Others

ఐదురోజుల పెళ్లి.. అరుదైన పెళ్లి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంగరంగ వైభోగంగా జరిగే పెళ్లి అంటే వినడమే కానీ చూడం.. అయినా ఈ రోజుల్లో అంత భారీగా, ఆడంబరంగా పెళ్లిళ్లు జరగడం వింతే.. అదీకాక పాత పద్ధతులు మళ్లీ వెలుగులోకి వచ్చినట్లు ఉంది ముకేశ్, నీతా అంబానీల గారాల తనయ ఈషా పెళ్లి చూస్తుంటే.. ఐదు రోజుల పెళ్లి సందడి, పచ్చని పందిరి, చీరలు, సారెలు, చుట్టాలు పక్కాలతో సందడే సందడి.. అదీకాక ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెళ్లి ఇది. ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత ధనికుడు. అందుకే కూతురి పెళ్లిని అంత ఆడంబరంగా చేశారు. ఒక్కగానొక్క కూతురైన ఇషా- ఆనంద్ పిరమాల్‌ల పెళ్లికి దాదాపు 100 మిలియన్ డాలర్లను ఖర్చు పెట్టారని అంచనా.. అంటే మన కరెన్సీలో దాదాపు రూ. 718 కోట్లు అన్నమాట.. 37 సంవత్సరాల క్రితం ప్రిన్స్ చార్లెస్-ప్రినె్సస్ డయానా పెళ్లి కూడా ఇంతే ఘనంగా జరిగింది. ఇప్పటి డాలర్ విలువ ప్రకారం.. వారి పెళ్లికి 110 మిలియన్ డాలర్లు ఖర్చయింది. మళ్లీ ఆ స్థాయి ఖర్చుతో జరుగుతున్న పెళ్లి మాత్రం ఇషా- ఆనంద్ పిరమాల్‌లదే..