Others

సంబురం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషికి సంబురం కావాలి
ఏదో ఒకటి ఎప్పుడూ ఒకటి
అందరూ కలవాలని
అందరితో కూడాలని

రంగురంగుల కలల్ని
సాకారం చేసుకోవాలని
సప్తవర్ణాల ఇంద్రధనుస్సు
ఆకాశమంత పరుచుకున్నట్టు
తన జీవితం నిండా
జీవం ఉట్టిపడాలని
లోలోన మనిషి కోరిక

పురివిప్పిన నెమలి అందానికి
ఎన్ని ఈకలు ఒకటిగా ఉంటాయో
మనిషికి మనిషి ఊతమిస్తే
సంబరం అంబరాన్నంటుతుంది
మేఘం ఆకాశాన్ని చుంబించినట్టు

పండుగైనా కొత్త ఏడాదైనా
పెళ్ళైనా పేరంటమైనా
ఒక్కడూ ఏమి చేసుకోగలడు
తన సహచరులు లేని
సంతోషం నిరర్థకం నిస్సారం

అందుకే తన ఆలోచన వివేచన
అందరితో కలవమంటుంది
తనమీద తనకెంత నమ్మకమున్నా
మనిషికి సంఘమే బలం
అది ప్రకృతి తనకిచ్చిన వరం
నూతన సంవత్సరమూ అంతే
పదిమందితో పంచుకుంటేనే ఆనందం
- జంధ్యాల రఘుబాబు, 9849753298
బాగుండు

చేతివృత్తులు
అంపశయ్యను దాటి
గ్రామాల్లో
పరిఢవిల్లితే బాగుండు

మంగలి కత్తెర
వంకర బుద్ధులను కత్తిరించి
‘క్రాఫు’ చేస్తే బాగుండు!
కమ్మరి కొలిమి
స్వార్థపు మలినాలను
కరిగించేస్తే బాగుండు!

కుమ్మరి
మట్టిలో
కుళ్లు నిండిన మెదళ్లను
కలిపి తొక్కేస్తే బాగుండు!

చాకలి రేవు
ఆకతాయ ‘మరకలను’
ఉతికి ఆరేస్తే బాగుండు!

నేత మగ్గం
కీచకుల నరాలను
పడుగు పేకలు పేర్చి
తివాచీ నేస్తే బాగుండు!
వడ్డెర సుత్తి
మనిషికున్న ‘అహం’ రాళ్లను
తునకలు చేస్తే బాగుండు!
ఎరుకలి తట్ట
అవినీతి అన్యాయాల పెంటను
ఎత్తి పడేస్తే బాగుండు!

వడ్రంగి
పెద్ద బాడిశ
మృగాళ్ల కీచక బుద్ధిని
కసిగా చెక్కేస్తే బాగుండు!
గంగపుత్రుల వల
లంచావతారపు కలుపులను
కట్టి పడేస్తే బాగుండు!

మేదరి తడకలు
మానవత్వాన్ని అల్లుకుని
జగతికి నీడనిస్తే బాగుండు!

కంసాలి కుంపటి
విలువలను మూసపోసి
మనిషికి మెరుగులద్దితే బాగుండు!
జాతికొక్క నీతి
నీతి తప్పిన మానవ జాతికి
వైద్యం చేస్తే బాగుండు!
- పుచ్చ కుమారస్వామి

ఎలా?!
ఏమనగలను
ముప్ఫై ఏళ్లకు పైగా వసంతాలు కళ్లజూసిన
పదాల కొలనులో విరిసిన వెనె్నల కలువను
నిత్యం లావాదేవీల వాకిట్లో నిలబడి
తనలోకి తొంగి చూసుకుంటూ
కవిత్వపు పియానో మెట్లు
ఎక్కుతూ దిగుతూ
ఆడుకునే ముద్దమందారాన్ని
ఎలా తూలనాడగలను
పొద్దునే్న
ఒక ఉషోదయపు కిరణాన్ని దోసిట్లో ఒంపి
కువకువలాడే పావురాన్ని
అసలు ఏమనగలను
అక్షర నక్షత్రాలతో
ఆకాశపు చెట్టుకు పూసే చందమామను
ఎలా నేలపై పడేయగలను
మరో పసిమొగ్గకై
ఆశగా నిరీక్షించే లేలేత పూలమొక్కపై
వాడైన ముళ్లనెలా రువ్వగలను
నేనిచ్చిన తెలుపు వర్ణాన్ని తొడుక్కుని
కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించే
వెలుగు రవ్వల కొవ్వొత్తిని
ఎలా కరిగించి ముద్ద చేయగలను
ఇవన్నీ చేయగలిగే
గడ్డకట్టిన మనసుంటే
నేనెలా కాగితంపై నదిలా ప్రవహించగలను
- పద్మావతి రాంభక్త, 9966307777

అంతర్గత
చీకటిలో కాలం కనిపిస్తుందా?
వెల్తురులో కూడా అంతే.
ఈ పాట కాలాన్ని
పాడుతున్నట్టు కాదా.
ఈ వేళ్లు
క్షణాలను మీటుతున్నాయేమో
గమనించాలి.
లయ తప్పినప్పుడల్లా
కాలం గాయపడుతుంది.

ప్రవాహానిదీ అదే పద్ధతి
సముద్రం దిశగా
దూరాన్ని లెక్కలు కడుతుంది.
విమానం
కిందికి దిగేటప్పుడు
ఊపిరి బిగపడుతుంది.
విడుదలయ్యే కాలం
విస్మయానికి లోనవుతుంది.

గడియారంలో నలిగే కాలం
ధ్వని శకలాలుగా వర్షిస్తుంది.
గుండె ఆగినప్పుడు మాత్రం
కాలం కాస్సేపు స్తంభిస్తుంది
పుట్టి ఇనే్నళ్లయ్యంది
కాలం అర్థం కాక
జ్ఞానం సిగ్గుపడుతుంది.

కాగితాన్ని డొప్పలా పట్టుకుని
కాలాన్ని ఆవాహన చేద్దాం
రాలిపడుతున్న అక్షరాలను
బహుశా కాలాన్ని
శాశ్వతం చేస్తాయేమో!
- డా. ఎన్. గోపి