Others

శ్రీకాళహస్తీశ్వరా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా
జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా
పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!
భావం:ఈశ్వరా! నీకు మాంసాహారముపై కోరిక కలిగినచో, నీ చేతిలో లేడి ఉంది. గండ్రగొడ్డలి ఉన్నది. నీ మూడవ కంటిలో నిప్పున్నది. తలమీద నీరున్నది. కొంచెము శ్రమపడి వంట చేసుకుని శుచిగా రుచిగా తినలేకపోయావా? ఆ తిన్నడు ఎంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చినదా? నీవంటివాడు ఇట్లు చేయవచ్చునా?

రాజైదుష్కృతిఁ చెందెఁ చందురుడు, రారాజై కుబేరుండు దృ
గ్రాజీవంబునఁ గాంచె దుఃఖము; కురుక్ష్మాపాలుఁ డామాటనే
యాజిం గూలె సమస్త బంధువులతో; నా రాజ శబ్దంబు ఛీ!
ఛీ! జన్మాంతరమందు నొల్లనుజుమీ! శ్రీకాళహస్తీశ్వరా!
భావం:చంద్రుడు తాను రాజై గురుపత్నిని అపహరించి పాపమును మూటగట్టుకొనెను. కుబేరుడు పిశాచముల వంటి యక్షులకు రాజై దుఃఖము పొందెను. దుర్యోధనుడు కూడా పాండవులను సమూలముగా నాశనము చేసి రారాజు కావలెనన్న ఆశతో యుద్ధమునకు దిగి సమస్త బంధు మిత్రులతో నాశనమయ్యెను. ఈ రాజశబ్దములో ఇంత దోషమున్నది. కాబట్టి మరొక జన్మలో కూడా రాజు కావలెను అని కోరను. నీ దయారస వీక్షమున్నచో చాలు!

రాజర్ధాతురుడైనచో నెచట ధర్మంబుండు? నేరీతి నా
నా జాతి క్రియ లేర్పడున్? సుఖము మాన్యశ్రేణి కెట్లబ్బు? రూ
పాజీవాళికి నేది దిక్కు? ధృతి నీ భక్తుల్ భవత్పాద నీ
రేజంబుల్ భజియంతురే తెరగునన్? శ్రీకాళహస్తీశ్వరా!
భావం:పరిపాలకుడైన రాజు ధనమునందు ఆశ కలిగి పరిపాలన సరిగా చేయకపోతే రాజ్యములో ధర్మము ఎక్కడ ఉంటుంది? వర్ణాశ్రమ ధర్మములు ఎలా సక్రమంగా నడుస్తాయి? మంచివారికి సుఖం ఎలా కలుగుతుంది? వేశ్యలు మొదలైన వివిధ వృత్తులవారికి జీవనం ఎలా గడుస్తుంది? నీ భక్తులు స్వేచ్ఛగా నినె్నలా సేవింపగలుగుతారు?

తరగల్, పిప్పల పత్రముల్ మెఱగుటద్దంబుల్ మరుద్దీపముల్
కరికర్ణాంతము లెండమావుల తతుల్ ఖద్యోత కీటప్రభల్
సురవీధి లిఖితాక్షరంబు లసువుల్ జ్యోత్స్నా పయః పిండముల్
సిరులందేల మదాంధు లౌదురో జనుల్ శ్రీకాళహస్తీశ్వరా!
భావం: శంకరా! సంపదలు, నీటి కెరటాలలాగా, రావి ఆకులలాగా, మెరపుటద్దాలలాగా, గాలిలోని దీపాలలాగా, ఏనుగు చెవులులాగా, ఎండమావులలాగా, మిణుగురు పురుగులులాగా, ఆకాశంలోని అక్షరాలలాగా, జీవులలోని ప్రాణాలలాగా, వెనె్నల ముద్దలలాగా చాలా చంచలములు, అశాశ్వతములు కదా! మనుషులు అటువంటి సంపదలతో గర్వించి తిరుగుతారేమి?

హితవాక్యం

దుర్జన వదన వినిర్గత వచన భుజంగేవ సజ్జనో దష్టః
ఔషధశతైః అసాధ్యః చికిత్స్యతే క్షాంతిమంత్రేణ!!
అది రాజకవియైన సుందరపాండ్యుని రమ్యోక్తి. క్రీ.శ. 6వ శతాబ్దికి పూర్వుడైన సుందరపాండ్యుడు మధురా నగరాధీశుడు. వివిధ శాస్తన్రిష్ణాతుడు. బహుగ్రంథ నిర్మాత. ఆయన గ్రంథాలలో ప్రసిద్ధ్భమైన ‘నీతి ద్విషష్టికా’ జీవన మూల్యాన్ని వివరించే మధురవాక్యాల మంజూషిక. అందులోని ఒక మణి యిది.
‘‘దుష్టుని నోటినుండి వెలువడు దుర్వచనాల విషసర్పాలకు సజ్జనుడు బలిఔతున్నాడు. ఆ పాము కాటుకు మందులేవీ లేవు. కాని సహనమే సరియైన మంత్రం. అదే తిరుగులేని చికిత్స’’. నిజమే... ‘‘లోకమా! భుజంగానీక వల్మీకమా!’’’ అని ఒక కవి అన్నట్లు విష సర్పాలవలె దుష్టులెప్పుడూ బుసకొడుతూ సజ్జనుల మానస సరోవరాలలో విషం క్రక్కి కలుషితం చెయ్యలని ప్రయత్నిస్తూనే ఉంటారు. కాని సజ్జనుని సహనం దివ్యౌషధంలాగా పనిచేస్తుంది. అంతటి కృష్ణుడు కూడా శిశుపాలుని ఆగడాలను సహించి సహించి తుదముట్టించాడు. ఓర్పు సాత్త్వికతకు సంకేతం. అది సామర్థ్యానికి నెచ్చెలి.
‘‘ఓర్పు నేర్పుకు నెయ్యం’’.

-వ్యాఖ్యాత: డి.ఎన్.దీక్షిత్