Others

ఇతిహాసాలే జాతి దిక్సూచికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామాయణం, మహాభారతం, భగవద్గీత, భాగవతం మానవజాతికి సరియైన దారిలో నడిపించే దిక్సూచికలు అంటారు. మనిషి జన్మ పొందిన వారు ఎలా నడుచుకోవాలి. ఏవిధమైన నడవడి ఉంటే ఎలాంటి జీవితం ఉంటుంది. మరుజన్మలో ఏవిధంగా ఉంటుందో చెప్తాయ. దేనికోసం అనే్వషించాలో కూడా ఇవి చెబుతాయ.
కౌరవుల్లో దుర్యోధనుడు అహంభావి. దురాలోచనాపరుడు. ఇతరులను హింసించి తాను ఆనందపడేవాడు. అందులోను పాండవులంటే అసలే పడదు. వారిని హింసిస్తే చాలా ఆనందం వస్తుందనుకొనేవాడు. అనేక సందర్భాల్లో తన మాటలు, చేతలతో శ్రీకృష్ణ్ఢు, బలరాముని ముందు పరాభవాలు పాలైనాడు. ‘లక్షణ’ దుర్యోధనుని అందాల కూతురు. ఆమెను శ్రీకృష్ణ జాంబవతిల కుమారుడు ‘సాంబుడు’ వివాహం చేసుకోజూసి ఎత్తుకెళ్లాడు. దుర్యోధనుడు, ఆయన సోదరులు దీన్ని పరాభవంగా భావించారు.
అందుకే సైన్యంతో మధుర వెళ్లి లక్షణతోపాటు సాహసవంతుడైన సాంబుడిని బంధించి హస్తినాపురానికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బాలరామకృష్ణులు, యాదవులు ఆగ్రహంతో ఊగిపోయారు. అప్రమత్తమైన యాదవ సైన్యం దండయాత్రకు సిద్ధపడింది. ‘‘మనం ఇప్పుడు కౌరవులతో వియ్యం కోరుకోవాలి కానీ, కయ్యం కాదు’’ అని బలరాముడు వారిని శాంతపరిచాడు. ఆయన బ్రాహ్మణులు, యాదవ పెద్దలను వెంటబెట్టుకొని గౌరవ మర్యాదలకు లోటురాకుండా హస్తినకు బయలుదేరాడు.
హస్తినాపురంలో బలరాముడు, యాదవ పెద్దలు కౌరవులకు అనేక విధాలుగా నచ్చచెబుతూ సాంబునితో లక్షణ వివాహం జరిపించ ఒప్పించడానికి ప్రయత్నించారు. అందుకు దుర్యోధనుడు ససేమిరా అన్నాడు. - పదిమంది యోధులు కలిసి ఒక్క కుమారున్ని బంధించి, తమ రాజ్యానికి తెచ్చుకోవడం న్యాయ సమ్మతం కాదు కాబట్టి, చేసిన తప్పొప్పుకొని పశ్చాత్తాపం చెందాలని బలరాముడన్నాడు. కానిఅదీ కుదరదని దుర్యోదనుడు అన్నాడు.
అంతవరకు ఎంతో ప్రశాంతంగా ఉన్న బలరాముడు కోపాగ్ని జ్వాలలు చిమ్మే కండ్లతో, పొంగిన నరాలతో ‘‘దుర్యోధనా! నీ తమ్ములు, శకుని, కర్ణుడూ మొదలైన వారి బలం చూసుకొని నువ్వింతగా మాటలు తూలుతున్నావ. కానీ త్వరలో వీటన్నిటికి మూల్యం చెల్లించుకోక తప్పదు’’అని హెచ్చరించాడు.
దానితో ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని కురుపెద్దలు భయాందోళనలకు గురయ్యారు. బలరాముడు బలవం తుడైనా కూడా మధురలో తన మంత్రులను, యాదవ పెద్దలను కూర్చోబెట్టి తక్షణ కర్తవ్యన్ని సూచించవలసిందిగా కోరాడు. చాలాసేపు తర్జన భర్జనలు జరిగాయి. అందరూ ముక్తకంఠంతో జాగుచేయక ధనమదాంధులైన కౌరవులకు తగిన బుద్ధి చెప్పవల్సిందేనని అన్నారు.
అపుడు బలిష్ఠుడైన బలరాముడు, కౌరవుల నామరూపాలు లేకుండా చేస్తానంటూ తన హలంతో హస్తినాపురాన్ని పెకలించి ఎండుటాకువలె ఎత్తి సముద్రంలో పడవేశాడు.
అంటే హస్తిన నీటిపై తేలియాడసాగింది. ప్రజల హాహాకారాలు ఆకాశాన్నాంటాయి. అపుడు ఇక చేసేదేమీ లేక దుర్యోధనుడు, ఆయన సోదరులు విచారంలో కూరుకునిపోయారు. భీష్మ ద్రోణ కృపాచార్యులు ఇది బలరాముని పనియేనని అనుకొన్నారు. ఆలస్యం చేయక లక్షణ సాంబుల వివాహం జరపడమే ఏకైక మార్గమని దుర్యోధనునికి సలహా ఇచ్చారు.
అపుడు వేరే ఆలోచనే లేక బలరామునికి బుద్ధి వచ్చిందని క్షమాపణ చెప్పుకుని లక్షణ సాంబుల వివాహం జరిపించాడు. ఎపుడూ అహంకారంతో మెలగ కూడదు. పెద్దలను గౌరవించాలి. పిన్నలు ఆదరించాలి. పరులను హింసించకూడదు. చేయగలిగితే సాయం చేయాలి. అదే పుణ్యం అవుతుంది. గర్వంతో నడిస్తే ముందుకు పడి దెబ్బలు తగులుతాయ. కనుక అహంకారం వదిలి చేయంచేది చేసేవాడు భగవంతుడే అని నమ్మి నడవడిని తీర్చిదిద్దుకోవాలి. భగవంతుడు మెచ్చేట్టు పని చేయాలి.

- సుజాత