Others

కచ్చితత్వం లేని కొలమానం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిపూర్ణం
ఒక వైద్యుడే కావచ్చు గాక!
రోగుల పట్ల అతడి హృదయస్పందనలు
మంచివేనా అంటే
ఎలా చెప్పగలం?

ఒక ఉపాధ్యాయుడే
కావచ్చుగాక!
పిల్లల భవితల్ని కాంక్షించే
నిత్యస్వాప్నికుడు
అతనిలో ఉన్నాడా అంటే
ఎలా చెప్పగలం?

ఒక కొలువుచేసే
అధికారే కావచ్చుగాక!
ఆ కొలువులోని నీతి
అతనిలో కొలువై
ఉందా అంటే
ఎలా చెప్పగలం ?

ఒక రాజకీయవేత్తే కావచ్చు
అతడి రాజనీతిలో
ప్రజాహితం ఉందా అంటే
ఎలా చెప్పగలం?

నిజాయితీ అనేది
మనసును బట్టి ఉంటుంది
మనసును బట్టి
మంచే కాదు చెడూ ఉంటుంది

అది ఎన్నడూ
తన పరిపూర్ణప్రాతినిధ్యాన్ని
ఏ ఒక్కదానికో
పరిమితం చేయలేదు

మంచిచెడుల మధ్య
కొట్టుమిట్టాడే మనిషి
పరిపూర్ణుడు ఎన్నటికీ కాలేడు!
ఇది ముమ్మాటికీ నిజమే!

వ్యవస్థీకృతమైన ధర్మాలను
పంచభూతాలు
సుస్థిరం చేసుకొన్నాయి

పంచభూతాత్మకమైన
మనిషి మాత్రం
స్వధర్మాన్ని విడిచి
మానవతకు దూరంగా
మిగిలిపోతున్నాడు

సుస్థిరమైన మానవత్వానికి
ప్రతీకగా
నిలువలేక పోతున్నాడు

అందుకే మనిషి
అర్థం గోచరించని ఒక పదం
స్పష్టత లేని ఒక వాక్యం

సంశయాత్మకమైన ఓ స్వాభావికం
కచ్చితత్వం లేని ఓ కొలమానం!

పల్లెకు పోదాం!

అక్కడ
ఆత్మీయతకు ఆవాసం
అనుబంధాలకు ఆలవాలం
మనస్సుల్లో మమకారం
మాటల్లో మాధుర్యం
చేతల్లో సహకారం
నిలకడైన జీవనానికి
నిండైన భాష్యం
నెమ్మదైన జీవితానికి
మెండైన అర్థం

అక్కడిగాలిలోని స్వచ్ఛత
మనసుకు పాకుతుంది
మట్టిలోని మమకారం
మానవత్వాన్ని నేర్పిస్తుంది
నీటిలోని మాధుర్యం
మాటలో ప్రతిఫలిస్తుంది
అందుకే పద పోదాం పల్లెకు
శాంతికి నెలవుగా
మమతకు కొలువుగా
అలరారే పల్లెకు పోదాం!

- కె. రవీంద్రబాబు, 9052778988