట్టుబట్టింది.
ఈయన అంగీకరించినట్లు అంగీకరించేడు.
అంతే-
తతః ప్రహృష్టా పరిపూర్ణమానసా
యశస్వినీ భర్తురవేక్ష్య భాషితం
ధనాని రత్నాని చ దాతుమంగనా
ప్రచక్రమే ధర్మ భృతాం మనస్వినీ.
ఎంతో సంతోషించింది. అంతేకాదు. అంతవరకూ తపస్వినిగానున్న సీత యశస్విని అయింది. ఏమా! యశస్వనీ లక్షణం- యశస్సను తానుకలది, అదియేమి!
శ్రీరామునికి రావణ సంహార రూపమైన యశస్సు
రావణునికి కావ్యార్థమైన యశస్సు.
వాల్మీకి మహర్షికి కవి రూపమైన యశస్సు
ఈ జాతికి పతివ్రతాత్వమైన యశస్సు.
ఇన్ని యశస్సులను తానీయగలుగుటకు తాను కలది.
అయోధ్యను విడుచుటయే రాముని యశస్సు.
రాముడు అయోధ్యను విడిచినప్పుడే రావణుని యశస్సు ఈ యశస్సులను వారికి పంచుటకు ఆమె తపస్సు.
సమస్త ప్రకృతికి మూలమైన పరాశక్తి విష్ణ్వాదులచే పని చేయించి ఆ యశస్సు వారికి ఇప్పించును గదా!
అందుకే పరాశక్తికి ‘‘యస్వినీ’’అని పేరు.
ఆ యశస్విని యే- ఈ యశస్విని
ఆమె యిప్పుడు మనస్విని కూడ అయింది. అంటే-
*
ఇంకావుంది...

- కాశీభొట్ల సత్యనారాయణ