Others

కథానాయకుడు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ దర్శకుడు కె.హేమంబరధరరావు స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో నిర్మించిన చక్కని ప్రభోధాత్మక రాజకీయ చైతన్య చిత్రం -కథానాయకుడు. ఎన్టీఆర్, జయలలిత హీరో హీరోయన్లు. తొమ్మిది కేంద్రాల్లో ఘన విజయం సాధించిన చిత్రమిది. సంఘంలో పెద్దమనుషులుగా వ్యవహరించే ముగ్గురి వ్యక్తుల అవినీతి జీవితాల్ని బట్టబయలుచేసే సామాన్య మధ్యతరగతి యువకుడి సాహస కథ. వాహినీవారి ‘పెద్దమనుషులు’ స్ఫూర్తితో ఆ కథాంశానే్న మార్పులుచేసి నిర్మించారు.
చిత్రంలో పెద్దమనుషులు ముగ్గురిగా నాగభూషణం, మిక్కిలినేని, అల్లు రామలింగయ్యలు సమర్ధవంతంగా నటించారు. ఇక ‘కథానాయకుడు’ సారథిగా ఎన్.టి.ఆర్, జోడిగా జయలలిత జామపండ్లు అమ్మే సామాన్య పేదరాలి యువతిగా నటించారు. ఆమె అన్నగా ప్రభాకర్‌రెడ్డి, ఎన్టీఆర్ అన్నగా ధూళిపాళ, నాగయ్య, పద్మనాభం, రాజబాబు, కాకరాల, రావికొండలరావు, రమాప్రభ, రాధాకుమారి, సంధ్యారాణి తదితరులు పాత్రోచితంగా నటించారు. టీవీ రాజు సంగీత సారథ్యంలో పాటలన్నీ (మచ్చుకు -కొసరాజు రాసిన ‘వినవయ్యా రామయ్యా ఏమయ్య భీమయ్యా’ దాశరథి ఇచ్చిన ‘ఇంతేనయా తెలుసుకోవయా ఈలోకం ఇంతేనయా) ప్రజాదరణ పొందాయి. చిత్రమంతా చురుకైన కథనం, చక్కని సన్నివేశాలతో సాగుతూ, ముగ్గురి విలన్లు నాగభూషణం, అల్లు, మిక్కిలినేనిల మధ్య కామెడీ సంభాషణలతో, యింకా రాజబాబు, పద్మనాభం, రమాప్రభ వారి కుటుంబాలమధ్య వచ్చే కామెడీ సన్నివేశాలతో విసుగులేకుండా సాగుతుంది. అందరి మెప్పుపొంది చిత్రం ఆర్థిక విజయం కూడా సాధించింది. ఎన్.టి.ఆర్., జయలలితల జంట చిత్రమంతా అలరిస్తుంది. వారు బాగా ప్రజాదరణ పొంది దాదాపు పది చిత్రాలపైగా నటించారు. ఈ చిత్రంలో వీరికి ‘డ్యూయెట్ సాంగ్’ లేకపోయినా ఈ జంట చక్కని అభినయం ప్రదర్శించారు. ‘కథానాయకుడు’ టైటిల్ ఎంతో ఆదరణ పొందింది. ఈ టైటిల్‌తోనే ఎన్.టి.ఆర్ తనయుడు బాలకృష్ణ నటించిన చిత్రం విజయవంతమైనది. రజనీకాంత్ ద్విభాషా చిత్రం ఒకటి ‘కథానాయకుడు’ పేరుతోనే చిత్రం వచ్చి ఏవరేజ్‌గా నిలిచింది. ప్రస్తుతం ఎన్.టి.ఆర్ జీవిత చరిత్రను బయోపిక్‌గా మొదటి భాగంగా ‘కథానాయకుడు’ పేరుతో జనవరిలో రిలీజయ్యే విధంగా నిర్మాణం చేస్తున్నారు. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈతరం ప్రేక్షకులూ ఈ చిత్రం ఎప్పుడైనా టీ.విలో వస్తుంటే, ఎక్కడైనా ఆడుతుంటే చూడండి.

-శివప్రసాదరావు, అద్దంకి