Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆమె దర్శనాన్ని కామేశ్వరునితో కలిసి సహస్రారంలో చేయాలి. ఆజ్ఞా కమలంలో ఆ తల్లి యోగినిగా మాత్రమే కనబడుతుంది.
అందుకని వైదేహీ దర్శనోత్సు కుడవుతున్నాడు. విషణ్ణుడవుతున్నాడు. బుద్ధిమంతుడైన సాధకుడు ఈ విషణ్ణస్థితిలోనుంచి బయటపడతాడు. కనుకే-
సమీక్ష్యతు మహాబాహూ రాఘవస్య పరాక్రమం
లక్ష్మణస్యచ విక్రాంతమభవప్రీతి మాన్ కపిః
రామపరాక్రమం జ్ఞాపకం వచ్చింది. లక్ష్మణుని విక్రమం జ్ఞాపకానికి వచ్చింది. అప్పుడు మనసుకు ప్రీతి కలిగింది. ఉత్సాహవంతుడై బయలుదేరేడు. లంకా దర్శనమైంది.
నగరీ స్వేనరూపేణ దదర్శ. వతానాత్మజం
లంకా నగర అధిష్ఠాన దేవత లంక. ఆ లంకస్వామిని చూసింది.
అహం రాక్షస రాజస్య రావణస్య మహాత్మనః
ఆజ్ఞా ప్రతీక్షా దుర్థర్షా రక్షామి నగరీ మీయామ్- అంటుంది.
తనను ఉపాసించి వశం చేసికొనిన వానియందు బద్ధురాలై ఉంటుంది. వాని నీచ ప్రవృత్తికి తప్పని సరియై దోహదపడుతుంది. ఎప్పుడయితే వాని నుండి తనకు విముక్తి కలుగుతుందో అప్పుడు వానిని తిరస్కరించి వెళ్ళిపోతుంది. అందుకే స్వామి ముష్టిఘాతానికి లొంగింది. ఆంజనేయస్వామి లంకను చంపలేదు. లంక మంత్ర దైవతం. దాన్ని చంపటం కుదరదు. వశం చేసికొనటం తప్ప. ఇప్పుడు లంక స్వామికి వశమైంది. స్వామి ఆమెకు స్వాతంత్య్రమునిచ్చేడు. అందుకనే-
సీతాని మిత్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః
రక్షసాంచైవ సర్వేషాం వినాశస్సముపాగతః - అని
తానెరిగిన కాలపరిణామాన్ని సూచించింది. దురాత్ముడైన తన ఉపాసకుని మరణాన్ని సంతోషంగా సూచించింది. ఇట్టి సామాన్య ఉపాస్యములు స్వామి ముందు తలవంచుతూనే వుంటాయి. పైకి కథ-లంకా విజయం అయింది. లంకలో అడుగుపెట్టేడు.
రాఘవార్థం చరన్ శ్రీమాన్ దదర్శచ ననందచ
శ్రీమంతుడైన స్వామి రాముని కొరకు లంకలో సంచరిస్తున్నాడు. రామాజ్ఞను నెరవేర్చటం కోసమనే చూడవలసిన చోటెల్ల చూస్తున్నాడు. చూసిన చోట్లలో సీత కనబడకపోయినందుకు సంతోషిస్తూనూ ఉన్నాడు. వాల్మీకి మహర్షి అనని ఈ మాట- భావమది.
సాయంకాల వేళ సంగీత కళా శాలలో వినిపిస్తూన్న మధుర గీతాలు భరత నాట్యావధానంలోంచి కాంచీనూపుర నినాదాలు రాక్షస గృహాలలో రాత్రిపూట జరిగే మంత్ర జపాల శబ్దాలు వేదాధ్యానం చేస్తూన్నరాక్షసుల దర్శనలా- చేసికొంటూ స్వామి ముందుకు నడుస్తున్నాడు. దీక్షతులయినవాళ్ళను, జటులయినవాళ్ళను, సన్యాసులయినవాళ్ళను, వృషభ చర్మధారణ చేసినవాళ్లను దర్ఖముష్టులయినవాళ్లను -ఇలా కర్మిష్ఠుల్ని రకరకాల శరీర చ్ఛాయలు కలవాళ్ళను రకరకాల శరీర ప్రమాణాలు కలవాళ్ళను చూస్తూ రావణాంతఃపుర ప్రవేశం చేసేడు.
రాక్షసులు పండితులంటే మనకు విచిత్రంగా కన్పిస్తుంది.
కానీ రాక్షసత్వమనేది గుణమే కాని రూపం కాదు కదా. ఆ గుణం కలవానికి వుండే తిండీబట్ట విహారం వంటి అలవాట్లనుబట్టి వాని స్వరూపం సాత్వికంగాకాక అంటే నీటుగాకాకుండా మొరటుగా ఉంటుంది.
ఇంకావుంది...

- కాశీభొట్ల సత్యనారాయణ