Others

‘రాముడు-భీముడు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సురేష్ ప్రొడక్షన్స్‌కు ప్రాణప్రతిష్ఠ సలిపి డి.రామానాయుడు మొట్టమొదటిసారిగా నిర్మించిన ‘రాముడు-్భముడు’ ఆంధ్ర దేశంలో జైత్రయాత్ర సాగించింది. యన్.టి.రామారావు ద్విపాతాభినయం చేసిన మొట్టమొదటి చిత్రమిది. డి.వి.నరసరాజు అద్భుతమైన కథా సంవిధానానికి ప్రేక్షకులు ముగ్ధులయ్యారు. 1959లో వ్రాసిన రుూ స్క్రిప్టు నిర్మాతలెవ్వరూ ముందుకురాని కారణంగా నరసరాజుగారు దాదాపు ఐదేళ్లు తనవద్దే వుంచుకున్నారు. ‘అంతా మనవాళ్లే’, ‘రోజులు మారాయి’, ‘పెద్దరికాలు’ చిత్రాలకు దర్శకత్వం వహించిన తాపీ చాణక్య చొరవతో డి.రామానాయుడుముందుకొచ్చి సొంత బ్యానర్‌పై నిర్మాణానికుపక్రమించారు.
అమాయకుడైన జమీందార్ రాముడు తన బావ పానకాలు పెట్టే బాధలు భరించలేక యిల్లువదలి అచ్చం తన పోలికే వున్న ధీమంతుడైన భీముడు జీవితంలో ప్రవేశించటం, భీముడు రాముని యిల్లుచేరి పానకాలు భరతం పట్టటం, చివరకు యిద్దరూ కవల పిల్లలని తెలియటం చిత్రకథ. చిత్రమైన మలుపులతో ఆద్యంతం రక్తికట్టించే విధంగా అద్భుతమైన స్క్రీన్‌ప్లే ఉంది. దర్శకుడు తాపీ చాణక్యను టాప్ గ్యాలరీలో నిలబెట్టిందీ చిత్రం. పెండ్యాల సంగీతం ప్రేక్షకుల గుండెల్లో పూలు పూయించింది. ‘తెలిసిందీ లే!’, ‘అదే అదే’, ‘వుందిలే మంచికాలం’, ‘దేశమ్ము మారిందోయ్’ పాటలు ఆంధ్ర దేశమంతటా మారుమ్రోగాయి. ఈ చిత్రంకోసం సి.నారాయణరెడ్డి వ్రాసిన ‘తలుచుకుంటే మేను పులకించేను’ పాట రికార్డింగ్ జరిగినా చిత్రీకరించలేదు. కొసరాజు సిగరెట్‌పై వ్రాసిన ‘సరదా సరదా సిగరెట్టు’ డ్రామా స్టయిల్‌లో సాగే కొసరాజు వ్రాసిన ‘తగునా యిది మామా’ ప్రేక్షకుల్ని అలరించాయి. యన్.టి.ఆర్ ప్రక్కన చక్కని గ్లామరస్ టచ్‌లో జమున, యల్.విజయలక్ష్మి మరబొమ్మల్లా తిరిగారు. రంగనాథంగా యస్.వి.రంగారావు, విలన్ పానకాలుగా రాజనాల, సుశీలగా శాంతకుమారి, మామాఅల్లుళ్లుగా రమణారెడ్డి, రేలంగి వారి మధ్య గిరిజ చలాకీగా నటించారు.
ఈ చిత్రం ఆధారంగా విజయావారు తమిళంలో ‘ఎంగవీట్టు పిళ్ళై’ హిందీలో దిలీప్‌కుమార్‌తో ‘రామ్ ఔర్ శ్యామ్’నిర్మించారు. చలం నిర్మించిన ‘బుల్లెమ్మ బుల్లోడు’ జి.పి.సిప్పీ హేమమాలినితో నిర్మించిన ‘సీతా ఔర్ గీతా’ అనిల్‌కపూర్ నటించిన ‘కిషన్ కన్హాయా’ విజయా నిర్మించిన ‘గంగమంగ’ చిత్రాలు ‘రాముడు-్భముడు’ పోలికవే. ఇన్ని చిత్రాలకు కారణభూతమైన కథను సృష్టించిన రచయిత అభినందనీయులు.

-పూజారి నారాయణ