Others

సిరులిచ్చే శ్రీనివాసుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంటికి కనిపించని పరమాత్మ భక్తుల కోరిక మేరకు తన్ను తాను అనేకవిధాలుగా సృజియంచుకుంటూ ఉంటాడు.
కలియుగంలో ఆ పరమాత్మనే సస్వరూపుడై వేంకటేశ్వరుడై వేదనలను దూరం చేస్తానని తిరుమల కొండపై నిలిచాడు. ఆ స్వామిని చూడడానికి వేయ కన్నులున్నా చాలవు. అందుకే దేశ విదేశాలనుంచి తండోప తండాలుగా భక్తజనం వచ్చి స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. తిరుమల ఎపుడూ నిత్యకల్యాణం పచ్చతోరణంలాగా కళకళలాడుతూ ఉంటుంది.
ఆ కలియుగ స్వామి నే భక్తుల కోరిక మేరకు ప్రపంచమంతా విస్తరించాడు. సర్వ వ్యాపకుడన్న పేరుకు తగ్గట్టుగా స్వామి ప్రతి చోటా ఆలయాలు కట్టించుకుని కోరిన సిరులిచ్చి శ్రీనివాసుడుగా ఖ్యాతి గాంచుతున్నాడు.
శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి అనే ఏడుకొండలు ఆదిశేషుడి ఏడుతలలపై నిలిచి ఏడుకొండలవాడిగా ఉన్న వేంకటేశుడు తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరంలో భాగ్యాలనిస్తానం టూ తనకుతానై తరలివచ్చి తుర్క యాంజాల్‌లో శ్రీ ఆదివేంకటేశ్వరస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. ఈ యాంజాల్‌లో శ్రీభూనీళా సమేత శ్రీఆదివేంకటేశ్వస్వామిగా భక్తుల కోరికలను నెరవేరుస్తున్నాడు.
రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని తుర్క యాంజాల్ పరిధిలో ఆది వేంకటేశ్వర నగర్ (ఏవి నగర్) లో శ్రీభూనీళా సమేత శ్రీ ఆది వేంకటేశ్వరస్వామి కొలువై ఉన్నాడు. శ్రీతిరుమల హౌజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ నోముల అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఆదివేంకటేశ్వరస్వామికి అధునాతన ఆలయం నిర్మించారు.
నీళాదేవి అంటే శ్రీదేవి అని. మహాలక్ష్మి అవతారాలే భూదేవి, నీళాదేవి. తుర్కయాంజాల్‌లో వేంచేసిన భూనీళా శ్రీఆది వేంకటేశ్వరస్వామి విగ్రహాలను తిరుమల-తిరుపతి నుండి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్టించారు.
ఆదివేంకటేశ్వరస్వామి ఆలయంలోకి వెళ్లగానే ప్రశాంతమైన వాతావరణంలోకి అడుగిడినట్టు ఉంటుంది. ఆలయంలో ఎడమవైపు వినాయకుడి ఆలయం దర్శనంతో విఘ్నాలు పటాపంచలై వేంకటేశ్వరుని దర్శనం సులభతరం చేస్తుంది.
ప్రధాన గర్భాలయంలో శ్రీవేంకటేశ్వరస్వామి, ఆ స్వామివారికి కుడివైపు పద్మావతి, ఎడమవైపు ఆండాల్ అమ్మవార్ల ఆలయాలు ఉన్నాయి. గర్భాలయాన్ని ఆనుకుని విశాలమైన మండపం నిర్మించారు. వేంకటేశ్వరస్వామి మూలవిరాట్టుకు ఎదురుగా ప్రధానమండపం ప్రారంభంలో గరుడాళ్వార్లు వేంచేసి ఉన్నారు. ఆలయం చుట్టూ నాలుగువైపులా మాడవీధులున్నాయి. ఈ వీధుల్లో స్వామివారు తరచూ ఊరేగుతారు.
ఆలయంలో ఈశాన్యంవైపు యజ్ఞశాలను నిర్మించారు. ఈశాన్య మూలలో పెద్దకోనేటిని నిర్మించారు. కోనేటిలో స్వామివారి ఉత్సవమూర్తికి ఉత్సవాల సందర్భంగా చక్రస్నానం తదితర పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయం చుట్టూ హరితహారం తరహాలో ఉద్యానవనాన్ని ఏర్పాటు చేశారు. వాయవ్యంలో ఉన్న అందమైన ఉద్యానవనంలో శ్రీకృష్ణుడి విగ్రహాన్నీ ఏర్పాటు చేశారు. ఆండాల్ తిరుప్పావై పాశురాలను పాడుతూ మార్గళీ వ్రతం కూడా చేస్తారు.

- జంగం శ్రీనివాసులు