Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయితే-
సర్వదేవతామూర్తులుగా స్వామిచేత నమస్కరింపబడిన వారిలో సూర్యుడు ఇంద్రుడు వాయువు బ్రహ్మ ఉన్నారు. మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మథః
అగస్తి రగ్ని సూర్యశ్చ ఇప్ద్రస్స్కందశ్కివస్త్థా
క్రోధభట్టారకో దేవ్యా ద్వాదశామీ ఉపాసకాః
అని ఈ పండ్రెండుగురు లలితా ఉపాసకులు. కనుక వీరిలో తూర్పు దిక్కుతో కలిపి సూర్యునకు, సూర్యునితో కలిపి ఆ దిక్కునకు పాలకుడైన ఇంద్రునకు నమస్కరించేడు. ఆమెచేత సృష్టింపబడి నిరంతరము ఆమెను సేవిస్తూ పంచ సంఖ్యోపచారిణి అనే నామాన్ని ఆమెకు స్థిరపరచిన పంచభూతములను స్మరించేడు.
తన జన్మకారకుడైన వాయువును స్మరించేడు.
ఎవని అనుగ్రహము తనయందుండవలెనో అట్టి బ్రహ్మను స్మరించేడు.
అంటే స్వామి సమయ పూజ చేసేడు. ఇప్పుడు స్వామి బయలుదేరడానికి సిద్ధమవుతున్నాడు. ఆంజనేయస్వామి సర్వదేవతా నమస్కారం చేయడమనేది సుందరకాండలో మూడుచోట్ల కనిపిస్తుంది. కానీ-స్వామి నమస్కారం చేసే పద్ధతిలో ఒక హెచ్చరిక ఉంటుంది.
కార్యసిద్ధికి చేసే ప్రయత్నంలో ఉత్సాహం ఎక్కువై కేవలం పౌరుషమీదనే విశ్వాసం పెరిగితే- అది అజ్ఞాన కారణం అవుతుంది. కనుక- దానివలన దుఃఖం పుట్టి ఆ తరువాత దైవం స్మృతికి వచ్చి స్మరించటం జరుగుతుంది.
స్వామి- ‘‘బుద్ధిమతాం వరిష్ఠుడు’’ కనుక. బుద్ధిలేని సామాన్యులకు కేవల పౌరుష భావనే కలిగి దుఃఖప్రాప్తి కలుగుతుందు.
ఆంజనేయస్వామికీ దుఃఖప్రాప్తి కలుగుతుంది.
ఆంజనేయస్వామికి దుఃఖప్రాప్తి కలిగిన అనుక్షణంలోనే దుఃఖ నివృత్తి కలగటం మనం ఎదరెదర చూస్తాం. సరే.
స్వామి సముద్రాన్ని లంఘించడానికి కావలసిన స్థితిని శారీరకంగా సకూర్చుకొంటున్నాడు.
భుజాల్ని సంకోచింపచేసి ముందుకు చాపేడు
శిరస్సును పైకెత్తేడు.
దూరంగా ఉన్న మార్గంవైపు దృష్టిని సారించేడు.
ప్రాణవాయువుల్ని నిరోధించేడు.
ఆకాశంపైనే దృష్టి పెట్టుకొన్నాడు.
శత్రుపరాభవాభిరూప సమర్ధమైన తేజస్సును జలరూపమైన సత్వాన్ని ఆకాశాభినిష్క్రమణ రూపమైన వీర్యాన్ని పొందేడు- స్వామి శ్రీమంతుడయ్యేడు.
శ్రీమంతుడంటే ఎవరు?-
ఎవడు తేజోవంతుడో, వాడు.
ఎవడు సత్వమంతుడో, వాడు
ఎవడు వీర్యవంతుడో, వాడు
అయితే- ఈ గుణాల ప్రయోజనమేమిటి!
తన తేజం ఎదుటి వానిలోని కాలుష్యాన్ని కడుగగలగాలి.
తన సత్వం ఎదుటి వానిలోని దోషాన్ని సహింపగలగాలి.
తన వీర్యం ఎదుట వానిని కష్టాల నుండి దాటింపగలిగి ఉండాలి.
ఇవి స్వామి యందు మనకు కనబడే లక్షణాలు.
సుందరకాండను పారాయణ గ్రంథంగా నమ్ముకొన్నవాళ్ళు పొందగలిగిన లక్షణాలు.
సరే, - స్వామి శ్రీమంతుడయ్యేడు.
ఇంకావుంది...

- కాశీభొట్ల సత్యనారాయణ