Others

సహనం విలువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామెతలన్నీ అనుభవసారపు పాఠాలే. సామెతల్లోని విషయాలు ప్రతివారికి అనుభవంలోకి వచ్చేవే. పెద్దలంతా అనుభవంతోనో, లేక శ్రుతిస్మృతి వల్ల వచ్చిన జ్ఞానం పరంపరగా వచ్చినవి ఆచారాలు, సంప్రదాయాల పేరిట కట్టుబాట్ల పేరిట తరతరాలకు అందిస్తూ వస్తున్నారు. ‘‘అనేవాడికి పడేవాడు లోకువ’’, ‘‘చెప్పేవాడికి వినేవాడు లోకువ’’ వంటి సామెతలు ఎన్నో సందర్భాలలో ఎక్కువగా అనుభవంలోకి వస్తూ వుంటాయి. తిట్టే నోరు తిరిగే కాలు ఊరికే ఉండవు అని కొంతమందికి ఏదోపని కట్టుకుని ఇతరులలోని లోపాలను ఎంచుతూ ఏదో ఒకటి అంటూ వుండడం అలవాటుగా వుంటుం ది. ఈ సామెత మాత్రం అందరిలోను కొద్దో గొప్పో ఉండనే ఉంటుంది. సామెతలు అన్నారని కాదు కానీ ఎవరికి వారు తరచి చూసుకొంటే చాలు వెన్ను మీద చరిచినట్టు తెలుస్తుంది. చూశారా ఈ విషయం చెప్పడానికి సామెతనే పనికివచ్చింది. సామెతను పండి తులకైనా, పామరులకైనా నిత్యమూ నోట్లో నానేదే.
మాకు అన్నీ తెలుసు ఎవరి అనుభవం కాని ఎవరు చెప్పింది మాకు అక్కర్లేదు అనుకొన్నా ఒంటికొమ్ము సొంటిరాయ అనే సామెత అనకుండా ఉండలేము. ఎందుకంటే వారు వారితెలివితేటలతో పనిచేసి చివరకు అజ్ఞానం లో కూరుకుపోయ అహంకారంతో మిడిసిపడి కూర్చున్న చోటు నుంచి ఇంకాస్త కిందకు దిగజారుతారు. అందుకే ఎంత తెలిసి ఉన్నా అనుభవంతో చెప్పే మాటలు విని తీరాలి. చదువుకున్న డాక్టరు కన్నా రోగి చెప్పేమందు మేలు అంటే రోగి చెప్పే మందు అనుభవంతో వచ్చింది డాక్టరు కేవలం చదువుకోవడం వచ్చింది కనుకనే అది ఒక్కో సారి పనిచేయక పోయనా రోగి చెప్పే మందు పనిచేసి తీరుతుంది.
పెద్దలు మాటలు వినడానికి సహనం అవసరం. వారు అనుభవంతో చెప్పే వైనా ఒక్కోసారి వారు అర్థం చేసుకున్న తీరు,దాన్ని చెప్పే తీరు వేరుగా ఉంటుంది. దావివల్ల ఇపుడు వినేవారిలో కొంత అసంతృప్తిని మిగులుస్తుంది. ఇంతేనే అనే భావం కూడా కలిగిస్తుంది. ఇలాంటపుడు కూడా సామెతలు తెలిసిఉంటే క్లిష్టసమస్యలైనా సులభంగా పరిష్కరించుకో వచ్చు. సామెతలు తెలుసు కొని ఉంటే ఎటువంటి పరిస్థితులనైనా సులభం గా ఎదుర్కోవచ్చు
సామెతల వల్ల కేవలం అనుభవజ్ఞానమే కాదు నీతి, నిజాయతీ ధర్మాచరణ వల్ల వచ్చే ఫలితమూ తెలుస్తుంది. ఒక్కోసారి నీతితప్పిన వారు చివరకు ఏ దశకు వస్తారో కూడా కళ్లకు కట్టినట్టు తెలుస్తుంది. అదే నీతితోను నిజాయతీతోను వ్యవహరించిన వారు వర్తమానంలో ఎన్ని కష్టాలు పడినా చివరకు వారు పరమశాంతిని పొందుతారు. వారిని భగవంతుడు కూడా మెచ్చుతాడు. అబద్దాలతోను, అవినీతితోను కాలం గపిపిన వారు అప్పటికప్పుడు విందులు వినోదాలతో ఉన్నట్టు అనిపించిన లోలోపల వారు భయపడుతూనే ఉంటారు. చివరకు తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు అన్నట్టుగానే వారు చేసిదానికి శిక్ష వేయనే వేస్తారు. దానితో పశ్చాత్తాపపడకమానరు. అట్లాంటి చూసినపుడు కూడా సామెతలు ఎంత ప్రభావవంతమైనవో తెలుస్తుంది.
ఎదుటివారు కీడుచేసినా మేలుపొంది నట్లుగా భావించేవారు పురాణాల్లో నే కాదు ఈ కలియుగంలోను కనిపిస్తుంటారు. అలాంటి వారి సంఖ్య తక్కువగా ఉంటుంది. పైగా వారికి ప్రచారాలు ఉండవు కనుక చాలామందికి తెలిసే అవకాశం తక్కువ. అందుకే పనికట్టుకునైనా ఇలాంటి వారిని రోజు స్మరించుకుంటూ ఉండాలి. వారిని ఆదర్శమూర్తులుగా పెటు టకోవాలి. అపుడు నీతి నిజాయతీలతోను, సమాజంలో మంచి మనుషులుగా ఇతరులు స్మరించుకునే అవకాశం కలిగించుకున్న మను ష్యులుగా మారుతారు. ఒకసారి ప్రళయం వచ్చింది. నీరు పంటలు అన్నీ ఎండి పోయా య. అలాంటి రోజుల్లో మానవులందరూ నీటి కోసం అలల్లాడుతున్న కాలంలో గౌతముడు వరుణినికోసం తపస్సుచేస్తాడు. దానివలన పైరులను సస్యశ్యామలం అవుతాయ. గౌతముని ఆశ్రమంలో ఉంటున్న కొందరు స్వార్థపరులు గోహత్యా పాతకానికి గురి అయ్యేట్టు చేసినా వారే తిరిగి ఆ పాపం దూరం కావడానికి శివునిగురించి తపస్సుచేయమని చెప్పినా కించిత్తు అయనా ఖేదం లేకుండా గౌతముడు శివునికోసం తపస్సుచేసి గంగను తెప్పించిన మహానుభావుడాయన. అట్లాంటి మహర్షులను స్మరించుకుంటూ జీవితాన్ని గడపాలి.

- వాణీప్రభాకరి