Others

శ్రీ పరమహంస బోధామృతము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

22.నీరును అందున్న బుడగయునొక్కటియే.బుడగ నీటియందే పుట్టి, నీటిప దేలుచు, తుదకు నీటియందే అడగుచున్నది. అటులనే జీవాత్మయు పరమాత్మయు నొక్కటియే. ఐనను అంశ భేదము మాత్రము కలదు. ఒకటి రెండు ఖండము, రెండవది అఖండము;ఒకటి పరతంత్రము, రెండవది స్వతంత్రము.
23.జీవాత్మ భావము ఎట్టి?గంగా అపవాహమున ఒక భాగమునకు హద్దులేర్పరచి, ఆ నాగమును ‘నా గంగ’ యనుటవంటిది.
24.పాదరసముగల పాత్రలో పడవేసి సీసపుముక్క దానితో ఏకమైపోవునటుల జీవుడు బ్రహ్మసాగరమునబడినంతనే ప్రత్యేకతను విడనాడును.
25.బ్రహ్మము అపరిచ్ఛిన్నము, జీవుడో, పరిచ్ఛిన్నుడు, ఇట్టి పరిచ్ఛిన్నుడు అపరిచ్ఛిన్న బ్రస్మమునుదెలియుటెట్లు? ఇయ్యది ఉప్పుబొమ్మ సముద్రపులోతును గనుగొన యత్నించుటవంటిది. అట్టి యత్నమున ఉప్పుబొమ్మ కరగి సముద్రమునలీనమైపోవును గదా! జీవుడును బ్రహ్మస్వరూపమును గ్రహింపయత్నించునపుడు తన ప్రత్యేకతను గోల్పోయి బ్రహ్మమునందైక్యమునొందును.
26.నారాయణుడే పనరరూపమున క్రీడించుచున్నాడు. అతడు మహేంద్ర జాలికుడు;జీవజగత్లునెడు నీయింద్రజాలము వాని మాయ, జాలకుడు మాత్రమే సత్యము, జాలము మిథ్యగదా!
27.ఈతనువు వంట కుండవంటిది; మనస్సు, బుద్ధి, ఇంద్రియములు అనునవి అందలి నీరు, బియ్యము, ఊరులగడ్డలు. వీనితో గూడిన కుండను నిప్పుపై బెట్టినపులడు అవి వేడెక్కును. అప్పుడెవ్వడైనను వానిని తాకినయెడల నిజముగా వేడిమి అందలి ఏ పదార్థమునకు జెందకున్నను చేయి కాలును గదా! మనస్సు, బుద్ధి (ఇతరమైన) ఇంద్రియములు వాని వాని కార్యములను అవి చేయుచుండుటకు బ్రహ్మయొక్క శక్తియే కారణము. ఆ శక్తి తొలగెనా, ఇవి అన్నియు పనిచేయమానును.
బద్ధజీవుడు
28.జీవుడు నిజముగా సచ్చిదానంద స్వరూపుడు. అహంకారముచేతఅనేక ఉపాధులచే బద్ధుడై జీవుడు నిజస్వభావమును మరచియున్నాడు.
29.ఉపాధివలన నరుని స్వభావము మారుచుండును. ఎవ్వడైనను నిగనిగలాడు నల్లంచుధోవతిని సొగసుమీరు దుస్తులను ధరించెనేని నిధుబాబువిరచిత శృంగార గీతములు వాని పెదవులపై నాట్యము చేయునారంభించును. ఇంగ్లీషు బూట్లు తొడగెనా, బక్కవానికై ననుడంబము తలకెక్కును. తత్‌క్షణమే ఆతడు ఈలలు వేయసాగును; మెట్టునకు కుప్పించుచుబోవును. ఇక చేతిలో కలమున్నవాడు కనబడిన కాగితముపై నెల్లగిలుకుచుండును!
30.కుబుసమును పామును వేరైనట్లు ఆత్మ శరీరముకంటే భిన్నము.
31.ఆత్మ అసంగము. పుణ్య పాపములు, కష్టసుఖములు మొదలగునవి ఎన్నటికిని ఆత్మనంటజాలవు; కాని దేహాత్మబుద్ధిగలవానిని, లేక దేసమే తాననుకొనువానిని మాత్రము ఇవి బాదించుననుటకు సందియము లేదు. పొగ గోడలనే మలినము చేయగలదు గాని వాని నడుమనున్న ఆకాశమును మలినము చేయజాలదు గదా?
32.ఆత్మ అసంగమని వేదాంతులు చెప్పదురు. ఉణ్యపాపములు గాని సుఖ దుఃఖములుగాని ఆత్మనంటజాలవు; కాని దేహాభిమానుల నవి బాధించును. పొగ గోడలను మలినము చేయగలదు గాని ఆకావము నేమి జేయజాలదు కదా!
33.సత్త్వరజస్తమోగుణముల న్యూనతాధిక్యములను బట్టి మానవులు వేర్వేరు స్వభావములు గలవారై యుందురు.
34.వస్తుతః జీవులందరును ఒక్కటియేయయ్యును. వారి వారి స్థితిగుతలను బట్టి నాలుగు విధములుగా నుందురు. 1.బద్ధజీవులు అనగా సంసారబద్ధులు 2.ముముక్షువులు మోక్షమునకై ప్రయత్నించువారు 3.ముక్తులు 4.నిత్యముక్తులు.
35.పల్లెవాడు నీటిలో వల వేయగా వలలో చాలా చేపలు పడినవి. అందు కొన్ని బయటపడుట ప్రయత్నము చేయక స్తబ్ధముగా పడియున్నవి. కొన్ని చేపలు గంతులు వేసి తప్పించుకొనలేకపోయినవి. కాని కొన్ని ఎట్లో తప్పించుకొని బయటపడినవి. ఇదేవిధముగా లోకమందును జనులు మువ్విధములుగా నున్నారు.
ఇంకావుంది...
శ్రీరామకృష్ణ బోధామృతము - పరిశోధితమగు 1121 మహోపదేశములు గల శ్రీరామకృష్ణ వాక్య రత్నాకరము -సంగ్రహ జీవిత సహితము - అనువాదకుడు: శ్రీ చిరంతనానందస్వామి