Others

సుందరకాండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లేళ్ళ మాంసం అడవి పందుల మాంసాలు అక్కడుంచబడ్డాయి. నెమళ్ళు కోళ్ళు వీటి మాంసాలు ఆ వెండి గినె్నల్లో సగం సగం తినగా మిగిలినవి. అలాగే అడవి పంది మాంసాన్ని, వార్ర్ధాణసక మాంసాన్ని రుచికమనే లవణంలో కలిపి పెరుగుతో వండుతారట. అదిగో ఆ వంటలు- అలాగే మృగమయూరాల్ని తినేసేరు. ఎంతవరకు శల్యావశిష్టంగా. అవిగో-వాటి స్వరూపాల్ని - ఇలా స్వామి చూస్తూ నడుస్తున్నాడు.
లేహ్యానుచ్చావచాన్ పేయాన్ భోజ్యాని వివిధానిచ
తథా‚మ్ల లవణోత్తం సై ర్వివిధై రాగ షాడబైః
అనేక రకాల లేహ్యములు భక్ష్యములు పానీయాలు భోజ్యాలు.
ఆమ్ల లవణ సంయుక్తాలయిన రాగ షాడబాలు.
తెల్లకల్లు, ద్రాక్ష, దాడిమ మొదలైన రసాలతో తెల్ల ఆవాల వంటి ఇతర సామగ్రులతో కలిపి చేసిన రసాయనం.
ఇది చిక్కగా ఉంటే షాడబం (క్రీమ్) పల్చగా ఉంటే రాగం. (జూస్) త్రాగుడుచే ఒడలు తెలియక వెదజల్లిన పండ్లు. పూలు, వాటి సౌరభాలు ఈ పాన భూమిలో దీపాలు లేవు. మరెలా కనిపిస్తుంది. తినే వాళ్ళెలా- తిన్నారు. స్వామెలా చూస్తున్నాడు.
తత్ర తత్ర చ విన్య సె్తై స్సుశ్లిష్టైశ్శయనాసనైః
పాన భూవిర్వినా వహ్నిం ప్రదీప్తే నోపలక్ష్యతే.
ఆ ఆసనాల ప్రకాశ ఉంది. ఎవరి ఆసనం వారికెదురుగా ఉన్న భక్ష్యవేదికను చూపిస్తుంది. అంతే. అంత మాత్రంచేతనే దీపం లేకుండానే దీపిస్తున్నాయి. ఇక కేవల పానవేదికల రంగం. అందులో ఉంచబడిన సుర, కృతుసర మాధ్వీకం శర్కరాసవం పుష్పాసవం ఫలాసవం వంటి రకరకాల ఆసవాలు. వాటితో నిండిన వెండి-బంగారు- స్ఫటిక పాత్రలు. ఆ పాత్రలలో
క్వచిదర్ధావ శేషాణి క్వచిత్పీతాని సర్వశః
క్వచిన్నైవ ప్రపీతాని పాపాని సదదర్శహ.
క్వచిద్భక్ష్యాంశ్చ వివిధాన్ క్వచిత్సానాని భాగశః
క్వచిదన్నావ శేషాణి పశ్యన్వై విచాచార హ.
కొన్నిచోట్ల సగం త్రాగిన పాత్రలు. కొన్నిచోట్ల ఖాళీగాఉన్న పాత్రలు కొన్నిచోట్ల నిండుగా ఉండిపోయిన పాత్రలు. అలాగే భక్ష్యాలు. ఇలా స్వామి చూసికొంటు వెడుతున్నాడు. ఇక్కడ మహర్షి ‘హ’ అన్నారు.
ఇదొక చిత్రం.
వీటినెందుకు చూడాలి. తాను చూడవలసినది సీతను కదా!
ఆ సీతకోసం స్ర్తిముఖాల్ని చూస్తూవస్తూన్న స్వామి ఆడది లేనిచోట ముందుకు వెళ్ళాలిగాని ఈ పరీక్ష ఎందుకు?
రావణ పాన భూమి- కేవలం అన్న మయకోశం. కేవల అన్నమయ కోశాన్ని నమ్ముకొన్నవాడు తామసుడు. అది సాత్వికుణ్ణి కూడా మోహింపచేస్తుంది. సామాన్యుడు రోజూ సారాదుకాణాన్ని చూసి ఏదో ఒకరోజున దానికి లొంగిపోయినట్లు. దీన్ని దాటాలి. స్వామి బుద్ధిమంతుడు. వీటన్నింటిని తిరస్కరించినవాడు అందుకనే ఆ భూమిలో ఆగిపోలేదు. చూస్తూ వెడుతున్నాడట.
ఈ చూడటం మనవంటి సామాన్యుల మనోవికారాల్ని చెప్పటంకోసం ఆ వెళ్ళటం జితేంద్రియుల లక్షణాన్ని తెలియజేయటంకోసం. సరే అలా తిని తాగి ఒళ్ళు తెలియక
కాచిచ్ఛ వస్త్ర మన్యస్యా స్వపంత్యాః పరిధాయచ
ఆహృత్యచా‚బలా స్సుప్తా నిద్రాబల పరాజితాః
అంటారు మహర్షి. చెప్పటంలో సంప్రదాయాన్ని సంస్కృతిని ఎలా తెలియజేస్తారో చూడండి.
ఇంకావుంది...