AADIVAVRAM - Others

ఫాస్‌పోర్ట్ ఎలా పుట్టింది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీ ప్రయాణం చేసేముందు మనం ఎన్నోసార్లు పాస్‌పోర్ట్ చెల్లుతుందా? లేదా? అని మరీ మరీ చెక్ చేసుకుంటాం కదా.. ఈ క్షణంలో కూడా ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఆ పనిలోనే ఉండి ఉంటారు. పాస్‌పోర్టులు ఏ రంగులో ఉన్నా, వాటిపై ఎలాంటి స్టాంపులున్నా అవన్నీ ఒకే కథను వివరిస్తాయి. ప్రపంచాన్ని చుట్టి రావడానికి అవసరమైన ఈ ముఖ్యమైన పత్రాల గురించి చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. అవేంటంటే..
* మొదటి పాస్‌పోర్ట్ వెనుక ఓ అసక్తికరమైన కథనం ఉంది. హీబ్రూ బైబిల్ ప్రకారం.. 16వ శతాబ్దంలో పర్షియాకు చెందిన మొదటి ఆర్టాజెర్క్సిస్ జుడియాలో స్వేచ్ఛగా ప్రయాణించడానికి ఒక అధికారిత పత్రాన్ని జారీ చేశాడు. దానే్న అందరూ మొదటి పాస్‌పోర్ట్‌గా భావిస్తున్నారు.
* స్కాండినేవియన్ పాస్‌పోర్టులకు ఒక ప్రత్యేకత ఉంది. వాటిని గనుక అల్ట్రావయోలెట్ లైట్ కింద పెడితే కాగితంపై ఉత్తర ధ్రువ ప్రభ కనిపిస్తుంది.
* మొదట్లో పాస్‌పోర్టులపై పాస్‌పోర్టులపై ఫొటోలు ఉండేవి కావు. ఆ అవసరం కూడా అప్పుడు రాలేదు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ గూఢచర్యం కోసం నకిలీ పాస్‌పోర్టులతో బ్రిటన్‌లోకి ప్రవేశించడంతో వాటిపై ఫొటోలను ఉపయోగించడం ప్రారంభమైంది.
* అమెరికాలో మనిషి బరువు తగ్గినా, పెరిగినా లేదా మొహంపై ఉన్న పచ్చబొట్లను తొలగించుకున్నా, ఫేషియల్ సర్జరీ చేయించుకున్నా తప్పకుండా పాస్‌పోర్టును అప్‌డేట్ చేసుకోవాల్సిందే.. రూపం మారితే కొత్త పాస్‌పోర్టు కావాల్సిందే..
* పాస్‌పోర్టులు వచ్చిన కొత్తలో ఇష్టం వచ్చినట్లు ఫొటోలను పాస్‌పోర్టులో అతికించే వీలుండేది. మొత్తం కుటుంబం ఫొటోలను కూడా అతికించేవారు. తర్వాతి కాలంలో కేవలం ఒక్కరి ఫొటో మాత్రమే ఉండే పాస్‌పోర్టులు వచ్చాయి. గతంలో పాస్‌పోర్టుపై కుటుంబ ఫొటోలనూ అనుమతించేవారు.
* బయటి దేశాలకు వెళ్లేముందు పాస్‌పోర్టు ముగిసే గడువును సరిచూసుకోవాలి. చాలా యూరప్ దేశాలు ఆ దేశంలోకి ప్రవేశించాక 90 రోజుల పాటు పాస్‌పోర్టు చెల్లుబాటు కావాలనే షరతను విధిస్తాయి. అయితే.. మరింత జాగ్రత్త కోసం అవి ఆరు నెలలపాటు చెల్లుబాటయ్యేలా చూసుకోవాలి. చైనా, ఇండోనేషియా, రష్యా, సౌదీ అరేబియాలు ఈ ఆరునెలల గడువును కోరతాయి.
* క్వీన్స్‌ల్యాండ్ నుండి ఆస్ట్రేలియాలోకి ప్రవేశిస్తే పాస్‌పోర్టు అవసరం లేదు. ఈ షరతు కేవలం పపువా న్యూ గినీకి చెందిన తొమ్మిది ప్రత్యేక తీర గ్రామాలకు చెందిన వారికి మాత్రమే వర్తిస్తుంది. పపువా న్యూ గినీ స్వాతంత్య్రం పొందినప్పుడు జరిగిన ఒప్పందంలో ఇలా పాస్‌పోర్టు లేకుండా ఆస్ట్రేలియాలో ప్రవేశించవచ్చనే నిబంధన చేర్చారు.
* వాటికన్‌లో ప్రవేశించడానికి ఎలాంటి పాస్‌పోర్టు నియంత్రణలూ లేవు. మొదట ఇటలీలోకి ప్రవేశించగలిగితే, తరువాత వాటికన్ సిటీలోకి ప్రవేశించవచ్చు. వాటికన్‌కు వెళ్లినట్లు పాస్‌పోర్టులపై ఎలాంటి అధికారిక ముద్ర కూడా ఉండదు.
* ఎంతో అభివృద్ధి చెందిన దేశంగా భావించే అమెరికాలో చాలామంది పౌరుల వద్ద పాస్‌పోర్టులు లేవు. అమెరికా విదేశాంగ శాఖ ప్రకారం 321, 362, 789 మంది అమెరికా పౌరుల్లో.. కేవలం 121, 512, 341 మంది దగ్గర మాత్రమే పాస్‌పోర్టులు ఉన్నాయి.
* నికరాగువా పాస్‌పోర్టుపై హోలోగ్రామ్‌లు, వాటర్ మార్కులలాంటి 89 వేర్వేరు సెక్యూరిటీ ఫీచర్లు ఉంటాయి. కాబట్టి ఆ దేశం పాస్‌పోర్టును ఫోర్జరీ చేయడం దాదాపు అసాధ్యమే..
* గతంలో టోంగా పాస్‌పోర్టులను విక్రయించేవారు. ఒక్కో పాస్‌పోర్టు ఖరీదు రూ. 14 లక్షలు. గతంలో టోంగా రాజైన నాలుగో తౌఫాఅహౌ తుపోవ్ పాలనలో దేశం ఆదాయం పెంచే లక్ష్యంతో టోంగా పాస్‌పోర్టులను భారీ ధరకు విక్రయించేవారు.
* ఫిన్లాండ్, స్లొవేనియా పాస్‌పోర్టులు ప్లికర్ బుక్స్‌లా ఉపయోగపడతారు. ఎప్పుడైనా ఎయిర్‌పోర్టులో బోర్ కొడుతుంటే పాస్‌పోర్టుతో ఆడుకోవచ్చు. ఆ రెండు దేశాల పాస్‌పోర్టుల పేజీలను వేగంగా ముందుకు తిప్పితే, ఆ పేజీలపై ఉన్న బొమ్మలు కదులుతున్న భ్రాంతి కలుగుతుంది.
* రెండో ఎలిజిబెత్ రాణికి పాస్‌పోర్ట్ తీసుకోవాలనే బెంగ లేదు. ఎందుకంటే యూకే పౌరుల పాస్‌పోర్టులన్నీ ఆమె పేరుతోనే మంజూరు అవుతాయి.