Others

ఆత్మజ్ఞాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధ్యాత్మికత పొడచూపిన వేళ!
ఆత్మానందానికై అనే్వషణ!
తీర్థాలు మునిగాను, క్షేత్రాలు దర్శించాను
ప్రవచనాలు ఆలకించాను, పురాణ గ్రంథాలు శోధించాను
ఆచార్యులను సంప్రదించాను , అలసినాను, సొలసినాను
కడలి నడుమ చుక్కాని చెదరిన
నావ వోలె నిలిచినాను !!

ఆత్మ విశ్వాసం తోడైన వేళ
నిశ్శబ్దమే నిర్గుణ పరబ్రహ్మ, వౌనమే సమాధానం
తపస్సే పరమావధి, జ్ఞాన దీపమే కరదీపిక!!
నాలోన నేను ప్రశ్నించుకున్నాను
ఆత్మ విమర్శ చేసుకొన్నాను
ఆంతా నాలోనే ఉందని గ్రహించాను
సత్యశోధనే లక్ష్యసాధన చేశాను
మాయా ప్రపంచాన్ని గెలిచాను !!
జ్యోతిస్వరూపునిపై ధ్యాస నిలిపాను
యోగ సమాధిలో రోజులు గడిపాను
దివ్యానుభూతితో పరవశించాను
ఆత్మానందంతో విహరించాను
ఆధ్యాత్మికత పరమళించిన వేళ
ఆత్మజ్ఞానినై నిలిచాను!!

- జి. కామేశ్వరి 9908244681