Others

భగవద్గీత శ్రీకృష్ణ సూక్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కం భగవద్గీత! నమస్సులు!
జగమునకున్ నీ జయంతి జయకేతనమై
ఎగరవలె శాశ్వతంబుగ
ఖగ వాహన వదనముక్త కావ్యపదంబుల్
సీ వ్యాసర్షి హృదయాన ప్రాదుర్భవించిన
విశ్వమానవ దూత వేదమాత!
భారత రణమందు భగవంతుడే బోధ
చేసిన ఉపనిషత్ సిరుల ప్రోత!
భారతీయ ప్రజావాహినీ రక్తాన
ప్రవహించు గుణదాత ప్రణవమోత!
శోక మోహాల సుషుప్తిలో మునిగిన
‘నర’జాతి దుఃఖాంత నవ్యశాంత!

గీ విశ్వ భాషాంతరాలలో శాశ్వతముగా
వెలుగులీనుచు ఆధ్యాత్మ విలువ చెప్పి
మానవులకు సనాతన మార్గమిచ్చు
జ్ఞానసుధ! భగవద్గీత! శత్రుజేత!
తె.గీ సత్యపథము తెల్పెడి కర్మషట్కవర్గ!
శౌరి పదము చేర్చెడి భక్తి షట్క మార్గ!
శాస్త్ర సారమిచ్చెడి జ్ఞాన షట్క సర్గ!
గీత- అష్టాదశాధ్యాయ పూత చరిత!
తె.గీ జడతనొదిలించి చైతన్య సరితజేయ
మోహమున మున్గు‘నరుని’ విముక్తి చేయ
బతుకు పోరున గెలిపించు బలము నీవు
గీత - సద్గ్రంథ వక్త, శ్రీకృష్ణసూక్త.

-కడియాల మధుసూదనరావు