AADIVAVRAM - Others

ఇంట్లో లేకున్నా డోర్ డెలివరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆన్‌లైన్‌లో బుక్ చేసిన వస్తువులు కాసేపట్లో హోమ్ డెలివరీ కావాల్సి ఉంది. కానీ అర్జెంటు పనిపై మరో ఊరికి వెళ్లాలి. అందుబాటులో ఎవరూ లేరు. రెండు పనులూ అత్యవసరమే.. అలాంటప్పుడు ఏం చేస్తాం? ఒకటి కావాలంటే మరోటి త్యాగం చేయాల్సిందే.. అనుకుంటాం. ఇలాంటి సందిగ్ధ పరిస్థితులను అమెజాన్ అర్థం చేసుకుంది కాబోలు.. మరింత మెరుగైన హోమ్ డెలివరీ చేసేందుకు ప్రయత్నం చేసింది. అదే అమెజాన్ ‘కీ’ సర్వీస్. అమెజాన్ ఈ కొత్త సర్వీసుతో ఏదో ఒక పనిని త్యాగం చేయాల్సిన పని లేకుండా సమస్య నుంచి బయటపడొచ్చు.. ఇంట్లో మనం ఉన్నా లేకున్నా కొరియర్ బాయ్ ఇంటి తాళం తీసి వస్తువులు ఇంట్లో పెట్టేస్తాడు. అయితే ఇదంతా ఎలా? అనే కదా ఆలోచిస్తున్నారు. అయితే ఇది చదవండి..
* ముందుగా అమెజాన్ ‘కీ’ పనిచేయాలంటే ఇంటికి స్మార్ట్ లాక్, క్లౌడ్ కామ్ కెమెరా ఉండాలి.
* కొరియర్ బాయ్ డెలివరీ కావాల్సిన ప్యాకేజీ బార్‌కోడ్‌ను ముందుగా స్కాన్ చేస్తాడు.
* బార్‌కోడ్ సాయంతో దాన్ని ఆన్‌లైన్‌లో వెరిఫై చేసుకుంటాడు.
* ఈ రెండు పనులు అయిపోగానే క్లౌడ్ కెమెరా డెలివరీ బాయ్ కదలికలను రికార్డు చేయడం ప్రారంభిస్తుంది.
* ఆప్ సాయంతో కొరియన్ బాయ్ డోర్ లాక్ తీసి, వస్తువులను ఇంట్లో పెడతాడు. తిరిగి డోర్ లాక్ చేస్తాడు.
* డోర్ లాక్ తీయడం దగ్గరి నుంచి వస్తువులను ఇంట్లో పెట్టడం, తిరిగి డోర్ లాక్ చేయడం వరకు అంతా కెమెరాలో రికార్డవుతుంది.
* హోమ్ డెలివరీ చేస్తున్నప్పుడు ఆ దృశ్యాలను మనం ఎక్కడినుంచైనా లైవ్‌లో చూడొచ్చు. లేదంటే అమెజాన్ సంస్థ ఆ వీడియోను మనకు ఈ-మెయిల్ చేస్తుంది. అయితే ఇది సురక్షితమని భావిస్తేనే వినియోగదారులు ఈ పద్ధతిని ఎంచుకోవచ్చు.. అని నిపుణుల అభిప్రాయం.
* బంధువులకు, ఇంట్లో పనివారికి ఈ పద్ధతిని ఉపయోగించవచ్చు.
ప్రతి ఇంట్లో దేన్నీ వదలకుండా అమెజాన్ అన్నింటినీ టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోందని సీసీఎస్ ఇన్‌సైట్ నిపుణులు బెన్‌వూడ్ అంటున్నారు. వీడియో డోర్‌బెల్, స్మార్ట్‌లాక్ సాయంతో తన గారేజ్‌ను తెరిచేందుకు కొరియర్ బాయ్‌కి పర్మిషన్ ఇచ్చానని, ఈ సర్వీస్‌ను తాను ఉపయోగించుకున్నానని అతను వివరించారు. ఇంటి తాళం కొరియర్ బాయ్‌కి అప్పగించడం కాస్త ఇబ్బందే అయినా, తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని ఉపయోగించవచ్చని వారు అంటున్నారు. భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకునే ఉంటారని భావిస్తున్నట్లు, భద్రత సరిగా లేదని భావిస్తే ఎవరూ అమెజాన్ ‘కీ’ని ఉపయోగించబోరని బెన్‌వూడ్ అభిప్రాయపడుతున్నారు. ఇంటర్నెట్‌తో అనుసంధానించిన అలారమ్, వీడియో స్ట్రీమింగ్ డోర్ బెల్, యాలీ స్మార్ట్‌లాక్‌లు వాటిలో ఉన్నాయి. ఎక్కడో ఉండి కూడా ఇంటి తాళం తీసేందుకు ఇవి ఉపకరిస్తాయి. బంధువులు, స్నేహితులు, కొరియర్ బాయ్‌లు ఇంటి తాళం తీసేలా సెట్ చేసుకోవచ్చు. అంతే ‘స్మార్ట్’గా ఆలోచిస్తే చాలు.. ఏదైనా సాధ్యమే!