Others

బాప్‌రే బామ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

102 సంవత్సరాల వయస్సులో ఓ బామ్మ చేసిన సాహసం ప్రపంచాన్ని అబ్బురపరిచింది. దక్షిణ ఆస్ట్రేలియాకు చెందిన ఐరిన్ ఓషియా అనే బామ్మ స్థానిక లాంగోర్నే లోయలో 14000 అడుగుల ఎత్తు నుంచి గంటకు 136 మీటర్ల వేగంతో స్కైడైవ్ చేసి ప్రపంచరికార్డు సృష్టించింది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్కై డైవర్లలో పెద్దవయస్కురాలిగా చరిత్రకెక్కింది. మోటారు న్యూరోన్ వ్యాధివల్ల కూతుర్ని కోల్పోయిన తర్వాత ఈ వ్యాధిపై అవగాహన కల్పించడం కోసం ఐరన్ ఓషియా ఏటా ఇలా స్కైడైవింగ్ చేస్తోంది. దక్షిణ ఆస్ట్రేలియాలో సేవలందిస్తున్న మోటార్ న్యూరోన్ డిసీజ్ ఆర్గనైజేషన్‌కు నిధులు కూడా సేకరించి అందిస్తోంది ఐరిన్ ఓషియా.. 2017లో 101 ఏళ్ల బ్రిసెన్ మిలియం సృష్టించిన రికార్డును బద్దలుకొట్టి ఓషియో కొత్త రికార్డును సృష్టించింది.