Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాని చదువు, లలిత కళాలాభిలాష కూడా కేవల తన భౌతికాభివృద్ధికి మాత్రమే ఉపయోగించేటట్లుంటుంది. ఎవడినో సాధించాలనే ఈర్ష్యాద్వేషాలతో చదువుతాడు. వీడు రాక్షస పండితుడే తప్ప సాత్విక పండితుడు కాడు. వీని చదువువలన దేశానికి జాతికి ముప్పే తప్ప ఇంపుండదు.
అందుకని- ఈ చదువులు ఈ కళాభిరతి స్వామిని ఆకర్షించటంలేదు. ముందుకు నడుస్తున్నాడు.
ఆవేళ శుద్ధ త్రయోదశి.
చంద్రుడు గిరి వృక్షాలపైకి వచ్చేడు.
చంద్రికలు నేలనావరించుకొంటున్నాయి.
ఇది సుందరకాండలోని అయిదవ సర్గ. వాల్మీకి మహర్షి ఎనిమిది శ్లోకాలలో చంద్రికా వర్ణన చేస్తారు.
ఎనిమిది శ్లోకాలుగా వ్రాయటంలో ఐదవ సర్గగా విభజించటంలో అన్నిటిలో ప్రాముఖ్యముంది.
అయితే ఏమిటి వెనె్నల! ఆ తల్లి అనుగ్రహరూపకాంతి.
తనకైవెదకుతూ వచ్చిన వానికి దారి చూపించటం ఆమె అనుగ్రహం. ‘‘పంచ సంఖ్య పరాయణ’’ అయిన ఆ తల్లి ‘్భగ్యాబ్ది చంద్రిక’ ఎవరిదీ భాగ్యం?
అనే్వషణ ఫలరూపమైన స్వామి భాగ్యం. విష్ణుసాన్నిధ్య ప్రాప్త రూపమైన రావణుని భాగ్యం. రెండింటికీ కారణం ఆమెయే. అందుకే ఐదవ సర్గలో చంద్రికలు విరుస్తున్నాయి. ఆ తల్లి ‘అష్టమీ చంద్ర విభ్రాజదళికస్థలశోభిత’ అనుదుటి కాంతి- ఈ ఎనిమిది శ్లోకాల వెనె్నల.
ఈ చంద్రికా వర్ణన కవులకు కల్పవృక్షచ్ఛాయ. కవులంటే-్భవులకు తాత్త్వికులు, తాత్త్వికులయిన భావులయితే ఋషులు. వారి వాక్కు పరమతత్త్వాన్ని చెబుతుంది. ఆ ఆనందం ముందు శబ్దాలంకారాల ఆనందం గొప్పది కాదు. సుందరకాండలో ఎవరిస్థాయి ఆనందం వారికుంది.
తతస్సమధ్యం గత మంశుమంతం
జ్యోత్స్నా వితానం మహదుద్వమంతం
దదర్శ ధీమాన్ దివి భానుమంతం
గోష్ఠే వృషం మత్తమివ భ్రమంతమ్
వెనె్నలల్ని కక్కుతూ ఆకాశంలో సంచరిస్తున్న చంద్రుడు గోశాలలో వృషభంలా ఉన్నాడట.
ఆంజనేయస్వామి తొలిసారిగా నిద్రారావణ స్వరూపాన్ని చూసి కూడా ఇలాగే అనుకొంటాడు. హారకాంతులతో నిద్రావస్థలో ఉన్న స్ర్తిల మధ్య నిద్రపోతూన్న రావణుడు స్వామికి ఇలాగే కనపడ్డాడు. ఈ ఉపమానానికి అన్వయం అంతవరకూ ఉంది. ఈ చుక్కల్లో చంద్రుడు కాముకుడైన రావణునియందూ అన్వయిస్తాడు.
మరొకమాట-
గోష్ఠం అంటే వాఙ్మయాధారమైన నోరు. దానియందు తిరుగుతూన్న వృషం అందే వేదవాక్కు. అలా చంద్రుడున్నాడు. గోశాలలో సంచరించిందే వేదవాక్కు అంటే లలితా రూపమే. అందుకే ఆ తల్లికి గోమాత, వేదజనని అని పేర్లు.
కనుకనే మహర్షి తరువాత శ్లోకాన్ని
లోకస్య పాపాని వినాశయంతం
మహోదధిం చాపి సమేధయంతం
భూతాని సర్వాణి విరాజయం
దదర్శ శీతాం సమధాభియాంతం- అని ప్రారంభిస్తారు.
పాపానికి చీకటనే అర్థం లేదు. దోషానికి చీకటితో బాటు పాపమనే అర్థం కూడా ఉంది. కాని మహర్షి స్పష్టంగా ఇక్కడొకమాట చెప్పదలచుకొన్నారు. ఏమిటది? అంటే-
చంద్రుడు లోకం యొక్క పాపాల్ని పోగొడుతున్నాడు. కాని లోకం యొక్క పాపాల్ని పోగొట్టే సామర్థ్యం ఈ భౌతిక చంద్రునకు లేదు. పరాశక్తి అనుగ్రహరూపమైన చంద్రికకు మాత్రమే వుంది. సర్వభూతముల అజ్ఞాన రూప అంధకారాన్ని పోగొట్టి ప్రకాశింపజేసేది ఆ తల్లి మాత్రమే. అందుకే ఆమెను- సర్వ భూత తమో పహారిణీ అని సేవిస్తాం.
ఇంకావుంది...

- కాశీభొట్ల సత్యనారాయణ