Others

నానీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుండె తడినుంచి
అంకురించు అక్షరం
గుండెల్ని తాకడమే
దాని లక్ష్యం

అన్నం తింటూ
ఆలోచించండి
అందులో కనపడుతుంది
అన్నదాత ‘గోడు’
వాగడానికి
ఎందుకంత తొందర?
‘వినడం’ ఓ కళ
నేర్చుకో ముందర
మన లోకమంతా
ప్లాస్టిక్ ఫారెస్ట్
కాలుష్యమే
మనకు చీఫ్ గెస్ట్

పరిపాలన
పారదర్శకమైతే
నియంత కూడా
నీతివంతుడే
తెల్లవాడి గుండెల్ని
తాకింది తెలుగు
వేమన పద్యానికి
‘బ్రౌన్’ కదా వెలుగు

శిశువు శివుడై
గర్భంలో తాండవించె
చిరునొప్పులకు
తల్లి పరవశించె

- మాయకుంట్ల నారాయణరెడ్డి 9989686603