Others

సూక్ష్మదృష్టితోనే అద్భుతాలు సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక గురువుగారు ఆశ్రమంలో చెట్ల క్రింద గురుకుల విద్యార్థులకు వేదాలు బోధిస్తున్నారు. అందరూ ఎంతో శ్రద్ధగా గురువుగారు బోధించే పాఠాలను చక్కగా వింటున్నారు. అంతలో ఒక విద్యార్థి లేచి నిలబడి గురువుగారూ మనం దేవునికి పూజలు చేసి నైవేద్యం సమర్పిస్తాము కదా! అపుడు స్వామివారు ఆ నైవేద్యాన్ని స్వీకరిస్తారా? ఒకవేళ ఆ నైవేద్యాన్ని భగవంతుడు గనుక తిన్నట్లయితే ఆ పాత్రలోని నైవేద్యం కాస్తయినా తరిగిపోవాలి కదా! మరెందుకు అలాగే పెట్టింది పెట్టినట్లే ఉంటుంది అని అడుగుతాడు. అయినప్పటికీ ఆ గురువుగారికి వినబడినప్పటికీ పట్టించుకోనట్లుగానే వేదాలు చెబుతూనే ఉంటాడు. అలా ఆ రోజుకి చెప్పాల్సిన శ్లోకాలు చెప్పిన తరువాత సరాసరి ఎవరైతే విద్యార్థి దేవుడు నైవేద్యం తింటాడా అని అడిగాడో, అతని దగ్గరికి వచ్చి, నాయనా! చెప్పిన విషయాలన్నీ అర్థమయ్యాయా అని అడిగినపుడు అర్థమయ్యాయని ఆ విద్యార్థి చెబుతాడు. ఒకసారి చెప్పగలవా వాటిని అనగానే టకటకమని నేర్చుకున్న విషయాన్నంతటినీ చెప్పేస్తాడు. అపుడు ఆ గురువుగారు విద్యార్థినితో నేను చెప్పినదంతా ఈ గ్రంథంలో వుంది. నీవు ఆ గ్రంథంలోని విషయాన్నంతటినీ నేర్చుకొని జ్ఞానాన్ని పొందావు. అంటే ఆ గ్రంథంలోని విషయాలను, సారాంశాన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్నావన్నమాట. మరి అలా ఆ గ్రంథంలోని జ్ఞానాన్ని నీ మెదడు ద్వారా తీసుకున్నప్పుడు అందులోని అక్షరాలు తరిగిపోవాలి కదా! మరి ఎందుకని తరిగిపోలేదు?
అంటే ఆ గ్రంథంలోని విషయ పరిజ్ఞానాన్ని సూక్ష్మదృష్టిలో స్వీకరించావన్నమాట. ఇంకా చెప్పాలంటే, కళ్ళతో చూసి, మనసుతో మెదడులోకి ఎక్కించుకున్నావన్నమాట. మరి అలా కళ్ళతో చూసిన విషయాన్ని మనస్సుతో స్వీకరించడంవల్ల ఆ గ్రంథంలోని అక్షరాలు నీవు భౌతికంగా వాటిని తీసుకోలేదు కదా! అదేవిధంగా పూజలు చేసి నైవేద్యాన్ని నివేదించినపుడు ఆ భగవంతుడు తన మనస్సుతో భక్తులు పెట్టిన నైవేద్యాన్ని అంతే సూక్ష్మదృష్టిలో స్వీకరిస్తాడు. అలా నివేదన చేసిన నైవేద్యాన్ని మనం దైవప్రసాదంగా స్వీకరిస్తాము. దేవుడికి పెట్టిన నైవేద్యం అయినా, పుస్తకాల్లోని విషయ పరిజ్ఞానం అయినా సూక్ష్మదృష్టితో తీసుకోవాల్సిందే. దానిని భౌతికంగా తీసుకోలేము. అందుకే దేవుడికి నివేదించాల్సిన నైవేద్యం కానీ, పుస్తకాల్లోని జ్ఞానం కానీ తరిగిపోదు.

-పర్వతాల శ్రీనివాస్