Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆ స్ఫోటయామాస చుచుంబపుచ్ఛం
ననంద చిక్రీడ జగౌజగామ
స్తంభనరోహన్నిపపాత భూవౌ
నిదర్శయన్ స్వాం ప్రకృతింకపీనాం.- అంటారు మహర్షి
మా సీత ఇక్కడుండి ఈ స్ర్తిలతోబాటు ఇటువంటి సుఖాన్ని అనుభవిస్తూ ఉంటే ఈ రావణుడెంత అదృష్టవంతుడు- అనుకొనునప్పటి నుండి ఇంతవరకు స్వామి భ్రాంత చిత్తుడే. అందుకే వెంటనే -
తోకను నేలకు వేసికొట్టేడు. ముద్దు పెట్టుకొన్నాడు. ఆనందంతో గంతులు వేసేడు. స్తంభాల్ని ఎక్కేడు. దిగేడు. ఇలా తన కపిప్రకృతికి తగిన పనులన్నీ చేసేడు.
మిధ్య యందు సత్య భ్రాంతిని పొందినవాడు తాత్కాలికంగా తన గురించి తాను పైకి వెళ్ళినట్లు ఊహించుకొన్నా వాడు మళ్ళీ భూమిమీదే పడతాడు. ఇదీ -
స్వామి స్తంభానె్నక్కి క్రిందపడి మనకు చెప్పిన విషయం. సాధన తక్కువ పొందే ఆనందం ఎక్కువ. దాన్ని ప్రకటించే విధానం మరీ ఎక్కువ. నిజంగా పరిణతిని పొందినవాడు ఈ అహంకార భ్రాంతిని పొందడు. ఈ ఆంజనేయస్వామే నిజంగా సీతను చూసినప్పుడు కంట తడిపెట్టుకొన్నాడు. సరే-
అవధూయచ తాం బుద్ధిం బభూవా‚వస్తిత స్తదా
జగామ చాపరాం చింతాం సీతాంప్రతి మహాకపిః
మిధ్య యందు సత్యత్వబుద్ధిలా మండోదరి యందు సీతా సంబంధ బుద్ధిని ఒక్కసారి విదిలించేడు. స్వస్థతను పొందేడు. ఇప్పుడు సీతానే్వషణను గురించి మళ్ళీ ఆలోచన చేసేడు.
ఒక్కసారి ధ్యేయమునుండి మనస్సు చెదరితే దాన్ని మళ్ళీ నిలబెట్టటం ఎంత కష్టం. భ్రాంతి ఎంత గొప్పది ధ్యేయముయొక్క స్థితిని గతిని తెలియనీకుండా చేస్తుంది. కాకుంటే- మండోదరీ స్థానంలో సీత అలా ఉంటుందని ఎలా అనుకొన్నాడు.
రామ వియోగంతో ఆమె నిద్రేపోదు. అన్నపానాదులుండవు. అలంకరణలుండవు. రాముడు కాని మరొకడు ఇంద్రుడైనా ఆ తల్లి అంగీకరించదు. రామునితో సమానుడు ఈ మూడు లోకాల్లోను మరొకడుంటే కదా! ఈ నిజం భ్రాంతినుండి బయటపడిన తరువాత తెలుస్తుంది. కనుక-అనే్యయమితి నిశ్చిత్య పాన భూవౌచచారసః మరొకచోట వెదుకుతాను అని బయలుదేరేడు. ఆ స్ర్తిలను దాటుకొంటూ ముందుకు నడుస్తున్నాడు. రావణుణ్ణి దాటి ముందుకు వస్తున్నాడు. మళ్ళీ వాల్మీకి మహర్షి
గోష్ఠే మహతి ముఖ్యానాం గవాం మధ్యేయధావృష :- అంటారు. ప్రారంభంలో చంద్రికావర్ణనుచేస్తూ చంద్రుణ్ణి చూసి ఈమాట అన్నారు. మళ్ళీ ఇప్పుడన్నారు. అంటే ఇంతవరకూ ఆ ఉపమానం అన్వయిస్తూనే ఉంది. రావణ జీవితాన్ని చూపెడుతూనే ఉంది. సరే -
ముందుకు నడిచేడు. రావణ పాన భూమిలో ప్రవేశించాడు. ఇంతకు ముందొకసారి స్వామిని ఈ భూమి పిలిచింది. ఆయన తప్పుకున్నాడు. కాని ఇప్పుడు అక్కడ కూడా అనే్వషింపవలసిన స్థితి. నిజానికి రావణ తామస ప్రకృతికి ప్రతీకారూపం. అనే్వషిస్తున్నాడు.
మృగాణాం మహిషాణాంచ వరాహాణాంచ భాగశః
తత్రన్యస్తాని మాంసాని పాన భౌవౌ దదర్శనః
రౌక్మేషుచ విశాలేషు భాజనే ష్వర్థ భక్షితాన్
దదర్శ హరి శార్దూలో మయూరాన్ కుక్కుంటాంస్త్ధా.
వరాహ వార్ర్ధాణ సకాన్ దధి సౌవర్చాలా యుతాన్
శల్యాన్ మృగమరుూరాంశ్చ హనుమాన్ అన్వవైక్షత.
-ఇంకావుంది