Others

శిఖామణి సాహితీ వనంలో పీఠికాంతరంగ పరిమళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతులకు:
ప్రొ.కె.సంజీవరావు (శిఖామణి),
వెల:రూ.450/-, పేజీలు:482,
కవిసంధ్య గ్రంథమాల, యానాం.
సెల్:9848202526.
*
శిఖామణి సమగ్ర సాహిత్యం నాల్గవ సంపుటంగా 116 గ్రంథాలకు రాసిన పీఠికలు ఒక మహాగ్రంథంగా రావడంతో తెలుగు సాహిత్యంలో పీఠికా రచన ఒక ప్రక్రియగా ప్రాధాన్యతతో మరింత ప్రభావవంతమైంది. పీఠికాంతరంగంలో డా.శిఖామణి ప్రసావించిన అంశాలు పీఠికా రచనాక్రమంలో ఇతివృత్త సంబంధిత విశే్లషణ, ప్రోత్సాహాలే కాకుండా పీఠికాకర్త సాధక బాధకాలు కొత్త కోణంలో వ్యక్తీరిస్తున్నాయి. పుస్తకం చదివి పీఠికలు రాయడం రచయితల సహనానికి పరీక్ష అనటంలో సందేహం లేదు. సాహిత్య ఆచార్యుడైన డా.శిఖామణి కవి, పరిశోధకుడు, విమర్శకుడు, దళిత సాహిత్య తత్త్వవేత్తగా ఈ బృహత్ పీఠికా సంకలనంలోని వైవిధ్య వ్యాసాలు స్పష్టం చేస్తున్నాయి. పద్య కవిత్వం, గేయ కవిత్వం, వచనకవిత్వం, దళిత కవిత్వం, స్ర్తివాదం, విమర్శ, పరిశోధన, అనువాదాలు, సంకలనాలు, క్రైస్తవ సాహిత్యం, కథలు ఈవిధంగా పుస్తకం ఏదైనా రంధ్రానే్వషణ కనపడకుండా నిర్మాణాత్మక సమన్వయంతో విమర్శతో దిశానిర్దేశం చేశారు. కీర్తి, పేరు కోసమో, ఉబుసుపోకో, మొహమాటపడి రాయవలసిన అగత్యం లేకపోవటంతో పీఠికలలో నిబద్ధత, నిజాయితీ, నిశిత పరిశీలనా దృష్టి ఆత్మీయతగతమైన సుతిమెత్తని మందలింపులు చోటుచేసుకొన్నాయి. ఈ సంపుటి ముందుమాటలలో పద్మశ్రీ ఆచార్య కొలకలూరి ఇనాక్, ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి, డా.కోయి కోటేశ్వరరావు, డా. ఎం.ఎమ్.వినోదిని, పీఠికాకర్త, రచయిత డా.శిఖామణి వ్యక్తిత్వ హృదయగత తత్త్వాన్ని పీఠికల రచనా దృష్టితో అవలోకించటం ఈ సంపుటానికి నిండు చేకూర్చింది. పీఠికల సంపుటి సమీక్షలలో లోతైన పరామర్శలు, మెత్తని వాగ్బాణాలు, ప్రతిస్పందనలు, కమనీయ కవితా కరచాలనాలు, అభినందనలు ఎన్నో చోటుచేసుకొన్నాయి. నాడూ నేడూ సుప్రసిద్ధులైన కవులు, రచయితల ప్రస్తావనలు, పలకరింపులు వున్నాయి. ఈ పీఠికలన్నీ సమకాలీన సాహిత్యాన్ని వివిధ ప్రక్రియలలో విశే్లషించటంవలన ఆలోచింపచేస్తున్నాయి. ముందుమాటలుగా యువ రచయితలను ప్రామిసింగ్ భవిష్యత్తు వైపు నడిపిస్తున్నాయి.
ఈ సంపుటంలో 1997 నుంచి 2018 వరకు ముందు మాటగా శిఖామణిని, రచయితలు రాయమని కోరితే రాసినవే. వస్తుపరంగా వచనకవిత రచనలలో ఎక్కువ భాగం దళిత వాదం కనపడుతుంది. ఈ పీఠికలలో మూడొంతులకుపగై దళిత సాహిత్యం ఆవరించి ఉంది. పీఠికలన్నింటినీ శీర్షికలు రాయటంలో పీఠికాకర్త కవిత్వ ధోరణిలో నూతనత్వం స్పష్టమవుతోంది. చలం, మహాప్రస్థానం పుస్తకానికే ఆ రోజుల్లో సరియైన శీర్షికల కుదరలేదు. అభినందించారు. పెద్ద, చిన్న లేని ఆదరణ, సాన్నిహిత్యం ఈ గ్రంథంలో అడుగడుగునా కనపడుతుంది. దాట్ల దేవదానంరాజు కవితా సంపుటి వానరాని కాలంతో ఆరంభమై కొత్తపల్లి సురేష్ కవిత్వం లైఫ్ హాలిడే వరకు, డా.శిఖామణి కేవలం ఆ పుస్తకం గురించే కాకుండా రచయిత వ్యక్తిత్వ సృజనాత్మక సత్కృషిని దృష్టిలోకి తెచ్చుకొని ఆవిష్కరించారు. ఎ.విద్యాసాగర్‌ను ‘ప్రమిద కింద చీకటిలాగా ఈవెలుగుల నగరంలోని క్రీనీడలను పట్టి చూపెట్టారు’ అంటారు.పురిపండా పార్వతీశ్వరరావును ‘కవిత్వపు దారిలో తొలి అడుగే కాని తప్పటడుగు కాదు’ అంటారు. పి.ఆర్.ఎల్.స్వామిని ‘ఈ కవి కొత్తగా తల్లిపాలలోంచి కవిత్వం పుట్టుకొచ్చిందన్నారు’ అంటారు. కె.లక్ష్మీనారాయణ దళిత కవితా సంకలనాన్ని గురించి, ఖాళీలతో, వక్రీకరణలతో వున్న తెలుగు సాహిత్య చరిత్ర పునర్నిర్మాణానికి ఇలాంటి సంకలనాలను మరింత సమగ్రం చేయాలంటారు. డా. కత్తి పద్మారావు తన కవిత్వపు డేగకన్నులతో సునిశితంగా ఆంత్మగౌరవ స్వరానికి వాడీ వేడీతో తనమేధనూ దలిత జాతికి అంకితం చేసినందుకు నా ‘జై భీము’లంటారు. తొలి దళిత స్ర్తివాద కవయిత్రి చల్లపల్లి స్వరూపరాణి, వర్తమాన దళిత సమాజాన్ని నైశిత్యపు చూపుతో వీక్షిస్తున్నట్టు అభినందించారు. ఇంకా ఎన్నో ఎనె్నన్నో. తొలి సంపుటిలోనే బలమైన గొంతుతో సొంత ముద్రతో బయటకు రావాలనే కోర్కె వున్న కవి మిత్రులకు ఈ సంపుటిలో చోటు దొరకటం శిఖామణి, వారిప్రతిభా పార్శ్వాలను వెలుగులోకి తీసుకురావటం అభినందనీయం. డా. కోయి కోటేశ్వరరావు సంపాదకీయంలో పేర్కొన్నట్టు తోటమాలి వంటి కవి డా.శిఖామణి పీఠికా సంపుటం, తెలుగు సాహిత్య సీమకు పండగ కానుక.

- జయసూర్య, 9440664610