Others

కృష్ణం వందే జగద్గురుం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిరాకారుడు, నిరంజనుడు, నిర్మలుడు, నిస్సంగుడు ద్వాపరయుగంలో దేవకీ వసుదేవులకు సుతుడై పుట్టి యశోదానందనుడై -పుట్టీ పుట్టక ముందు నుంచే ఎన్నో మహిమలను లీలా విశేషాలను చూపుతూ ఉన్న లీలామానుష వేషధారి అఖిలాండ కోటికి సద్గురువు శ్రీకృష్ణుడు.
చావు పుట్టుకలు లేనివాడు ఎక్కడ అధర్మం పెచ్చుమీరితే అక్కడ తనకుతానే సృజించుకుని ఆవిర్భిస్తానని చెదరిన ధర్మాన్ని పునఃస్థాపిస్తానని స్వయంగా గీతలో చెప్పాడు. పుట్టగానే విశ్వరూపాన్ని చూపి తనను నంద నందునిగా చేయమని వసుదేవుణ్ణి ప్రోత్సహిం చాడు. పీకలలోతు వరకు ప్రవహించే యము నమ్మ ఆ వెన్నదొంగకు దారి ఏర్పాటు చేసింది. ఇక అప్పటినుంచి - మన్ను తిన్నావని దండించిన యశోదమ్మకు తన నోటనే 14 భువనాలు చూపించాడు. భక్తరక్షణకు తాను ఎల్లవేళలా సంసిద్ధమని చెప్పి, ఆయుధం పట్టనని భీష్మించీ రథ చక్రం ఎత్తి భీష్ముని పైకి వెళ్లడం, దోగాడే టపుడే శకటాసురాది రాక్షసులను మధించడం స్తన్యపానంచేసే వయస్సులోనే పూతనాదులను సంహారం చేయడం, పశువుల కాపరిగా వెళ్లి అటు సంగడీలతో చద్దులారగిస్తూ ఇటు బ్రహ్మాది దేవుళ్లకు కృష్ణతత్వం ఎరుక పర్చడం, కోతులకు వెన్నపెడుతూ నాకన్నా వేల్పులెవరే అమ్మాఅంటూ యశోదమ్మలో విచక్షణను మేల్కొపి, అటువెళ్లి మద్దిచెట్లకు శాప విమోచనం కలిగించడం, మధురభక్తి రుచి చూపించి అహంకారాదులు లేని గోపికల మధురభక్తిని లోకానికి వెల్లడిం చడం ఇలా ఒకటా రెండా ప్రతిదీ లోకోత్తరంగా చేస్తూ వచ్చిన దేవాదిదేవుడు శ్రీకృష్ణుడు. సదా నేను, నాది, అన్న సంకల్పాలను వీడి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలుచేయండి. మీ యోగక్షేమాలను నేనే చూస్తానని చెప్పిన వాసుదేవుణ్ణి నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ అనక ఏమంటాం? ‘‘ఉద్ధరే దాత్మనాత్మానమ్’’ ఎవరినైనా ఉద్దరించేది వారి వారి మనసు మాత్రమే. మలినమైన మనస్సు పతనం వైపుకు దారిచూపితే కృష్ణ నామంతో పులకించే మనస్సు శ్రీకృష్ణ మందిరానికి దారినేర్పరుస్తుంది. కనుక విడువక జపించిమంటారు కృష్ణనామాన్ని. శ్రీకృష్ణ ధ్యానాన్ని మించిన మహామంత్రం, శ్రీకృష్ణ స్మరణను మించి మహా యజ్ఞము, శ్రీకృష్ణోపసానను మించిన యోగఫలం, శ్రీకృష్ణ నామాన్ని మించిన మహా తపమూ, శ్రీకృష్ణ గురువుకు మించిన మహా గురువు ఎవరూ లేరనే పెద్దల మాట మనకు శిరోధార్యమే కదా. మహా జ్ఞాని, యోగీశ్వరుడు, రాజనీతిజ్ఞుడు. ఆదర్శ పురుషుడు అమానుషశక్తి సంపన్నుడు అయన కృష్ణునకు మనం చేయగలిగింది నమస్కారమే కదా.

- సత్య ప్రసాద్