Others

కృష్ణనామం మోక్షకారకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుగధర్మాన్ని రక్షించుటకై శ్రీ మహావిష్ణువు కృష్ణపరమాత్మునిగా అవతరించాడు. మార్గశిరమాసమంతా కృష్ణనామస్మరణతో దేవాలయాలు మారుమ్రోగుతుంటాయ. కానీ ప్రతి క్షణమూ కృష్ణనామాన్ని స్మరించుకుంటూ కృష్ణుడు చేసిన, చూపిన, చెప్పిన విషయాలను అర్థం చేసుకొని ఆచరణలో పెడితే కృష్ణుడికి మనుష్యునికి తేడా ఉండదు. అందుకే నరనారాయణులుగా కృష్ణార్జనులు పుట్టారు. మనమూ కృష్ణునితో స్నేహం చేసి కృష్ణులుగా మారాలి.
కృష్ణుడు పుట్టినప్పటి నుంచి అద్భుతాలనే చూపిస్తున్నాడు. స్వామి ఏ పని చేసినా చెప్పినా అది అర్థం చేసుకొంటే జ్ఞానోదయం కలుగుతుంది. పరమాత్ముడు రాత్రివేళ గాఢాంధకారంలో కారాగారంలో ఉన్న దేవకీ వసుదేవులకు జన్మించాడు. శంఖచక్రగదా పద్మాలతో చతుర్భుజునిగా దర్శనమిచ్చాడు. వారు చేయవలసిన పనులను ఆదేశించాడు. వెనువెంటనే అపుడు జన్మించిన శిశువువలె అమ్మ ఒడిలో పడుకున్నాడు. ఆ పాపడిని తీసుకొని వసుదేవుడు తలపై ధరించి రేపల్లెకు వెళ్లాడు.
దారిలో యమునమ్మ కనిపించినా మైదానం లాంటి దారినిచ్చింది. ఆదిశేషుడు తన పడగ విప్పి బాలగోపాలునికి ఛత్రంగా మారాడు. కారాగారంలో కావలిగాండ్రు, తలుపులు తాళాలు అన్నింటికీ అన్నీ వేటికవి విడిపోయ మరీ వసుదేవునికి దారిచ్చాయ. ఇదంతా జరగడానికి కారణం మేమిటని ఆలోచిస్తే చిన్నినాడు యశోదమ్మ లాలి పోసి బువ్వపట్టి పడుకోడితే జోలపాటకు కరిగిపో యనట్టుగా నిద్రపోయాడు. ఆ చిన్నవాడే యశోదమ్మకు తన చిరుబొజ్జలో 14 భువనభోంతరాళాలను భద్ర పరిచాడు.
కృష్ణపరమాత్ముణ్ణి ఎవరు, ఎపుడు తలంపులో ఉంచుకుంటారో అంటే నిత్యం నామస్మరణ చేస్తారో, ఎవరైతే ఆయన ఉపదేశాలు ఆచరిస్తారో వసుదేవునికి అసంభవాలు సంభవాలుగా మారినట్టు భక్తజనులకు అసాధ్యమంటూ ఏమీ ఉండదు. ఎంతటి కష్టతరమైన పనులు కూడా ‘కృష్ణశబ్దం’లో సులభం చేసుకొంటారు. ఎప్పుడూ అధర్మమైన పనులు చేయకుండా, ఇతరులను నొప్పించకుండా ఉంటే చాలు కృష్ణపరమాత్మ ఎపుడు పిలిస్తే అపుడు పలుకుతాడు.
కృష్ణమాయను తెలుసుకోవడం అంత సులభం కాదు. స్వామిని అర్థం చేసుకోవాలం టే కృష్ణునిగా మారాలి. కుబ్జ కురూపి అయనా కూడా మనఃస్ఫూర్తిగా కృష్ణనామాన్ని స్మరించేది కనుకనే ఆ దేవుడు సౌందర్యరాశిని చేశాడా కుబ్జను. అక్రూరుడు శ్రీకృష్ణుని పరమాత్మగా అవగాహన చేసుకొన్నాడు. కనుక అక్రూరుడిని తన చెంత చేర్చుకున్నాడు.
దురభిమానంతో కృష్ణుడిని అవమానిం చిన దుర్యోదనాదులనంతా వారి వారి కర్మానుసారం వారు సంహరించబడేట్లుగా కృష్ణుడు రచన చేశాడు. సృష్టిస్థితిలయాదులకు కారణాకారుడు కృష్ణపరమాత్మనే. కనుక కృష్ణుని నామోచ్చారణ ఈ కలియుగంలో మేలు చేకూరుస్తుంది. కృష్ణ నామస్మరణ మోక్షసిద్ధికి మార్గం.

- కూచిబొట్ల వెంకటలక్ష్మి